Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ? ఈసారి రచ్చ మామూలుగా ఉండదు..

బిగ్‌బాస్ తెలుగు 10 త్వరలో ప్రారంభం కానుంది. ఈ మెగా షో గ్రాండ్ లాంచ్ గురించి ఇప్పటికే హోస్ట్ అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. దాంతో ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు? ఎంతమంది హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో ఎవరో ఒక సెలబ్రిటీ బిగ్‌బాస్‌లో అడుగుపెడుతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

గతేడాది మాదిరిగానే ఈ సీజన్‌లోనూ కామన్‌మెన్‌కు అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. బిగ్‌బాస్ సీజన్ 10 కోసం అగ్నిపరీక్ష సీజన్ 2 కోసం దరఖాస్తులు చేసుకునేందుకు జూన్ 20వ తేదీ చివరి తేదీగా ప్రకటించింది. ఇప్పటికే సామాన్యుల నుంచి భారీగా అప్లికేషన్స్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. గతేడాది సామాన్యుడు విజయం సాధించడంతో వారు ఇచ్చిన స్పూర్తితో మరింత మంది ఆశావహులు పోటీపడుతున్నారు. వచ్చిన దరఖాస్తులను వడపోసి.. వారిలో కొందరిని సెలెక్ట్ చేసి బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా 5 మంది వరకు సామాన్యులకు కంటెస్టెంట్స్‌గా అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు.

Bigg Boss Telugu 10 Jabardasth Fame Pavithra Rumoured To Enter The House As Contestant

ఇక బిగ్‌బాస్ తెలుగు 10 కంటెస్టెంట్స్‌ లిస్ట్‌లో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో బుల్లితెర నటి పల్లవి గౌడ, రాకింగ్ రాకేష్, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్ పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా జబర్దస్త్ ఫేమ్, కమెడియన్ పవిత్ర ఈసారి హౌస్‌లో అడుగుపెడుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మేల్ డామినేషన్ కనిపించే జబర్దస్త్‌లో లేడీ కమెడియన్స్ చాలా తక్కువ మందే ఉన్నారు. వారిలో పవిత్ర కూడా ఒకరు. తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పవిత్ర. అన్ని టీమ్‌లలోనూ పనిచేసిన ఆమె ఆఫ్‌స్క్రీన్‌లోనూ అల్లరి చేస్తూ ఫన్ క్రియేట్ చేస్తుంటారు.

ఒకప్పుడు సెలూన్ పార్లర్‌లో పనిచేసిన పవిత్ర.. తన కష్టంతో ఈ స్థాయికి వచ్చారు. ఆమె తండ్రి లారీ డ్రైవర్ .. మద్యానికి బానిస అయ్యి కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదని, తన తల్లే కూలి పనులు చేసి పెంచి పోషించిందని పవిత్ర పలు ఇంటర్వ్యూలలో చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. హైదరాబాద్‌లో సెలూన్ పార్లర్‌లో పనిచేస్తున్న సమయంలో అనుకోకుండా జబర్దస్త్‌లో పవిత్రకు అవకాశం వచ్చింది. ఈ మెగా కామెడీ షోలో అవకాశం రావడంతో ఆమె జీవితమే మారిపోయింది. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో పాటు కొన్ని షోలలో పాల్గొంటూ తన కామెడీతో నవ్విస్తున్నారు పవిత్ర.

తనకున్న ఫేమ్ కారణంగా పవిత్ర.... బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా రాబోతోందని పలుమార్లు ఊహాగానాలు వినిపించాయి. ఈసారి కూడా అదే వరుసలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జబర్దస్త్ టీమ్ పవిత్రను సంప్రదించారని, ప్రస్తుతం చర్చల దశలో ఉందని దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ పవిత్ర కనుక బిగ్‌బాస్‌లో అడుగుపెడితే ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవ ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో రోహిణి రెడ్డి మాదిరిగానే పవిత్ర కూడా పంచ్‌లు, సెటైర్లు పేల్చడంలో దిట్ట. దాంతో ఆవిడ ఈ షోకి వస్తే బాగుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతోందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X