Bigg Boss Telugu 10 Contestant List: బిగ్‌బాస్ తెలుగు 10లోకి సెలబ్రిటీల లిస్ట్ ఇదేనట.. మీ ఫేవరేట్ ఉన్నారా?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 షో ప్రారంభానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్ల ఎంపిక ప్రాథమికంగా పూర్తయింది. కంటెస్టెంట్లను ఫైనలైజ్ చేసేందుకు వారితో రూల్స్, రెగ్యులేషన్స్ మాట్లాడుతూనే కామన్ కేటగిరిలో కంటెస్టెంట్ల ఎంపికను మొదలు పెడుతున్నారు. అయితే ఇప్పటి వరకు స్టార్ మా, ఎండెమాల్ షైన్ ఇండియా నుంచి ప్రిలిమినరీ రౌండ్‌ టాక్స్ జరిగినట్టుగా ప్రచారం అవుతున్న వార పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్‌లో పాల్గొనడానికి అవకాశం ఉన్న కంటెస్టెంట్లు ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 10 సీజన్‌కు సంబంధించిన టీజర్, ప్రోమోలతో క్రేజ్ పెంచారు. ఈ సీజన్ కూడా ఏ మాత్రం తగ్గి చేయడం లేదు. గత 9 సీజన్లను మైమరిపించే విధంగా ఇంటి సెట్, కాన్సెప్ట్‌లను డిజైన్ చేస్తున్నాం. అలాగే అగ్ని పరీక్ష పేరుతో కామన్ మ్యాన్ కేటగిరిలో ఎంపిక చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దాంతో ఈ షోలోకి ఎవరెవరూ వస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Telugu 10 Probable contestant List

ఇక బిగ్‌బాస్ 10 సీజన్‌లోకి రావడానికి అవకాశం ఉన్న వారిలో సినిమా పరిశ్రమ నుంచి హీరో చంద్రహాస్, హీరోయిన్లు సుప్రీత, కావ్య, అభినవ్ గోమటం, యాంకర్ శ్యామల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. రాంనగర్ బన్నీ సినిమాతోను, ఈటీవీ ప్రభాకర్ కుమారుడిగా చంద్రహాస్, నటి సురేఖ వాణి కూతురిగా సుప్రీత అందరికి పరిచయమే.. రాకింగ్ రాకేష్, మహేష్ ఆచంట పేర్లు కూడా టాప్ లెవెల్‌లో వైరల్ అవుతున్నాయి.

టెలివిజన్ సీరియల్ యాక్టర్ల విషయానికి వస్తే.. నటి ప్రియాంక జైన్ బాయ్‌ఫ్రెండ్, యాక్టర్ శివకుమార్ ఈసారి కంపల్సరీ అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ బాబుగా పాపులారిటీ ఉన్న నిరుపమ్ పరిటాల, వంటలక్క ప్రేమీ విశ్వనాథ్, తేజస్వి గౌడ, రక్ష గౌడ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

ఇక ఈసారి జబర్దస్త్ ఆర్టిస్టులు హంగామా చేసేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తున్నది. రియాలీటీ షో స్టార్స్, జబర్దస్త్ వర్ష, హరిత, ఎక్స్‌ప్రెస్ హరి, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు దీపిక పిళ్లి, BSY, స్రవంతి, మై విలేజ్ షో అనిల్ గీలా పేర్లు కూడా దాదాపు ఖరారైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కామన్ మ్యాన్ కేటగిరి నుంచి మరో ఐదుగురిని షోలోకి తీసుకొనేందుకు సెలెక్షన్స్ మొదలయ్యాయి.

గత కొన్నీ సీజన్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున అక్కినేని ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు కావాల్సిన ప్రమోషనల్ వర్క్ షూట్ బిజీలో ఉన్నారు. ఈ షో సెట్‌ను జూలైలో ప్రారంభించేందుకు ప్లాన్ చేశారు. ఈ షోను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించేందుకు డేట్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. మరిన్నీ అప్‌డేట్స్ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X