twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోవిందా.. గోవిందా అంటూ మోనాల్.. జై కృష్ణ.. జై కృష్ణ అంటూ నాగ్.. మార్మోమోగిన బిగ్‌బాస్

    |

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో 12వ వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటిలో నామినేట్ అయిన నలుగురు సభ్యులు అఖిల్, అవినాష్, అరియానా గ్లోరి, మోనాల్ గజ్జర్‌‌ను సేవ్ చేసే కార్యక్రమాన్ని హోస్ట్ నాగార్జున చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యుల్లో ఆందోళన నెలకొన్నది. ఎవరు ఉంటారో.. ఎవరు బయటకు పోతారో అనే టెన్షన్ వారి ముఖాల్లో కనిపించింది. ఈ క్రమంలో ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే..

    12వ వారం ఎలిమినేషన్‌లో

    12వ వారం ఎలిమినేషన్‌లో

    12వ వారంలో శనివారం ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు నాగ్.. ఆసక్తికరమైన విషయాన్ని ఇంటి సభ్యులతో పంచుకొన్నారు. ఇటీవల ఓ వ్యక్తికి బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆ వ్యక్తికి సర్జరీ జరిగేటప్పుడు మెలకువగా, యాక్టింగ్‌గా ఉండేందుకు ఏదైనా వినోద కార్యక్రమాన్ని పెట్టాలని వైద్యులు నిర్ణయించారు. పేషెంట్ ఎలాంటి కార్యక్రమం పెట్టాలని అడిగితే.. బిగ్‌బాస్ షోను పెట్టండి అంటూ పేషంట్ కోరాడు. దాంతో బిగ్‌బాస్ షో పెట్టి సర్జరీ చేశారు. బిగ్‌బాస్‌కు బయట అంత క్రేజ్ ఉంది అంటూ నాగార్జున బయటపెట్టడంతో ఇంటి సభ్యులు సంతోషంలో మునిగిపోయారు.

     మోనాల్ సేవ్ కావడంతో

    మోనాల్ సేవ్ కావడంతో

    ఎలిమినేషన్ ప్రారంభిస్తూ.. అఖిల్, అరియానా, మోనాల్, అవినాష్ నిలబెట్టి వారి చేతిలో ప్యాడ్స్ పెట్టారు. ఆ ప్యాడ్‌లో ఓ కార్డు ఉండగా దానిని లాగాలని సూచించారు. ఆ తర్వాత దాంతో ఎవరు సేవ్ అయ్యారు? ఎవరు అన్‌సేవ్ అయ్యారు అనే విషయం ఉంటుందని చెప్పారు. అందరూ కార్డు లాగగా మోనాల్ సేవ్ అని వచ్చింది. దాంతో ఆమె ఉద్వేగంతో గంతులు వేసింది.

    తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్

    తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్

    ఎలిమినేషన్‌ నుంచి సేవ్ అయిన మోనాల్‌కు నాగార్జున కంగ్రాట్స్ చెప్పారు. ఇంటి సభ్యులు కూడా ఆమెను కౌగిలించుకొని అభినందించారు. ఈ సందర్భంగా మోనాల్ మాట్లాడుతూ.. ఈ వారం నాకు చాలా కీలకమనే గ్రహించాను. అందుకోసం నేను నాకో కోసం స్టాండ్ తీసుకొన్నాను. నా పాయింట్ రేజ్ చేశాను. నన్ను తెలుగు ప్రేక్షకులు చక్కగా ఆదరించారు. వారందరికి నా థ్యాంక్స్ అంటూ ఎమోషనల్ అయ్యారు.

    గోవిందా.. గోవిందా. అంటూ మోనాల్

    గోవిందా.. గోవిందా. అంటూ మోనాల్

    ఎలిమినేషన్ నుంచి బయటపడిన ఆనందంలో మోనాల్ భావోద్వేగానికి గురైంది. గోవిందా.. గోవిందా అంటూ అరుపులు పెట్టింది. ఆ తర్వాత నాగ్ కూడా ఆమె ఆనందంలో పాలుపంచుకొన్నాడు. జై కృష్ణ .. జై క‌ృష్ణ అంటూ నాగ్ కూడా కృష్ణ నామజపం చేశాడు. నీ కోసం నీవు ఆడావు. ప్రేక్షకులకు నచ్చింది. నిన్ను సేవ్ చేశారు అంటూ నాగ్ కితాబు ఇచ్చారు.

    Recommended Video

    Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
    డైలమాలో అవినాష్..

    డైలమాలో అవినాష్..

    ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో అవినాష్‌ను డైలామాలో పడేశాడు బిగ్‌బాస్. ఎవిక్షన్ ప్రీ పాస్‌ను నీ కోసం ఉపయోగించుకొంటావా? మరెవరి కోసమైనా ఉపయోగించుకొంటావా? ఈ వారం ఉపయోగించుకొంటావా? వచ్చే వారం ఉపయోగించుకొంటావా అంటూ ప్రశ్నించాడు. ఆ విషయాన్ని చెప్పాలంటూ నాగ్ స్పష్టం చేశాడు. ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో అవినాష్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు.

    English summary
    Bigg Boss Telugu 4 12th Weekend update: Monal Gajjar Saved from 12 week elimination. Nagarjuna Akkineni warns Abijeet Duddala. Apart from this, Monal Gajjar, Avinash, Ariana Glory, Akhil in the list for Elimination process. Ariana Glory request to Sohel to swap the nominations. Harika saved Abijeet with super power from Bigg Boss.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X