Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గోవిందా.. గోవిందా అంటూ మోనాల్.. జై కృష్ణ.. జై కృష్ణ అంటూ నాగ్.. మార్మోమోగిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో 12వ వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటిలో నామినేట్ అయిన నలుగురు సభ్యులు అఖిల్, అవినాష్, అరియానా గ్లోరి, మోనాల్ గజ్జర్‌ను సేవ్ చేసే కార్యక్రమాన్ని హోస్ట్ నాగార్జున చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యుల్లో ఆందోళన నెలకొన్నది. ఎవరు ఉంటారో.. ఎవరు బయటకు పోతారో అనే టెన్షన్ వారి ముఖాల్లో కనిపించింది. ఈ క్రమంలో ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే..
12వ వారం ఎలిమినేషన్లో
12వ వారంలో శనివారం ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు నాగ్.. ఆసక్తికరమైన విషయాన్ని ఇంటి సభ్యులతో పంచుకొన్నారు. ఇటీవల ఓ వ్యక్తికి బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆ వ్యక్తికి సర్జరీ జరిగేటప్పుడు మెలకువగా, యాక్టింగ్‌గా ఉండేందుకు ఏదైనా వినోద కార్యక్రమాన్ని పెట్టాలని వైద్యులు నిర్ణయించారు. పేషెంట్ ఎలాంటి కార్యక్రమం పెట్టాలని అడిగితే.. బిగ్‌బాస్ షోను పెట్టండి అంటూ పేషంట్ కోరాడు. దాంతో బిగ్‌బాస్ షో పెట్టి సర్జరీ చేశారు. బిగ్‌బాస్‌కు బయట అంత క్రేజ్ ఉంది అంటూ నాగార్జున బయటపెట్టడంతో ఇంటి సభ్యులు సంతోషంలో మునిగిపోయారు.
మోనాల్ సేవ్ కావడంతో
ఎలిమినేషన్ ప్రారంభిస్తూ.. అఖిల్, అరియానా, మోనాల్, అవినాష్ నిలబెట్టి వారి చేతిలో ప్యాడ్స్ పెట్టారు. ఆ ప్యాడ్‌లో ఓ కార్డు ఉండగా దానిని లాగాలని సూచించారు. ఆ తర్వాత దాంతో ఎవరు సేవ్ అయ్యారు? ఎవరు అన్‌సేవ్ అయ్యారు అనే విషయం ఉంటుందని చెప్పారు. అందరూ కార్డు లాగగా మోనాల్ సేవ్ అని వచ్చింది. దాంతో ఆమె ఉద్వేగంతో గంతులు వేసింది.
తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్
ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిన మోనాల్‌కు నాగార్జున కంగ్రాట్స్ చెప్పారు. ఇంటి సభ్యులు కూడా ఆమెను కౌగిలించుకొని అభినందించారు. ఈ సందర్భంగా మోనాల్ మాట్లాడుతూ.. ఈ వారం నాకు చాలా కీలకమనే గ్రహించాను. అందుకోసం నేను నాకో కోసం స్టాండ్ తీసుకొన్నాను. నా పాయింట్ రేజ్ చేశాను. నన్ను తెలుగు ప్రేక్షకులు చక్కగా ఆదరించారు. వారందరికి నా థ్యాంక్స్ అంటూ ఎమోషనల్ అయ్యారు.
గోవిందా.. గోవిందా. అంటూ మోనాల్
ఎలిమినేషన్ నుంచి బయటపడిన ఆనందంలో మోనాల్ భావోద్వేగానికి గురైంది. గోవిందా.. గోవిందా అంటూ అరుపులు పెట్టింది. ఆ తర్వాత నాగ్ కూడా ఆమె ఆనందంలో పాలుపంచుకొన్నాడు. జై కృష్ణ .. జై కృష్ణ అంటూ నాగ్ కూడా కృష్ణ నామజపం చేశాడు. నీ కోసం నీవు ఆడావు. ప్రేక్షకులకు నచ్చింది. నిన్ను సేవ్ చేశారు అంటూ నాగ్ కితాబు ఇచ్చారు.
Recommended Video
డైలమాలో అవినాష్..
ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో అవినాష్‌ను డైలామాలో పడేశాడు బిగ్‌బాస్. ఎవిక్షన్ ప్రీ పాస్‌ను నీ కోసం ఉపయోగించుకొంటావా? మరెవరి కోసమైనా ఉపయోగించుకొంటావా? ఈ వారం ఉపయోగించుకొంటావా? వచ్చే వారం ఉపయోగించుకొంటావా అంటూ ప్రశ్నించాడు. ఆ విషయాన్ని చెప్పాలంటూ నాగ్ స్పష్టం చేశాడు. ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్లో అవినాష్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు.