రమ్మన్నది కన్ఫెషన్ రూమ్‌కు.. బాత్రూంకు కాదు.. దీప్తికి షాక్.. కౌశల్ కంటతడి!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : 108 Day Highlights

బిగ్‌బాస్ హౌస్‌లో 107వ రోజు చాలా ఫన్నీగా గడిచిపోయింది. అంతేకాకుండా ఎన్నో ఎమోషన్స్‌ను చూపించాయి. ఇంటి సభ్యులను గుర్తు తెచ్చుకొని కంటతడి పెట్టారు. ఒకరి పాత్రలోకి మరొకరు ప్రవేశించి నవ్వించారు. ఇంట్లోకి ఓ అతిథి ప్రవేశించి సభ్యులను భావొద్వేగాలకు గురిచేశారు. ఇంకా ఏమి జరిగిందంటే..

దీప్తి, గీతా మాధురి మేకప్ పూర్తయితే

దీప్తి, గీతా మాధురి మేకప్ పూర్తయితే

క్యారెక్టర్ టాస్క్ గురించి వివరించడానికి ఇంటి సభ్యులను లివింగ్ రూమ్‌లోకి పిలిచారు. తనీష్, సామ్రాట్, కౌశల్ రాగా, దీప్తి, గీతా బెడ్ రూమ్‌లోనే ఉన్నారు. వారిద్దరూ మేకప్ చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. దాంతో బిగ్‌బాస్ వారిని మీ మేకప్ అయిపోతే లివింగ్ రూమ్‌లోకి రావాలి అని బిగ్‌బాస్ ఝలక్ ఇచ్చాడు.

క్యారెక్టర్ స్వాప్ టాస్క్

క్యారెక్టర్ స్వాప్ టాస్క్

ఇంట్లోకి కొన్ని కవర్లు పంపించారు. ఆ కవర్లను తీసుకొని లివింగ్ రూంలో కూర్చోమని చెప్పారు. క్యారెక్టర్ స్వాప్ (ఒకరి పాత్రలను మరోకరు తీసుకోవడం) టాస్క్ ఇచ్చాడు. ఎవరికైతే ఇంటి సభ్యుల పేరు కవర్లో వస్తే.. ఆ వ్యక్తిగా నటించాలి. టాస్క్ మధ్యలో సిట్యుయేషన్‌ను ఇస్తాం అని బిగ్‌బాస్ తెలిపారు.

పాత్రల మార్చుకొన్న సెలబ్రిటీ

పాత్రల మార్చుకొన్న సెలబ్రిటీ

కవర్లో పేర్లు వచ్చిన ప్రకారం గీతా మాధురి తనీష్‌గా, కౌశల్ సామ్రాట్‌గా, సమ్రాట్ దీప్తిగా, దీప్తి కౌశల్‌గా, తనీష్ గీతా మాధురిగా నటించాలి. రోజులో చాలా సేపు అలా సిట్యుయేషన్స్ అనుగుణంగా నటించి ప్రేక్షకులను నవ్వించారు.

తనీష్, సామ్రాట్ రాణింపు

తనీష్, సామ్రాట్ రాణింపు

గీతాగా తనీష్, దీప్తిగా సామ్రాట్ వారి హావభావాలు ప్రకటిస్తూ అద్భుతంగా రాణించారు. టాలీవుడ్ టాస్క్ సందర్భంగా గీత వేసిన డ్యాన్స్‌ను కౌశల్ చేసి ఆకట్టుకొన్నాడు. కౌశల్ మాదిరిగా సీరియస్‌గా నటించడమే కాకుండా.. జిమ్‌లో ఎక్సర్‌సైజుల చేసి ఆకట్టుకొన్నారు.

