twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరూ అమ్మాయిలైతే ఓకే.. నాగ్ రచ్చ.. ఎమోషనల్ స్పీచ్‌తో అదుర్స్.. బిగ్‌బాస్ నుంచి రోల్ రైడా అవుట్!

    |

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu : Episode 106 Highlights

    బిగ్‌బాస్ తెలుగు రెండో సీజన్ చివరి వారంలోకి ప్రవేశించారు. నాగార్జున, రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ ఇంటి వేదికపై నుంచి దేవదాస్ ప్రమోషన్ చేశారు. వారు వెళ్లిన తర్వాత నాని బిగ్‌బాస్ ఫైనలిస్టుల వివరాలను ప్రకటించారు. ప్రతీ ఒక్కరి భావోద్వేగాలను తమ ప్రచారంలో భాగంగా చెప్పుకొన్నారు. ఈ ప్రక్రియలో చివరి స్థానంలో నిలిచిన రోల్ రైడా ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో బిగ్‌బాస్‌లో రోల్ రైడా జీవనయానం ముగిసింది. ఇంకా ఏం జరిగిందంటే..

    నాగార్జున హంగామా

    నాగార్జున హంగామా

    దేవదాస్ మూవీ టీమ్ రాకతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. నాగార్జున తనదైన శైలిలో హోస్ట్ నానితో కలిసి హంగామా చేశారు. ఇంటి సభ్యులతో ఉల్లాసంగా మాట్లాడారు. 106 రోజులు ఎలా ఆడారు? నా వల్లనైతే కాదు. అందరూ అమ్మాయిలు ఉంటే ఓకే లాంటి ప్రశ్నలతో ఆసక్తి రేపారు.

    వేదికపైన రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్

    వేదికపైన రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్

    నాని పక్కన కలరింగ్ లేకపోవడంతో దేవదాస్ సినిమా హీరోయిన్లు రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్‌ను వేదికపైకి పంపించారు. ఇంటి సభ్యులతో వేదికపై నుంచి మాట్లాడారు. ప్రతీ సభ్యుడికి అభినందనలు, బెస్టాఫ్ లక్ చెప్పి అక్కడ నుంచి నిష్క్రమించారు.

    టైటిల్ కోసం ప్రచారం

    టైటిల్ కోసం ప్రచారం

    దేవదాస్ టీమ్ వెళ్లిన తర్వాత బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు సంబంధించిన ఓటింగ్ ప్రచారం మొదలైంది. ఒక్కొక్క సభ్యుడు ఎందుకు బిగ్‌బాస్ టైటిల్‌కు ఎందుకు అర్హుడో.. ఇతరులు ఎందుకు కాదో అనే విషయం గురించి ఒక్కో సభ్యుడు తమ అభిప్రాయాన్ని చెప్పాలని నాని సూచించాడు. దాంతో ఇంటి సభ్యుల క్యాంపెయిన్ ప్రారంభమైంది.

    కౌశల్ తనదైన శైలిలో క్యాంపెయిన్

    కౌశల్ తనదైన శైలిలో క్యాంపెయిన్

    ముందుగా కౌశల్ ప్రచారం మొదలుపెట్టాడు. తన గురించి ఓ రాజు, ఓ దేశం కథ చెప్పాడు. సింహామనే పట్టుకుంటే రాజ్యాన్ని ఇస్తానని ఓ దేశానికి చెప్పిన రాజు కథను బిగ్‌బాస్ ఇంటిలో జరిగిన తన ప్రయాణానికి అనువర్తించాడు. చివరి ఐదుగురు నాపై ఎలాంటి దాడి చేశారో అనేది కథ రూపంలో చెప్పుకొన్నారు. అలాగే ఒక్కో సెలబ్రిటీ మైనస్ పాయింట్లను చెప్పి ఓటు వేయమని కోరాడు.

    సంకల్ప బలంతో దీప్తి నల్లమోతు

    సంకల్ప బలంతో దీప్తి నల్లమోతు

    దీప్తి నల్లమోతు తన ప్రచారాన్ని ప్రారంభిస్తూ తన జీవితంలో చోటుచేసుకొన్న చేదు అనుభవాలను చెప్పి వాటిని ఎలా అధిగమించానో అనే విషయాన్ని చెప్పారు. బిగ్‌బాస్ ఆఫర్ రావడం, దానిని స్వీకరించి ఇంట్లోకి రావడం గురించి చెప్పారు. టైటిల్ గెలవడం నా ముఖ్య ఉద్దేశం కాదు. అందరి మనసులు గెలువాలన్నదే నా ప్రయత్నం. నేను గెలిస్తే నాలో ఓ అక్కను, ఓ అమ్మను, ఓ ఫ్రెండ్‌ను చూసుకుంటే అది చాలూ అని దీప్తి అన్నారు.

