Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్? ఆ వివాదంతో ట్రెండింగ్‌లో..

బిగ్‌బాస్ తెలుగు 10 త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. హోస్ట్ అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. దీంతో బుల్లితెర అభిమానులు బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్ ఎప్పుడు? కంటెస్టెంట్స్ ఎవరు? అంటూ ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్‌గా రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

ఇప్పటి వరకు 9 సీజన్లను పూర్తి చేసుకుని తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది బిగ్‌బాస్. మరికొద్దిరోజుల్లో 10 సీజన్‌తో అరుదైన మైలురాయిని అందుకోనుంది. దాంతో ఈ సీజన్ ప్రత్యేకంగా ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ల్యాండ్ మార్క్ సీజన్ కోసం బిగ్‌బాస్ దశావతారం కాన్సెప్ట్‌ను పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే వరుస ప్రోమోలతో బిగ్‌బాస్ నిర్వాహకులు 10వ సీజన్‌పై హైప్ పెంచేస్తున్నారు. దాంతో ఈసారి కంటెస్టెంట్స్‌గా పాల్గొనబోయేది ఎవరు? అంటూ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

Bigg Boss Telugu 10 Singer Mangli s Name Surfaces Among Possible Contestants

సినీతారలు, బుల్లితెర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, సింగర్లు, కొరియోగ్రాఫర్లు, యాంకర్లు ఇలా అన్ని కేటగిరీల నుంచి కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేయనున్నారు నిర్వాహకులు. అలాగే గత సీజన్‌లో మాదిరిగానే ఈసారి కూడా సామాన్యులకు కంటెస్టెంట్స్‌గా అవకాశం కల్పించే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో బిగ్‌బాస్ తెలుగు అగ్నిపరీక్ష సీజన్ 2 పేరుతో వడపోత కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు. దీనికి దరఖాస్తు ప్రక్రియ, రూల్స్ తదితర అంశాలపై త్వరలోనే కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

బిగ్‌బాస్ తెలుగు 10 కంటెస్టెంట్స్‌కు సంబంధించి పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఢీ ఫేమ్ పండు, ఆట సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ, బుల్లితెర స్టార్ ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు చంద్రహాస్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో స్టార్ సింగర్ మంగ్లీ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.

ఎక్కడో మారుమూల తండాలో పుట్టి తెలుగునాట సెలబ్రిటీగా ఎదిగారు మంగ్లీ. ఆమె అసలు పేరు సత్యవతి రాథోడ్. అనంతపురం జిల్లా గుత్తి మండలం బచ్చినేపల్లి తాండలో ఓ బంజార కుటుంబంలో జన్మించిన మంగ్లీ.. చదువు తర్వాత తిరుపతిలో కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నారు. ఆపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డాన్స్ విభాగంలో డిప్లొమో పూర్తి చేశారు. ఈ క్రమంలో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్‌లో ప్రసారమైన తీన్మార్ కార్యక్రమం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత పల్లె పాటలు, జానపద గీతాలతో మంగ్లీ చేసిన స్పెషల్ మ్యూజిక్ వీడియోలు తెలుగునాట ఆదరణను దక్కించుకున్నాయి.

బోనాలు, దసరా, సంక్రాంతి, శివరాత్రి తదితర పర్వదినాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా పాటలను విడుదల చేసి మరింత ఫేమ్ సంపాదించింది మంగ్లీ. ఆమె గొంతులో ఉన్న ప్రత్యేకత కారణంగా సినిమాల్లోనూ పాటలు పాడే అవకాశం దక్కించుకుంది మంగ్లీ. జార్జ్ రెడ్డి, అల వైకుంఠపురంలో, లవ్ స్టోరీ, క్రాక్, విక్రాంత్ రోణా తదితర సినిమాలలో మంగ్లీ పాడిన పాటలు మాస్ జనాన్ని ఊపు ఊపాయి. సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న దశలో మంగ్లీ పేరు ఓ వివాదంలో చిక్కుకుంది. గోకుల నందన అనే ఇన్‌ఫ్రా సంస్థలో మంగ్లీ, ఆమె సోదరుడు కలిసి దాదాపు 200 కోట్ల రూపాయల స్కామ్‌కి పాల్పడ్డారంటూ సుబ్బారావు అనే న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన మంగ్లీ.. ఇవన్నీ నిరాధార ఆరోపణలని తన ప్రతిష్టను దెబ్బతీయడానికే కొంతమంది ఇలా కుట్ర చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ వివాదం నేపథ్యంలో మంగ్లీ పేరు వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. దాంతో ఆమెను ఈసారి కంటెస్టెంట్‌గా తీసుకురావాలని బిగ్‌బాస్ టీమ్ ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మంగ్లీని బిగ్‌బాస్ నిర్వాహకులు సంప్రదించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన ఎనర్జీ, జోష్‌తో ఉత్సాహం తీసుకొచ్చే మంగ్లీ.. హౌస్‌లో ఉంటే ఆ మజాయే వేరు.. మరి ఆ ఆఫర్‌కు మంగ్లీ ఓకే అన్నారా? లేక ఇదంతా గాలివార్తలేనా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more about: bigg boss telugu singer mangli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X