twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కౌశల్, తనీష్ మధ్య అదే కుస్తీ.. బకరాగా మారిన రోల్ రైడా.. ఫైనల్‌కు సామ్రాట్!

    |

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu: 103 Day Highlights

    బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పటిలానే టాస్క్ సందర్బంగా గొడవలు జరిగాయి. రేస్ ఫినాలే టాస్క్, హేర్ బాటమ్ మౌంట్ ఫ్రిజ్ టాస్కులను నిర్వహించారు. రేస్ టూ ఫినాలే సందర్బంగా సామ్రాట్‌కు తనీష్, గీతా మాధురి, దీప్తి మద్దతు తెలుపగా, రోల్ రైడాకు కౌశల్ మద్దతు సపోర్ట్ చేశాడు. కోడిగుడ్లను కాపాడుకొనే టాస్క్‌ను గందరగోళం మధ్య పూర్తి చేశారు. పలుమార్లు ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ హెచ్చరికలు జారీ చేశారు. అసలేం జరిగిందంటే..

    రేస్ టూ ఫినాలే లెవెల్ 2

    రేస్ టూ ఫినాలే లెవెల్ 2

    రేస్ టూ ఫినాలే టాస్క్ లెవెల్ 2ను బిగ్‌బాస్ ప్రారంభించాడు. అందులో ఇప్పటికే లెవెల్ 2కు క్వాలిఫై అయిన సామ్రాట్, రోల్ రైడా ఆటను ప్రారంభించారు. పాత్రలో ఉన్న కోడిగుడ్లను కాపాడుకోవాలని సూచించాడు. ఒకరికి మద్దతు తెలుపుతూ, మరొకరి కోడిగుడ్లు పాడు చేయాలని సూచించాడు.

    సామ్రాట్ వర్సెస్ రోల్ రైడా

    సామ్రాట్ వర్సెస్ రోల్ రైడా

    రేస్ టూ ఫినాలే టాస్క్‌లో రోల్ రైడాకు కౌశల్ మద్దతు తెలుపగా, సామ్రాట్‌కు తనీష్, దీప్తి, గీతా మాధురి సపోర్ట్ చేయడంతో ఆట రంజుగా సాగింది. రోల్ రైడా కిచెన్ బాక్స్‌లో దూరిపోయాడు. సామ్రాట్ స్విమ్మింగ్ పూల్ వద్ద నిలబడగా, గీతా, దీప్తి కాపలగా నిలిచారు. రోల్ రైడా గుడ్లను పగలకొట్టేందుకు ప్రయత్నించగా కౌశల్ అడ్డుకొన్నాడు.

    రోల్ రైడాను మానసికంగా బ్లాక్ మెయిల్

    రోల్ రైడాను మానసికంగా బ్లాక్ మెయిల్

    రోల్ రైడాను కన్విన్స్ చేయడానికి తనీష్ చాలా ప్రయత్నించాడు. సామ్రాట్‌ను ఫైనల్ పంపించేందుకు చర్చలు జరిపాడు. అలాగే రోల్ రైడాను మానసికంగా బ్లాక్ మెయిల్ చేసేందుకు తనీష్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. కాసేపు కౌశల్ అండతో రోల్ రైడా గేమ్ ఆడాడు.

    తనీష్, కౌశల్ దాడులు

    తనీష్, కౌశల్ దాడులు

    రోల్ టూ ఫినాలే టాస్క్‌లో తనీష్, కౌశల్ భౌతికంగా దాడులు చేసుకోవడంతో బిగ్‌బాస్ హెచ్చరించారు. రోల్ రైడాను బాక్స్ నుంచి బయటకు రావాలని హెచ్చరించాడు. దాంతో రోల్ బయటకు రావడంతో గీతా, దీప్తి గుడ్లను పగులకొట్టాడు. అనంతరం సామ్రాట్ గుడ్లను కౌశల్, రోల్ పగులకొట్టేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత రోల్ పోటీ నుంచి తప్పుకోవడంతో సామ్రాట్ విజేతగా నిలిచాడు

    రోల్ రైడా బకరాగా మారి

    రోల్ రైడా బకరాగా మారి

    రోల్‌రైడా తప్పుకొని బకరాగా మారడంతో కౌశల్ నిరుత్సాహానికి గురయ్యాడు. తన వద్ద ఉన్న గుడ్లను కాపాడుకోవడంలో సఫలమైన సామ్రాట్‌ను బిగ్‌బాస్ సూచన మేరకు గీతా విజేతగా ప్రకటించింది. ఫైనల్‌కు వెళ్లిన మొదటి అభ్యర్థిగా సామ్రాట్‌ను బిగ్‌బాస్ అభినందించారు. దీంతో సామ్రాట్ ఫైనల్ రౌండ్‌కు చేరుకొన్నారు.

    విజేతగా నిలిచిన గీత మాధురి, కౌశల్

    విజేతగా నిలిచిన గీత మాధురి, కౌశల్

    రేస్ టూ ఫినాలే టాస్క్ ముగిసిన తర్వాత హేర్ బాటమ్ మౌంట్ ఫ్రిజ్ నిర్వహించారు. ఫ్రిజ్ గురించి బాగా ప్రమోషన్ చేసిన వారిని విజేతగా ప్రకటించి.. ఆ ఫ్రిజ్‌ను బహుమతిగా అందిస్తామని పేర్కొన్నారు. సామ్రాట్, దీప్తి ఓ జంటగా, రోల్, కౌశల్ మరో జంటగా, గీతా, కౌశల్ మరో జంటగా పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో మంచి ప్రతిభను చాటుకొన్న గీతా, కౌశల్‌ను విజేతగా ప్రకటించారు.

    English summary
    Bigg Boss Telugu 2 102 day Telugu highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. After 99 days of the game, Amit Tiwari Eliminated from the house. on 102 day, Bigg Boss nominated all the member for Elimination.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X