అఖిల్ నువ్వు ఎలిమినేటేడ్.. సూట్ కేసు ప్యాక్ చేసుకొని బయటకు రా.. నాగార్జున షాక్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 10వ వారాంతంలో హోస్ట్ నాగార్జున అందర్నీ ఆటపట్టించడమే కాకుండా ఇంటి సభ్యులకు చుక్కలు చూపించారు. దీపావళీ పండగ కావడంతో టపాసులతో ఇంటి సభ్యులతో వినోదాన్ని పంచుకొన్నారు. ఇక అఖిల్‌తో వాడివేడిగా చర్చించారు. అయితే సీక్రెట్ రూం నుంచి నువ్వు సూట్ కేసు సర్దుకొని వేదికపైకి రా అంటూ నాగ్ వార్నింగ్ ఇస్తూ ఓ ప్రోమోను రిలీజ్ చేసి వారాంతపు షోపై ఆసక్తిని పెంచారు. అఖిల్‌కు నాగార్జునకు జరిగిన చర్చ ఏమిటంటే..

టైటిల్ గెలిచే ఉద్దేశం లేదా?
సీక్రెట్ రూంలో ఉన్న అఖిల్‌తో మాట్లాడుతూ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకొంటూ ఇంటి నుంచి బయటకు ఎలా వస్తావు. నీ టైటిల్ గెలిచే ఉద్దేశమే లేదా? అంటూ నాగ్ ప్రశ్నించడం కనిపించింది. నీకు బిగ్‌బాస్ విన్నర్ కావడం ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అంత ఈజీగా బయటకు వెళ్లిపోయావు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.

వీక్ కంటెస్టెంట్లతో గేమ్ ఆడుతారా?
నాగార్జున ప్రశ్నలకు అఖిల్ సమాధానం ఇస్తూ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్లను బయటకు పంపించి.. వీక్ కంటెస్టెంట్లతో గేమ్ ఆడుతారా అని అన్నాడు. ఆ కాలిక్యులేషన్ కారణంతోనే నేను బయటకు వచ్చాను అని అఖిల్ సమాధానం చెప్పాడు. అయితే నీ కాలిక్యులేషన్స్ అన్ని తప్పే అంటూ నాగార్జున షాకిచ్చాడు.

నీవు బయటకు రావడం తప్పు
ఇంటి సభ్యులు బయటకు వెళ్లాలని నామినేట్ చేయడంతో బయటకు రావడం చాలా తప్పు. నీవు నీ సూట్ కేస్ ప్యాక్ చేసుకొని వెంటనే నా వద్దకు రా. ప్యాక్ యువర్ బ్యాగ్స్ అంటూ నాగార్జున కఠినంగా మాట్లాడారు. ప్లీజ్ సార్ ఇంకోసారి నేను ఇలాంటి తప్పు చేయను అంటూ అఖిల్ చేతులు జోడించి ప్రాధేయపడ్డారు. కంటతడి పెట్టుకొని ఏడుస్తూ కనిపించాడు.
Recommended Video

సీక్రెట్ రూం నుంచి బయటకు రా..
అయినా అఖిల్ మాటలు వినిపించుకోకుండా నాగార్జున వార్నింగ్ ఇస్తున్నాడు. ప్యాక్ యువర్ బ్యాగ్.. సీక్రెట్ రూమ్ నుంచి బయటకు రండి. వేదిక మీద నేను వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో అఖిల్ తలపట్టుకొని ఏడుస్తూ కనిపించాడు. ఇలా అఖిల్ షాక్ ఇస్తూ నాగార్జున నిర్ణయం తీసుకొన్న ప్రోమోను విడుదల చేయగా అది వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











