Bigg Boss Telugu 14 Week Voting: బిగ్‏బాస్ ముద్దుబిడ్డకు షాక్.. టైటి‏ల్‏కు ఎసరు పెట్టినట్టేనా ?

Bigg Boss Telugu 14 Week Voting: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ కు చేరుకుంది. చివరి వారం దగ్గరపడుతున్న కొద్దీ హౌస్‌లో టెన్షన్ రెట్టింపు అవుతోంది. ఈ వారం బిగ్ బాస్ పూర్తిగా గేమ్‌ను తారుమారు చేసేలా, ఎవ్వరూ ఊహించని తీరు లో నామినేషన్స్‌ రద్దు చేశారు. ప్రత్యక్ష యుద్ధం టాస్క్‌ను ప్రకటించాడు. ఈ టాస్క్‌లో ఎవరైతే టాప్ స్కోర్ సాధిస్తారో? వారు నేరుగా టాప్ 5లోకి సేఫ్‌గా వెళ్లిపోతారు. మిగతా కంటెస్టెంట్లు నేరుగా ఎలిమినేషన్‌లో ఉన్నట్లే. దీనితో హౌస్‌లో హై వోల్టేజ్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం 14 వారం ఓటింగ్ ఎలా ఉంది? ఎవరు టాప్ లో నిలిచారు? ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారంటే..?

ఇక ఫినాలేకు చేరువవుతున్న కొద్దీ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. లీడర్‌బోర్డ్ టాస్క్ ముగిసిన అనంతరం తనూజ 335 పాయింట్లతో టాప్‌లో నిలవగా, ఆమె తరువాత సంజన, ఇమ్మానుయేల్ ఉన్నారు. టాప్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ తనూజకు ఓటు అప్పీల్ చేయడానికి భాగస్వామిని ఎంచుకునే పవర్ ఇచ్చాడు. ఇమ్మానుయేల్ బలం ఎక్కువగా ఉందని భావించిన తనూజ, సన్నిహితుల అంచనాలకు భిన్నంగా తెలివిగా సంజనను ఎంచుకుంది.

Bigg Boss Telugu 14th Week Voting Thanuja Leads But Backlash Raises Doubts About the Title

బిగ్ బాస్ హిస్టరీలో మొట్టమొదటిసారి ఆడియన్స్ హౌస్‌లోకి రావడం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆడియన్స్ నేరుగా ప్రశ్నలు అడిగే ఆ సెషన్‌లో తనూజ ప్రశ్నల వర్షాన్ని ఎదుర్కొంది. 'ఆమె ఏడుపు నిజమా? భరణితో బంధం ఎలా మారింది? ఇమ్మానుయేల్‌పై ఎందుకు స్టేట్‌మెంట్లు మార్చింది?' వంటి ప్రశ్నలతో ఆడియన్స్ ఆమెపై దాడి చేశారు. చివరికి ఎక్కువ ప్లకార్డులు పొందిన తనూజకే ఓటు అప్పీల్ అవకాశం దక్కింది.

ఇక 14వ వారం ఆన్ లైన్, సోషల్ మీడియా ఓటింగ్ లెక్కలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. అన్‌ఆఫిషియల్ ట్రెండ్స్ ప్రకారం తనుజా పుట్టస్వామి 29.34 శాతం ఓట్లతో టాప్‌లో దూసుకెళ్తోంది. రెండో స్థానంలో 16.42 శాతం ఓట్లతో డిమోన్ పవన్ ఉన్నారు. టాస్కుల్లో అంతగా ప్రభావం చూపకపోయినా సంజన 15.4శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలవడం విశేషం. మొదటి వారాల నుంచే టాప్ 3లో ఉండే ఇమ్మానుయేల్ ఈ వారం 14.73% ఓట్లతో నాల్గవ స్థానానికి చేరుకోవడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

భరణీ శంకర్‌కు ఈ వారం ఓట్లు తగ్గడం పెద్ద షాక్‌గా మారింది. 13.94 శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉండడంతో అతడు డేంజర్ జోన్‌లోకి నిలిచారు. ఇక 10.12 శాతం ఓట్లతో సుమన్ శెట్టి ఓటింగ్ లిస్ట్ చివరన నిలిచి, ఎలిమినేషన్‌కు ప్రధాన కాండిడేట్‌గా కనిపిస్తున్నారు. ఇంకా గేమ్‌ను ఊహించలేనిదిగా మార్చేసింది ఇమ్మ్యూనిటీ టాస్క్. నిన్నటి టాస్క్‌లో ఇమ్మానుయేల్, డిమోన్ పవన్ టాప్ స్కోర్లు సాధించడంతో గేమ్ డైనమిక్స్ మొత్తం మారిపోయాయి. ఇమ్మానుయేల్‌కు ఓటు అప్పీల్ అవకాశం దక్కిందన్న ప్రచారం కూడా ఉంది.

మొత్తానికి బిగ్ బాస్ ప్రేమించే తనూజ ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నా, ఆడియన్స్ నుండి పెరుగుతున్న వ్యతిరేకత ఆమె టైటిల్ రేస్‌ను ప్రభావితం చేస్తుందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. వచ్చే రోజుల్లో ఈ సీజన్ ఫలితాన్ని పూర్తిగా నిర్ణయిస్తాయి. బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ ఎవరో? రన్నప్ ఎవరో? టాప్ 5 లో నిలిచేదేవరో ఇక వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X