Abijeet Vs Akhil in Bigg Boss Telugu 4: అఖిల్‌ను దారుణంగా అభిజిత్ ఫ్యాన్స్ ట్రోల్.. (వీడియో మీమ్స్)
బిగ్‌బాస్ ఇంటిలో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత అభిజిత్ అభిమానులు, అఖిల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఎపిసోడ్ ముగియక ముందే ఒకరి ఫ్యాన్స్ మరొకరిపై ట్రోలింగ్ చేస్తూ నేషనల్ వైడ్‌గా #Akhil #biggbossTelugu4 హ్యాష్ ట్యాగ్స్‌ను టాప్ ట్రెండింగ్‌గా మార్చారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను వీడియో మీమ్స్‌గా మార్చి అదరగొట్టేశారు. అఖిల్‌ను టార్గెట్‌గా చేసుకొని వదిలిన మీమ్స్ ఇవే..
ఓ నెటిజెన్ వీడియో మీమ్ వైరల్
అభిజిత్, అఖిల్ మధ్య పులి, మేక అనే అంశాలపై భారీగా వాగ్వాదం జరిగిన తర్వాత ఓ నెటిజన్ ఓ వీడియోను మీమ్‌గా పోస్టు చేశాడు. ఈ వీడియో మీమ్‌ను చివరి వరకు చూడండి అంటూ కామెంట్ చేశాడు.
అభిజిత్ అన్న పులిరా
అఖిల్‌కు సంబంధించిన కరివేపాకు ఫ్యాన్స్ ఈ వీడియో మీమ్. అభిజిత్ అన్న మాస్ యాటిట్యూడ్‌కు ఇది ప్రత్యక్ష సాక్షం.. అభిజిత్ అన్న పులిరా.. పులి గాండ్రిస్తున్నది అంటూ ఓ నెటిజన్ అభిజిత్‌పై అభిమానాన్ని చాటుకొంటూ వీడియో మీమ్‌ను వదిలాడు.
అఖిల్‌ను తీవ్రంగా ట్రోల్ చేస్తూ..
మటన్ షాప్ ఓనర్ గడ్డి చూపించాడు. మేక లోపలికి వెళ్లిపోయింది. కానీ ఏమి జరగలేదంటూ అభిజిత్‌ను ఉద్దేశించి అఖిల్ సెటైర్ వేస్తూ చెప్పిన డైలాగ్స్‌పై ఓ నెటిజన్ సెటైర్ వేశాడు. ఈ సందర్భంగా అఖిల్‌ను ట్రోల్ చేస్తూ ఓ నెటిజన్ వీడియో మీమ్‌ను వదిలాడు.
అఖిల్, అభిజిత్ తీరును ఖండిస్తూ..
ఇక అభిజిత్, అఖిల్ మధ్య జరిగిన ఫైట్‌ను తప్పుపడుతూ ఓ నెటిజన్ ఇద్దరిపై సెటైర్ వేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో వీడియో మీమ్ మీరే చూడండి అంటూ ఓ నెటిజన్ పోస్టు పెట్టారు. అయితే ట్రోలింగ్ పేరుతో హద్దుమీరి పోతున్నారనే కామెంట్ వినిపిస్తున్నాయి.

బిగ్‌బాస్ హిస్టరీలోనే చెత్త కంటెస్టెంట్
అభిజిత్‌పై అఖిల్ ఫైర్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలైంది. అఖిల్‌ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు దారుణమైన కామెంట్లు వదిలారు. బిగ్‌బాస్ హిస్టరీలోనే అతి చెత్త కంటెస్టెంట్.. కరివేపాకు అఖిల్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఎలా ఏడ్వాలో అఖిల్‌ను చూసి
ఇక మరో నెటిజన్ అఖిల్ ఏడుపు గురించి మాట్లాడుతూ సెటైర్ వేశాడు. జీవితంలో ఎలా ఏడువాలో నేర్చుకోవాలంటే బిగ్‌బాస్ తెలుగు 4లో అఖిల్‌ను చూసి నేర్చుకోవాలి అంటూ ఓ నెటిజన్ పోస్టు పెట్టారు.

హారికతో దారుణంగా, వల్గర్‌గా
అఖిల్‌తోపాటు సోహైల్‌ను కూడా నెటిజన్లు ఆడేసుకొన్నారు. కరివేపాకు, వేస్ట్ గాడి వల్గారిటీకి ఇదే సాక్ష్యం. ఎంతో ప్రేమగా చూసుకొన్న అమ్మాయిని దారుణంగా వంచించారు. వాళ్లవి చీప్ క్యారెక్టర్లు అనడానికి ఈ ఫోటోలే సాక్ష్యం అంటూ ఓ నెటిజన్ ట్రోల్ చేశాడు.

అఖిల్, సోహెల్ వల్గారిటీ
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో 71వ రోజున అఖిల్, సోహెల్ వల్గారిటీ చూసిన తర్వాత ఇంటిలో అభిజిత్ వ్యాల్యూ ఏమిటో స్పష్టంగా తెలిసింది. అభిజిత్‌ది రత్నం లాంటి క్యారెక్టర్. బిగ్‌బాస్ తెలుగు 4 గెలువడానికి అన్ని అర్హతలు ఉన్న కంటెస్టెంట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Recommended Video
సీక్రెట్ రూమ్‌లో చేతులెత్తి నాగార్జున
సీక్రెట్ రూమ్‌లో చేతులెత్తి నాగార్జున ముందు ఏడ్చిన అఖిల్ బయటకు వచ్చి.. నన్ను పులిలా బయటకు వదిలాడంటూ కామెంట్ చేయడంపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇంటిలో బాగా ఇగో ఉన్నందంటే.. అఖిల్‌కే అని ఎలాంటి అనుమానం లేకుండా చెప్పవచ్చు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