    నేనేంటో నిరూపించుకోవాలని సామ్రాట్

    నేనేంటో నిరూపించుకోవాలని సామ్రాట్

    బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినప్పుడు నేను తిరస్కరించాను. కానీ మా ఫాదర్ ఈ విషయాన్ని తెలుసుకొని ఎలాగైనా నీవు షోకు వెళ్లమని ప్రోత్సహించారు. నాపై ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగించుకొని.. సామ్రాట్ అంటే ఇలా ఉంటాడు అని ప్రూవ్ చేసుకోవాలనుకొన్నాను. ఈ ఇంటిలో ఒకరిని తక్కువ చేయడం నా వల్ల కాదు. కాకపోతే ప్రేక్షకుడు మంచి వాళ్లకు ఓటేస్తారని భావిస్తాను.

    గాయనిగా గుర్తింపే కారణం

    గాయనిగా గుర్తింపే కారణం

    బిగ్‌బాస్‌లోకి రావడం అంటే గాయనిగా నాకు లభించిన గుర్తింపే కారణం అని గీతా మాధురి తెలిపారు. నేను గాయనిగా గుర్తింపు పొందడానికి కారణమైన నా తల్లిదండ్రులు, గురువులు, మ్యూజిక్ డైరెక్టర్లకు రుణపడి ఉంటాను. నన్ను ఇన్ని వారాలుగా ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను. నా గురించి కొందరికి నచ్చ వచ్చు.. నచ్చకపోవచ్చు. కానీ నాలో ప్రతిభను చూసి ఓటు వేయాలని కోరుతున్నాను అని గీత అన్నారు.

    ఐదేళ్ల కుర్రాడి చెప్పిన మాటే

    ఐదేళ్ల కుర్రాడి చెప్పిన మాటే

    తెలుగు ర్యాపర్‌గా రాణించడానికి రోల్ రైడా తాను పడిన కష్టాలను వివరించాడు. ఓ ఐదేళ్ల కుర్రాడు నేను రోల్ రైడా కావాలనుకొంటున్నాను అని చెప్పడం నాకు జీవితంలో స్ఫూర్తిగా నిలిచింది. ర్యాపర్‌గా నాకు గుర్తింపు లభించిన తర్వాత ఎవరైతే నన్ను చిన్నచూపు చూసిన వాళ్లందరూ అందరూ సెల్ఫీ తీసుకోవడం నా విజయంగా భావిస్తాను అని రైడా చెప్పాడు.

    తల్లిదండ్రుల కోసమే

    తల్లిదండ్రుల కోసమే

    తనీష్ తన జీవితంలో చోటుచేసుకొన్న ప్రతికూల పరిస్థితులను చెప్పాడు. తన తల్లిదండ్రుల కోసం గొప్పగా ఏదైనా సాధించాలి అని అనుకొన్నాను. బాలనటుడిగా నంది అవార్డు రావడం నాలో ఉత్సాహాన్ని నింపింది. నేను ఎలా ఉంటానో బిగ్‌బాస్‌లో అనే ఉన్నాను. కోపం, బాధ, ఆనందం ఇలా ఎలాంటి ఫీలింగ్‌ కలిగిన దానిని బయటకు పంపించాను. ఇంటి సభ్యుల్లో అందరిలా నాలో క్వాలిటీస్ లేవు. అందుకే నాకు ఓటేయ్యండి అని చెప్పాడు.

    రోల్ రైడా నిష్క్రమణ.. ఫైనల్‌కు ఐదుగురు

    రోల్ రైడా నిష్క్రమణ.. ఫైనల్‌కు ఐదుగురు


    చివరిగా నాని ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించాడు. మొదటగా ఫైనలిస్ట్ 2 నెంబర్‌గా కౌశల్ పేరును ప్రకటించాడు. ఫైనలిస్ట్ 3గా గీతాను, నాలుగో వ్యక్తిగా తనీష్‌ను, 5వ కంటెస్టెంట్‌గా దీప్తిని ప్రకటించాడు. దాంతో రోల్ రైడా ఇంటి నుంచి బయటకు నిష్ర్కమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో సెల్ఫీ దిగి వేదికపైన ఉన్న నాని వద్దకు చేరుకొన్నాడు.

    English summary
    Bigg Boss Telugu 2 107 day Telugu highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. After 106 days of the game, Roll Rida Eliminated from the house. In this occassion, Nagarjuna and Devadas team entered into Bigg Boss house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X