కౌశల్‌పై డిస్‌లైక్స్ ఎటాక్.. నీకు మెచ్యురిటీ లేదు.. దీప్తి.. ఆయనేమన్న భారతీయుడా? సామ్రాట్!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : 107 Day Highlights

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 106వ రోజు కొంచె ఉప్పు.. కొంచెం నిప్పు మాదిరిగా సాగిపోయింది. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ను ఇంటి సభ్యులకు పూర్తిచేశారు. నన్ను దోచుకొందువటే ప్రమోషన్ కోసం హీరో సుధీర్ బాబు, హీరోయిన్ నభా నటేష్ ఇంట్లోకి వచ్చారు. ఆ తర్వాత ఎప్పటిలానే ఇంటి సభ్యుల్లో కౌశల్ మినహాయించి మిగితావారు గుసగుసలాడారు. కౌశల్‌ను టార్గెట్ చేస్తూ అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. అసలేం జరిగిందంటే...

బ్యాండ్ మేళాలకు అనుగుణంగా

బ్యాండ్ మేళాలకు అనుగుణంగా

ఎప్పటిలా ఉదయం పాటతో దినచర్య ప్రారంభం కాకుండా బ్యాండ్ మేళంతో ఇంటి సభ్యులను నిద్రలేపినట్టు కనిపించింది. బ్యాండ్ తాళాలకు అనుగుణంగా ఇంటి సభ్యులు హుషారుగా డ్యాన్స్ చేశారు.

బిగ్‌బాస్ టాస్క్‌ను

బిగ్‌బాస్ టాస్క్‌ను

బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చి ఓ బోర్డుపై తనతోపాటు ఫైనల్‌లో ఉండాలనుకొంటున్న సభ్యుడి ఫోటో పక్కన లవ్ సింబల్.. ఇష్టం లేని వ్యక్తి ఫోటో వద్ద డిస్ లైక్ బొమ్మ పెట్టమని సూచించాడు. దాంతో బిగ్‌బాస్ సూచించిన ప్రకారం ఇంటి సభ్యులు టాస్క్ పూర్తి చేశారు.

కౌశల్‌పై డిస్‌లైక్ ఎటాక్

కౌశల్‌పై డిస్‌లైక్ ఎటాక్

సామ్రాట్ ఫోటో వద్ద తనీష్ లవ్ సింబల్, కౌశల్ ఫొటో డిస్‌లైక్, గీతా ఫోటో వద్ద దీప్తి, దీప్తి ఫోటో వద్ద గీతా, తనీష్ ఫొటో వద్ద సామ్రాట్, గీతా ఫొటో వద్ద కౌశల్ పెట్టగా.. అందరూ సభ్యులు కౌశల్ ఫోటో వద్ద డిస్ లైక్ సింబల్ ప్లేస్ చేశారు. గీతాకు రెండు లవ్ సింబల్స్, కౌశల్ మినహా ముగ్గురికి ఒక్కో లవ్ సింబల్ వచ్చింది.

దీప్తి, కౌశల్ మధ్య వాడివేడి

దీప్తి, కౌశల్ మధ్య వాడివేడి

టాస్క్ అనంతరం కౌశల్, దీప్తి మధ్య వాడివేడి చర్చ జరిగింది. నీకు ఎన్నోసార్లు దగ్గర కావాలని ట్రై చేశాను. కానీ నేను కాలేకపోయాను అని దీప్తి చెప్పింది. అయితే ఇంట్లో వాళ్లతో నేను రిలేషన్ పెట్టుకొంటే నేను ఆట ఆడలేను. కాబట్టి వాటికి దూరంగా ఉన్నాను అని కౌశల్ అన్నాడు. అయితే నా మట్టుకు ప్రతీ దానికి ఓ కంట్రోల్ పాయింట్ ఉంటుంది. అంతవరకే నేను రిస్టిక్ట్ అవుతాను అని దీప్తి చెప్పింది.

కౌశల్ మెచ్యురిటీ లేదు

కౌశల్ మెచ్యురిటీ లేదు

అమ్మ అని పిలిచే తనీష్ నీకు టాస్క్‌లో ఎందుకు సపోర్ట్ చేయలేదు. నీ ఫొటో పక్కన లవ్ సింబల్ ఎందుకు పెట్టలేదు అని అన్నాడు. జీవితంలో తల్లి, కొడుకు ప్రేమ కంటే గొప్పది ఏదీ ఉండదు. అలాంటప్పుడు ఎందుకు నీకు సపోర్ట్ చేయడు అని దీప్తిని కౌశల్ ప్రశ్నించాడు. ఈ సందర్భంగా నీకు ఆలోచించే మెచ్యురిటీ లేదు అని ఆవేశంగా మాట్లాడింది.

ఇంట్లోకి సుధీర్ బాబు

ఇంట్లోకి సుధీర్ బాబు

ఇలా దీప్తీ, కౌశల్ మధ్య మాటల జోరు సాగుతుండగా హీరో సుధీర్ బాబు, నభా నటేష్ వచ్చారు. సినిమా గురించి వారికి వివరించారు. సినిమాలోని లవ్ ప్రపోజల్ సీన్‌ను చెత్తగా చెప్పమని అందర్నీ అడిగారు. దాంతో తమకు తోచిన విధంగా చెప్పగా అతి చెత్తగా చెప్పిన వారిలో కౌశల్, గీతా విజేతలుగా నిలిచారు.

కౌశల్ ఏమన్న భారతీయుడా

కౌశల్ ఏమన్న భారతీయుడా

చివరిగా గీతా మాధురి, దీప్తి మధ్య కౌశల్ ఇంటి గురించి చర్చ జరిగింది. నేను లేకపోతే ఇన్ని గొడవలు జరిగేవా అని అడుగగా.. నీతోనే ఏ గొడవలు జరుగలేదు అని దీప్తి, గీతా అన్నారు. కానీ ఈ విషయాన్ని సామ్రాట్‌తో మాట్లాడుతూ.. ఆయన వల్లే చాలా గొడవలు జరిగాయి. అది చెబితే మరో విధంగా స్పందిస్తాడో అని భయపడ్డాను అని గీతా చెప్పింది. అలాగే రెండుసార్లే నామినేట్ అయ్యాడని తనపై కామెంట్ చేసిన కౌశల్‌పై ఆగ్రహం సామ్రాట్ వ్యక్తం చేశాడు. ఆయన ఏమన్నా భారతీయుడా అంటూ డైలాగ్ పేల్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X