Bigg Boss Telugu 10th Week Voting: ఓటింగ్‌లో భరణి జోరు.. డేంజర్ జోన్‌లో ముగ్గురు టాప్ కంటెస్టెంట్స్..
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ 9 వారాలు పూర్తి చేసుకుని 10వ వారంలోకి అడుగుపెట్టింది. గత వారం అనూహ్యంగా రాము రాథోడ్ ఎలిమినేట్ కాగా.. బిగ్‌బాస్ డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇవ్వడంతో శ్రీనివాస సాయి కూడా హౌస్‌ను వీడాడు. మరో 5 వారాల్లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9కి ఎండ్ కార్డ్ పడనుండగా.. 10వ వారం హాట్ హాట్‌గా నామినేషన్స్ జరుగుతున్నాయి. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది. ఈ వివరాల్లోకి వెళితే...
హాట్ హాట్‌గా నామినేషన్స్
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం భరణి శంకర్, తనూజ పుట్టస్వామి, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, పవన్ కళ్యాణ్ పడాల, పవన్ డిమోన్, దివ్య నిఖిత, గౌరవ్ గుప్తా, సంజన గల్రానీ, నిఖిల్ నాయర్, ఇమ్మాన్యుయేల్‌లతో కలిపి 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. మరో 5 వారాల్లో బిగ్‌బాస్ ముగియనున్న నేపథ్యంలో వారానికి ఒక్కొక్కరినీ, మధ్యలో ఒక వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఫైనల్ వీక్‌కి హౌస్‌లో ఐదుగురిని మాత్రమే ఉంచేలా బిగ్‌బాస్ టీమ్ వేగంగా పావులు కదుపుతోంది. దీనికి తగినట్లుగానే 10వ వారం నామినేషన్స్ హాట్ హాట్‌గా జరిగాయి.

తప్పించుకున్న ఇమ్మాన్యుయేల్
ఎప్పటిలాగే సోమవారం నామినేషన్స్‌కు శ్రీకారం చుట్టారు బిగ్‌బాస్. అంతేకాదు.. ఎప్పుడూ ఇంటి సభ్యులు నామినేట్ చేయడానికి, తమ వాదనను వినిపించడానికి ఎంతైనా టైమ్ తీసుకోవచ్చు. కానీ ఈసారి మాత్రం కేవలం 5 నిమిషాలలో మాత్రమే నామినేషన్స్‌ను ఫినిష్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ వారం సంచలనం నమోదైంది. ఇప్పటి వరకు 9 వారాల పాటు నామినేషన్స్‌లోకి రాని ఇమ్మాన్యుయేల్.. ఈ వారం కూడా నామినేషన్స్ తప్పించుకున్నట్లే కనిపిస్తోంది. దాంతో ఆయన రికార్డ్ పదిలంగా ఉంది. నామినేషన్స్‌కు సంబంధించిన ప్రోమోను పరిశీలిస్తే..
నామినేషన్స్‌లో ఆరుగురు
మీలో ఫైర్ కనిపించడం లేదని భరణిని నామినేట్ చేశాడు ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత రీతూ చౌదరి.. దివ్యని నామినేట్ చేసింది. ఈ సందర్భంగా రీతూ తీసిన లాజిక్స్‌కు దివ్య నోటి వెంట మాటలు రాలేదు. కొందరినీ ఒక గ్యాంగ్‌గా పెట్టుకుని గేమ్ ఆడుతున్నావ్.. నువ్వు చెప్పినట్లు వాళ్లు చేయకుంటే బాణాలు వేస్తావా అంటూ ఫైర్ అయ్యింది. దీనికి దివ్య కూడా గట్టిగానే వాదనకు దిగింది. ఆ తర్వాత సంజనాని గౌరవ్ నామినేట్ చేశాడు. అలాగే నిఖిల్‌ను కళ్యాణ్ నామినేట్ చేశాడు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం బిగ్‌బాస్ తెలుగు 9లో పదవ వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది. వారు గౌరవ్ గుప్తా, సంజనా గల్రానీ, నిఖిల్ నాయర్, దివ్య నిఖిత, భరణి శంకర్, రీతూ చౌదరి. వీరిలో ఒకరు 10వ వారం ఎలిమినేట్ కానున్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు నామినేట్ కానున్నారు.
టాప్‌లో భరణి శంకర్
ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్‌ను పరిశీలిస్తే.. భరణి శంకర్‌కు జనాలు ఓట్లు గుద్దిపడేస్తున్నారు. దాంతో ఆయనకు 31.08 శాతం ఓటింగ్ లభించి టాప్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత రీతూ చౌదరి 26.51 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో ఉన్నారు. అనంతరం వరుసగా సంజనా గల్రానీ 15.12 శాతం, దివ్య నిఖిత 9.14 శాతం, గౌరవ్ గుప్తా 9.11 శాతం, నిఖిల్ నాయర్ 9.04 శాతం ఓటింగ్ సాధించారు. దీని ప్రకారం ఈ వారం దివ్య, గౌరవ్, నిఖిల్‌లు డేంజర్ జోన్‌లో నిలిచారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. అయితే ఓటింగ్ ముగియడానికి ఇంకా టైం ఉండటంతో ర్యాంకింగ్స్ మారే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











