హిమజతో అలీ మిస్ బిహేవ్.. అక్కడ చేయిపెట్టడంతో రచ్చరచ్చ.. ఇంట్లోకి డాక్టర్

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Episode 18,Day 17 Highlights || Filmibeat Telugu

బిగ్‌బాస్ రియాలిటీ షో 16వ రోజున కెప్టెన్సీ టాస్క్‌ ఘాటుగా సాగింది. ఇంటి సభ్యులు పరస్పర నిందారోపణలు, విమర్శలు, ఘాటైన మాటలతో హౌస్ దద్దరల్లింది. హిమజ, అలీ మధ్య గొడవ ఇంటిని కుదిపేసింది. దాంతో బిగ్‌బాస్ హౌస్ రెండుగా చీలిపోయింది. బుధవారం ఎపిసోడ్ రకరకాల ఎమోషన్స్‌కు వేదికగా నిలిచింది. వివరాల్లోకి వెళితే..

కెప్టెన్సీ టాస్క్‌లో

కెప్టెన్సీ టాస్క్‌లో

కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఇంట్లో దొంగ పోలీసు ఆట ఆసక్తిగా సాగింది. ఓ దశలో మాటల్లోపెట్టి వరుణ్ సందేశ్ నుంచి చాకచక్యంగా శ్రీముఖి డబ్బులు కొట్టేసింది. అలాగే ఇంటి సభ్యులు రకరకాల వ్యహాలతో కెప్టెన్సీని దక్కించుకొనేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఈక క్రమంలో వరుణ్ సందేశ్ తనకు కెప్టెన్సీ కావడం ఇష్టం లేదంటూ.. డబ్బును అలీ, మహేష్, రాహుల్‌కు పంచుతూ కనిపించారు.

హిమజా పాకెట్‌లోకి చేయి

హిమజా పాకెట్‌లోకి చేయి

ఇంటిలో నీళ్లను తాగినందుకు 100 రూపాయలు ఇవ్వాలని హిమజను అలీ వెంటాడాడు. ఈ క్రమంలో హిమజా పాకెట్‌లోకి చేయిపెట్టి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నించిన అలీని కాలితో ఏకంగా మొఖంపై తన్నింది. దాంతో అలీ సీరియస్ అయ్యాడు. తనను తన్నుతావా అంటూ వాగ్వాదానికి దిగాడు. అలా హిమజ, అలీ మధ్య గొడవ తీవ్రస్థాయికి పెరిగింది.

హిమజ సారీ చెప్పినా

హిమజ సారీ చెప్పినా

ఇక అలీ గొడవను తట్టుకోలేక హిమజ సారీ చెప్పింది. తన్నడ తన ఉద్దేశం కాదని, అందుకు సారీ చెబుతున్నానని చెప్పగా.. అలీ శాంతించలేదు. దాంతో అలీ కాళ్లపై పడి క్షమాపణలు చెప్పింది. ఈ విషయం ఇంటి సభ్యులను షాక్ గురిచేసింది. అలీ తీరును మహిళలు తప్పపట్టారు. అలీపై తమన్నా ఒంటికాలిపై లేచి మండిపడింది. దాంతో వారిద్దరి మధ్య గొడవలు తీవ్రంగా కనిపించాయి.

ఎక్కి ఎక్కి ఏడ్చిన

ఎక్కి ఎక్కి ఏడ్చిన

కాలితో తన్నిన సంఘటనపై అలీకి హిమజ వివరణ ఇచ్చింది. అయినా సంతృప్తి చెందకపోవడంతో హిమజ వాష్‌రూంలోకి ఎక్కి ఎక్కి ఏడ్చింది. ఆ తర్వాత బయటకు వచ్చి తన బాధను తోటి సభ్యులతో పంచుకొన్నది. ఇలా గొడవల మధ్య టాస్క్ కొనసాగుతుండగా మధ్యలో రాహుల్, శ్రీముఖి, ఇతరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది.

రవికృష్ణకు గాయంతో

రవికృష్ణకు గాయంతో

ఇంటి పెద్దగా వ్యవహరిస్తున్న వరుణ్ సందేశ్ ఖజానా నుంచి డబ్బు దొంగలించేందుకు శ్రీముఖి, రవికృష్ణ ప్లాన్ వేశారు. డంబెల్‌తో గాజు పెట్టెను పగలగొట్టి డబ్బు దోచుకోవాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో చేయితో పెట్టెను పగలకొట్టడంతో రవికృష్ణ చేతికి గాయమైంది. దాంతో ఇంట్లోకి డాక్టర్ వచ్చి ప్రాథమిక చికిత్స చేసింది. ఈ వ్యవహారంతో ఇంటి పెద్ద వరుణ్ డబ్బులు మొత్తం ఇచ్చేసేందుకు సిద్ధమయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X