దీప్తి.. కన్ఫెషన్ రూమ్‌లోకి

దీప్తి.. కన్ఫెషన్ రూమ్‌లోకి

క్యారెక్టర్ టాస్క్ ముగిసిన తర్వాత అందరూ రిలాక్స్ అవుతుండగా.. దీప్తి అంటూ బిగ్‌బాస్ గొంతు వినిపించింది. వెంటనే మైక్ కోసం చూసుకోగా.. మీరు చేస్తున్న పని పూర్తయితే కన్ఫెషన్ రూమ్‌లోకి రావాలి అంటూ ఆదేశించాడు. కానీ దీప్తి నేను బాత్రూంకి వెళ్లి వస్తాను అంటూ బాత్రూంలోకి దూరబోయింది. వెంటనే మిమ్మల్ని రమ్మన్నది కన్ఫెషన్ రూమ్‌లోకి.. బాత్రూంలోకి కాదు అని దీప్తికి బిగ్‌బాస్ షాకిచ్చాడు.

విజేతగా కౌశల్

విజేతగా కౌశల్

క్యారెక్టర్ టాస్క్ పూర్తయిన తర్వాత అమెజాన్ బిగ్ సేల్ టాస్క్‌ నిర్వహించారు. ఇంట్లో పెట్టిన కొన్ని కవర్లను సేకరించాలి. ఎవరైతే ఎక్కువ సేకరించి ఎక్కువ పాయింట్లు తెచ్చుకొంటారో వారే విజేతగా నిలుస్తాడని చెప్పాడు. ఇంట్లో దాచిన పాయింట్ల కవర్లను సేకరించగా.. కౌశల్ 130 పాయింట్లు రావడంతో విజేతగా నిలిచాడు. ఆయనకు 5 వేల మేర షాపింగ్ గిఫ్ట్ కూపన్ లభించింది.

రిలేషన్స్ కొనసాగిస్తాను

రిలేషన్స్ కొనసాగిస్తాను

ఆ తర్వాత కౌశల్ లివింగ్ రూమ్‌లో కూర్చొని ఎమోషనల్‌గా స్పీచ్ ఇచ్చాడు. ఇంటిలో రిలేషన్ పెట్టుకోవద్దు అని ముందే అనుకొన్నాను. నా గేమ్ కోసం అలా నిర్ణయం తీసుకొన్నాను. కానీ ఒక్కసారి ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత అందరితో మంచి రిలేషన్స్ కొనసాగిస్తాను అని చెప్పాడు.

లైఫ్‌లో నాకు ఫ్రెండ్స్ లేరు

లైఫ్‌లో నాకు ఫ్రెండ్స్ లేరు

నా జీవితంలో నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. ఫ్యామిలీ, ఆఫీస్‌కే జీవితం పరిమితం కావడం వల్ల నేను ఫ్రెండ్స్‌ను చేసుకోలేకపోయాను. ఇప్పుడు మాత్రం మీ అందరితో ఫ్రెండ్ షిప్ చేస్తాను. ఇప్పుడు మీలో ఉన్న బంధం కంటే గొప్పగా నాతో బంధం ఉంటుంది అని కౌశల్ చెప్పాడు.

ఇంట్లోకి అమెజాన్ కుర్రోడు

ఇంట్లోకి అమెజాన్ కుర్రోడు

ఇలా కౌశల్ మాట్లాడుతుండగా.. ఇంట్లోకి వంగవీటి సంతోష్ అనే కుర్రాడు ప్రవేశించాడు. ఇంట్లోని సభ్యులకు వారి ఇంటి నుంచి కొన్ని అమెజాన్ గిఫ్టులు తెచ్చాడు. అందులో వారి ఇంట్లో వారికి ఇష్టమైన వస్తువులను పంపించారు. వాటిని చూసి అందరూ ఉద్వేగానికి గురయ్యాడు.

కౌశల్ ఎమోషనల్‌గా

కౌశల్ ఎమోషనల్‌గా

కౌశల్‌కు ఓ పిల్లో (దిండు) వచ్చింది. ఆ దిండుపై బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లో తన పిల్లలను కౌశల్ కలుసుకొన్నప్పటి ఫోటో ముద్రించి ఉండటంతో ఎమోషనల్ అయి కంటతడి పెట్టాడు. ఆ ఫోటోను చూసి నాకు చాలా ఇష్టమైన మెమోరీ అంటూ ఎమోషనల్ అయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X