Bigg Boss Telugu Nominations: షాకిచ్చిన బిగ్‌బాస్.. అందరూ నామినేషన్స్‌లోకి, మీ కళ్లు తెరిపిస్తానంటూ ఫైర్

బిగ్‌‌బాస్ తెలుగు 9 ఉత్కంఠగా సాగుతోంది. 9 వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్ 10వ వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం వచ్చిందంటే చాలు బిగ్‌బాస్ హౌస్ రణరంగంగా మారుతుంది. దీనికి కారణం నామినేషన్స్ జరగడమే. ఎప్పటిలాగే ఈ వారం కూడా బిగ్‌బాస్‌లో నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. సోమవారం కొద్దిమందికి నామినేట్ చేసే అవకాశం రాగా.. మంగళవారంఈ తంతు పూర్తయ్యింది. అయితే ఇక్కడే బిగ్‌బాస్ ఊహించని షాకిచ్చాడు. ఈ వివరాల్లోకి వెళితే..

పస లేకుండా నామినేషన్స్
మరో 5 వారాల్లో బిగ్‌‌బాస్ తెలుగు 9 ముగుస్తుండగా.. 10వ వారం కూడా నామినేషన్స్ తంతు ఏమాత్రం పస లేకుండానే సాగింది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో 9 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. దాంతో 10వ వారంలో నామినేషన్స్‌కి బిగ్‌బాస్ శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం ఇంటి సభ్యులను గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టి టైమర్ పెట్టాడు. ప్రతి కంటెస్టెంట్ ఒక ఇంటి సభ్యుడిని మాత్రమే నామినేట్ చేయాలని.. అలాగే మీ వాదనలు, డిస్కషన్స్ అన్నింటిని కేవలం 5 నిమిషాలలో పూర్తి చేయాలని కండీషన్ పెట్టాడు బిగ్‌బాస్. నామినేట్ అయిన వారు కుర్చీలో కూర్చొంటే వారిపై బురద నీరు పడుతుంది.

Bigg Boss Telugu 10th week Nominations Bharani Divya amp amp These Contestants Nominated For Eviction

భరణికి షాకిచ్చిన ఇమ్మూ
తొలుత కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ తన నామినేషన్‌ను భరణికి వేశాడు. కొత్త భరణిని చూస్తారని చెప్పారు.. కానీ రోజురోజుకు మీలో కసి తగ్గిపోతోందని, నిర్ణయాలు వేగంగా తీసుకోవడం లేదని ఇమ్మూ రీజన్ చెప్పాడు. ఆ తర్వాత దివ్యని రీతూ చౌదరి.. సంజనని గౌరవ్ గుప్తా.. నిఖిల్‌ని కళ్యాణ్, గౌరవ్‌ని దివ్య.. నిఖిల్‌ని సుమన్ శెట్టి.. గౌరవ్‌ని తనూజ పుట్టస్వామి... గౌరవ్‌ని డిమోన్ పవన్.. గౌరవ్‌ని సంజన, రీతూని నిఖిల్ నామినేట్ చేశారు.

పరీక్ష పేరుతో షాకిచ్చిన బిగ్‌బాస్
అయితే భరణిని ఎంతో గౌరవిస్తూ, సపోర్ట్‌గా మాట్లాడే దివ్య ఆయనని నామినేట్ చేయడం హైలైట్‌గా మారింది. నా వల్లనే మీరు ఎలిమినేట్ అయ్యారని.. నన్ను నామినేట్ చేస్తారా అంటూ పాయింట్స్ లాగింది. ఎట్టకేలకు నామినేషన్స్ అన్ని పూర్తయి భరణి శంకర్, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, దివ్య నిఖిత, గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్‌‌లు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. నామినేషన్స్ పూర్తయి అందరూ రిలాక్స్ అవుతుండగా బిగ్‌బాస్ షాకిచ్చాడు. మీ పని మీరు చేశారు.. అయితే ఇప్పుడు నా ఛాన్స్, మీ మీద ప్రేక్షకులకు ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవడానికి మీకో పరీక్ష పెడుతున్నానని బాంబు పేల్చాడు.

10వ వారం నామినేషన్స్‌‌లో ఎంతమంది అంటే?
దీనిలో భాగంగా అందరినీ నామినేట్ చేస్తున్నానని బిగ్‌బాస్ చెప్పడంతో కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. ఈ నామినేషన్స్ మీ కళ్లు తెరిపిస్తాయో? లేక బిగ్‌బాస్ తలుపులు తెరుచుకుంటాయో చూద్దామని చెప్పాడు. ఇక గత 9 వారాలుగా నామినేషన్స్‌లోకి రాకుండా ఇమ్మాన్యుయేల్ సంగతి కూడా చూడాలని బిగ్‌బాస్ నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా ఈసారి ఇమ్మాన్యుయేల్ సేవ్ అవ్వాలో లేదో తేల్చడానికి ఇంటి సభ్యులతో ఓటింగ్ పెట్టాడు. ఇందులో భరణి తప్పించి మిగిలిన అందరూ ఇమ్మాన్యుయేల్ సేవ్ కావాలని ఓటు వేశారు. దాంతో ఇమ్మాన్యుయేల్‌ తప్పించి మిగిలిన 10 మంది కంటెస్టెంట్స్ 10వ వారం నామినేషన్స్‌ నిలిచారు. మరి వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X