Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
నన్ను టచ్ చెయొద్దు.. తాగుబోతుగా తనీష్ వార్నింగ్.. బిగ్‌బాస్ హౌస్ పార్టీలో రచ్చ..
బిగ్‌బాస్ ఫినాలేకు ముందు రోజు నూతన్ నాయుడు మినహా ఇంటి సభ్యులందరికి బిగ్‌బాస్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి అమిత్, రోల్ రైడా యాంకర్లుగా వ్యవహరించారు. గీతా మాధురి షోను ఏర్పాటు చేశారు. ఇంటి సభ్యుల్లో ఒక్కొక్కరికి వారి ఆట తీరును బట్టి అవార్డులు అందజేశారు. చివర్లో డీజేకు అనుగుణంగా ఇంటి సభ్యులు చేసిన డ్యాన్సులు ఆకట్టుకొన్నాయి. ఇంకా ఏం జరిగిందంటే..
యాంకర్లుగా రోల్ రైడా, అమిత్
బిగ్‌బాస్ ఇంటిలోని ఓపెన్ ప్లేస్‌లో ఫైనల్‌కు చేరిన ఐదుగురు, ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులందరీ పార్టీని ఏర్పాటు చేసి దానికి హోస్ట్‌లుగా అమిత్, రోల్ రైడాను నియమించారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై తమదైన శైలిలో మాట్లాడుతూ అందర్ని నవ్వుల్లో ముంచెత్తారు.
గీతా మాధురి స్టార్ నైట్
సింగర్ గీతా మాధురి పాటల కచేరితో పార్టీ మొదలైంది. యాపీ ఫిజ్ తాగుతూ ఇంటి సభ్యులు విందులో మునిగిపోయారు. తనీష్ మద్యం తాగితే కిక్ ఎక్కినట్టు నటిస్తూ అందర్ని ఆకట్టుకొన్నారు. పార్టీ కోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులందరి మంచి డ్రస్‌లను బిగ్‌బాస్ పంపించారు.
అవార్డుల కార్యక్రమంలో
గీతా మాధురి పాటల కచేరి తర్వాత అవార్డుల కార్యక్రమం మొదలైంది. స్లీపింగ్ బ్యూటిగా, బద్దకస్తురాలుగా దీప్తి సునైన అవార్డులు అందుకొన్నారు. తనీష్‌కు యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా, కౌశల్ ప్రవచన్ బాబాగా, సామ్రాట్‌కు రోమియో, క్లాస్ అవార్డు, దీప్తికి డ్రామా క్వీన్‌గా, గీతా మాధురికి గాన కోకిల, ఇలా ప్రతీ ఒక్కరికి ఓ అవార్డు లభించాయి. అవార్డు అందుకొంటుండగా తనీష్ నన్ను టచ్ చేయకుండా నాకు టైటిల్‌ను బహుకరించాలని సూచించాడు.
ఇంటి సభ్యులతో ర్యాపిడ్ ఫైర్
అవార్డుల కార్యక్రమం తర్వాత రాపిడ్ ఫైర్ కార్యక్రమాన్ని అమిత్, రోల్ రైడా నిర్వహించారు. ఒక్కొ ప్రశ్న అడుగుతుండగా సంక్షిప్తంగా ఇంటి సభ్యులు సమాధానం చెప్పారు. గీతా మాధురి, తేజస్వినిలో ఎవరిని బయటకు తీసుకెళ్తావు అని సామ్రాట్‌ను అడుగగా.. తేజస్వి అని సమాధానం చెప్పారు. అలాగే తేజస్విని ఇంటి నుంచి ఒకరిని బయటకు తీసుకెళ్లాల్సి వస్తే ఎవరి తీసుకెళ్లావు అని అడిగిన ప్రశ్నకు తనీష్ అని సమాధానం ఇచ్చింది.
రోల్ రైడా ర్యాప్
చివర్లో రోల్ రైడా తనదైన స్టయిల్లో ర్యాప్ పాడి ఆకట్టుకొన్నారు. రైడా పాటకు అనుగుణంగా సభ్యులు డ్యాన్స్ చేశారు. చివర్లో కౌశల్ కూడా పాట పాడి అలరించారు. ఆ తర్వాత బిగ్‌బాస్ ప్లే చేసిన పాటకు ఇంటి సభ్యులు జోష్‌తో డ్యాన్సులు చేశారు.
ఫైనలిస్టులకు మేకోవర్
బిగ్‌బాస్ ఫైనల్ కోసం ఐదుగురు ఇంటి సభ్యులను అందంగా తయారు చేశారు. మిర్రర్స్ నుంచి వచ్చిన స్టయిలిస్టులు ఫైనలిస్టులకు మేకోవర్ చేశారు. గీతా, దీప్తి, కౌశల్, సామ్రాట్, తనీష్ తమకు నచ్చిన విధంగా ముస్తాబయ్యారు.