12వ వారం ఎలిమినేషన్‌లో హైడ్రామా.. అవినాష్‌కు షాకిచ్చిన బిగ్‌బాస్.. సుదీప్ రచ్చ రచ్చ

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 12వ వారం సుఖాంతంగా, వినోదంగా ముగిసింది. ఇంటిలో ఎలిమినేసన్‌లో లేకుండా బిగ్‌బాస్ ఓ ట్విస్టుతో ముగించాడు. ఎలిమినేసన్ ప్రక్రియకు ముందు సండేను ఫన్‌డేగా మార్చారు. ఇంటి సభ్యులతోపాటు ప్రేక్షకులకు బోలెడు వినోదాన్ని పంచారు. 84వ రోజు ఇంటిలో ఏం జరిగిందంటే..

నాగ్ పాటలకు కంటెస్టెంట్ల డ్యాన్స్

నాగ్ పాటలకు కంటెస్టెంట్ల డ్యాన్స్

హోస్ట్ నాగార్జున వేదికపైకి రాగానే ఆయనకు ఇంటి సభ్యులు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. నాగ్ నటించిన సినిమాల పాటలకు ఇంటి సభ్యులందరూ డ్యాన్స్ చేసి ఆకట్టుకొన్నారు. అభిజిత్‌ కూడా డ్యాన్స్ చేయడం విశేషంగా మారింది. మంచిగా డ్యాన్స్ చేసిన అభిజిత్‌ను నాగ్ ప్రశంసించారు.

ఇంటి సభ్యులను చీకటి గదిలోకి

ఇంటి సభ్యులను చీకటి గదిలోకి

ఇక చీకటి గదిలో ధైర్యం.. స్థైర్యం అనే గేమ్‌ను ఇంటి సభ్యులతో ఆడించారు. డార్క్ డ్రాకుల్లా రూమ్‌లోకి ఇంటి సభ్యులను పంపించి మూడు వస్తువుల గుర్తించాలి. అలా ఇంటి సభ్యలను చీకటి గదిలోకి పంపించి ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు.

కిచ్చ సుదీప్ ఇంటిలోకి

కిచ్చ సుదీప్ ఇంటిలోకి

కన్నడ బిగ్‌బాస్ హోస్ట్, సూపర్ స్టార్ సుదీప్ కిచ్చ ఇంటిలోకి వచ్చారు. ఇంటిలోకి వచ్చిన సుదీప్ ఇంటి సభ్యులతో మాట్లాడారు. అవినాష్, అఖిల్‌ను చిలిపి ప్రశ్నలతో ఆటాడుకొన్నారు. ఇంటిలో ముగ్గురు అమ్మాయిల్లో ఎవరిని పెళ్లి చేసుకొంటావు.. ఎవరిని డేట్ చేసుకొంటావు? ఎవరిని చంపుతావు? అంటే మోనాల్ డేట్ చేసి.. హారిక ను పెళ్లి చేసుకొంటా.. అరియానా‌ను కిల్ చేస్తాను అని చెప్పాడు. ఆతర్వాత నామినేషన్‌లో ఉన్న ముగ్గురిలో అఖిల్‌ను సుదీప్ కిచ్చ సేవ్ చేశాడు.

ఎలిమినేషన్‌లో హైడ్రామా

ఎలిమినేషన్‌లో హైడ్రామా

ఇక ఎలిమినేషన్ కోసం అరియానా, అవినాష్ ఇంటిలో మిగిలారు. దాంతో ఇంటిలో హైడ్రామా మొదలైంది. నామినేషన్ టాస్క్‌లో ఉపయోగించినట్టుగానే కలర్ టోపిలను వారి ముందు పెట్టారు. ఇద్దరు చెరో టోపిలో చేయి పెట్టాలి. ఎవరి చేతికి గ్రీన్ కలర్ వస్తుందో వారు సేఫ్ అయినట్టు.. ఎవరి చేతికి రెడ్ కలర్ వస్తుందో వారు ఎలిమినేట్ అవుతారు అని గేమ్ రూల్‌ను నాగ్ చెప్పారు.

ముక్కు అవినాష్ సేవ్ అలా

ముక్కు అవినాష్ సేవ్ అలా

ఇక ఎలిమినేషన్‌కు ముందు అవినాష్ బిగ్ క్వశ్చన్ పెట్టారు. ఈ వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ఉపయోగించుకొంటావా? లేక వచ్చే వారం ఉపయోగించుకొంటావా లేదా ఎవరి కోసమైనా ఉపయోగించుకొంటావా అంటూ నాగ్ అడిగాడు. చివరకు తన కోసమే ఉపయోగించుకొంటానని అవినాష్ చెప్పారు. ఆ తర్వాత చేతిని క్యాప్ నుంచి బయటకు తీయమని చెప్పగా అవినాష్ చేతికి రెడ్.. అరియానా చేతికి గ్రీన్ కలర్ వచ్చింది. దాంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో అవినాష్, ప్రేక్షకుల ఓట్లతో అరియానా సేవ్ అయ్యారు. దీంతో ఇంటిలో సూపర్ సెవెన్ టీమ్ అలాగే ఉండిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X