కౌశల్ కామెడీ అదుర్స్.. నాటు జోకు వేస్తే.. కొట్టడానికి వెళ్లిన దీప్తి.. బయటపడ్డ సెలబ్రీటీల జాతకాలు!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : 109 Day Highlights

బిగ్‌బాస్ రియాలిటీ షోలో 108 రోజు సరదాగా గడిచిపోయింది. ఇంటి సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు. సామెతలు, పొడుపు కథలు చెప్పుకుంటూ పొట్ట చెక్కలయ్యలా నవ్వారు. చిన్న చిన్న టాస్కులతో రోజంతా హ్యాపీగా గడిపేశారు. సామ్రాట్, కౌశల్ చేసిన కామెడీ ఆకట్టుకుంది. వచ్చే రెండు మూడు ఏళ్లలో వారి భవిష్యత్ ఎలా ఉంటుందో అనే విషయంపై జ్యోతిష్యం చెప్పించుకొన్నారు. ఇంకా జరిగిందంటే..

సరదాగా గుడ్ నైట్ టాస్క్‌

సరదాగా గుడ్ నైట్ టాస్క్‌

బిగ్‌బాస్ ఇంటిలో గుడ్ నైట్ ఫుష్ కరో టాస్క్ నడించింది. ఈ టాస్క్ కోసం ఇంటి సభ్యుల కోసం ప్రత్యేకంగా డ్రస్ ఇచ్చారు. ఎరుపు టీషర్టు, బ్లాక్ పాయింట్ ధరించారు. టీషర్టుపై ఒకరికొకరు తమ అభిప్రాయాలను రాసుకొని విష్ చేసుకొన్నారు. దీప్తి టీషర్ట్‌పై కౌశల్ రాసిన కామెంట్ చాలా నవ్వు తెప్పించింది.

పొట్టచెక్కలయ్యేలా కౌశల్ పొడుపు కథలు

పొట్టచెక్కలయ్యేలా కౌశల్ పొడుపు కథలు

టాస్క్ తర్వాత కౌశల్ కొన్ని పొడుపు కథలు చెప్పాడు. కౌశల్ చెప్పిన పొడుపు విప్పే సమయంలో ఇంటి సభ్యుల మధ్య సరదా సంభాషణ జరిగింది. కౌశల్ చెప్పిన డైలాగ్స్‌కు దీప్తి కౌంటర్ ఇచ్చింది. వల్ల భాలిన ప్రేమ అంటూ కౌశల్ చెప్పిన డైలాగ్‌ను దీప్తి సవరించి.. వల్ల మాలిన ప్రేమ అని చెప్పింది. ఇలాంటి డైలాగ్లు చాలానే పేలాయి.

దీప్తి పొడుపు కథపై జోకులు

దీప్తి పొడుపు కథపై జోకులు

పాల ఇచ్చే అంశంపై దీప్తి చెప్పిన పొడుపు కథపై జోకులు బాగా పేలాయి. ఈ అంశంపై ఇంటి సభ్యులు తలా ఒక మాట అనుకొని కడుపుబ్బ నవ్వారు. దీప్తిపై కౌశల్ చేసిన కామెంట్ కొంచెం నాటుగా ఉండటంతో సరదాగా దీప్తి కొట్టడానికి వెళ్లింది. ఇలా ఒకరినొకరు ఆటపట్టించుకునే కార్యక్రమం జరిగింది.

కౌశల్, గీతా వాగ్వాదం

కౌశల్, గీతా వాగ్వాదం

బిగ్‌బాస్ ఫిజికల్ టాస్క్ విషయంలో మరోసారి కౌశల్, గీతా మధ్య వాగ్వాదం జరిగింది. ఫిజికల్ టాస్క్‌లో ఓడిపోతానని భయం. అందుకే నేను ఆడను. పరుగెత్తి పడటం నా వల్ల కాదు. అందుకే నేను ఫిజికల్ గేమ్స్ ఆడను అని గీతా మాధురి అనగా వాటిపై కౌశల్ అభ్యంతరం చెప్పారు.

టారో కార్డు రీడర్‌తో

టారో కార్డు రీడర్‌తో

ఇలా సరదాగా గడిచిపోతుంటే ఇంట్లోకి టారో కార్డు రీడర్ (జ్యోతిష్యురాలు) వచ్చింది. ప్రతీ ఒక్కరు ఆమె వద్దకు వెళ్లి తమ జీవితాలకు సంబంధించిన మూడు ప్రశ్నలు వేయగా వాటికి ఆమె సమాధానం ఇచ్చింది.

చిక్కులు తొలుగుతాయా?

చిక్కులు తొలుగుతాయా?

మొదట సామ్రాట్ తన జీవితం గురించి జోతిష్యం చెప్పించుకోవడానికి వెళ్లాడు. తన జీవితంలో కొన్ని సమస్యలు, చిక్కు ముడులు ఉన్నాయి. అవి ఎప్పుడు తొలిగిపోతాయి? నేను బిగ్‌బాస్ టైటిల్ రేసులో మొదటి రెండు స్థానాల్లో ఉంటానా? లాంటి ప్రశ్నలు అడుగగా సానుకూలమైన సమాధానం చెప్పింది.

కౌశల్ కలలు నెరవేరుతాయా?

కౌశల్ కలలు నెరవేరుతాయా?

కౌశల్ కూడా తన బిగ్‌బాస్ కలలు నెరవేరుతాయా? జీవితం ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలను అడుగుగా టారో కార్డు రీడర్ సమాధానాలు వెల్లడించింది. దీప్తి, గీతా, తనీష్ కూడా ఇలాంటి ప్రశ్నలే అడిగి తమ సందేహాలను తీర్చుకొన్నారు.

దీప్తిని ఆటపట్టించిన సామ్రాట్

దీప్తిని ఆటపట్టించిన సామ్రాట్

చివర్లో ఫిదా చిత్రంలోని పాటకు దీప్తి చేసిన డ్యాన్సు, వేసిన స్టెప్పులు వేసిన తీరును చూపిస్తూ సామ్రాట్ ఆటపట్టించారు. మెల్ల మెల్లగా వచ్చిండే.. క్రీమ్ బిస్కెట్ వేసిండే పాటకు సామ్రాట్ వేసిన స్టెప్పులు చాలా సరదాగా అనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X