దీప్తి దెబ్బకు ఇంట్లోవారికి ఫిట్స్.. నాని దండంపెట్టి పరారీ.. బిగ్‌బాస్ నుంచి అమిత్ అవుట్!

బిగ్‌బాస్ రియాలిటీ షో సెంచరీ కొట్టబోతున్నది. ఈ కార్యక్రమం ప్రారంభమై సోమవారానికి 100 రోజులు కాబోతున్నాయి. ఆదివారం జరిగిన 99వ రోజు షో ఆనందంతోపాటు విషాదం కనిపించింది. ఎలిమినేషన్ ప్రక్రియ మొదలెట్టే రోజు కావడంతో ఇంటి సభ్యుల్లో కొంత అదుర్దా కనిపించింది. అంతా మీ మంచి కోరి అనే గేమ్‌ను ఇంటి సభ్యులతో ఆడించారు. అనంతరం నామినేషన్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేఫ్ జోన్‌లోకి పంపిస్తూ అమిత్‌ను ప్యాక్ యువర్ బ్యాగ్ అని చెప్పడంతో ఆయన నిష్క్రమించాడు. ఇంకా ఏం జరిగిందంటే..

మీ మంచి కోరి గేమ్

మీ మంచి కోరి గేమ్

మీ మంచి కోరి గేమ్‌లో భాగంగా ఓ వైట్ బోర్డుపై ఇంటి సభ్యుల గురించి తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ వారి లక్షణం రాసి ఉన్న ప్లేట్‌ను బోర్డుపై అతికించాలి. అలా ఒక్కక్కొరి గురించి తమ అభిప్రాయాన్ని చెప్పి ప్లేట్ రూపంలో అతికించారు.

కౌశల్‌పై నెగిటివ్ కామెంట్లు

కౌశల్‌పై నెగిటివ్ కామెంట్లు

ఇంటిలో దాదాపు ప్రతీ ఒక్కరు కౌశల్‌కు వ్యతిరేకంగా నెగిటివ్ కామెంట్లు విసిరారు. అహం, అత్యాశ, మాట మీద ఉండడు అనే కామెంట్లను వదిలారు. అలా ఒకరిపై మరొకరు తమ ఫీలింగ్స్‌ను ప్రకటించుకొన్నారు. అలా ఎవరు అని ఉంటారో అనే విషయాన్ని సభ్యుడు గుర్తించాల్సి ఉంటుంది.

దీప్తి నసతో ఇంటి సభ్యులు షాక్

దీప్తి నసతో ఇంటి సభ్యులు షాక్

ఇక దీప్తి వంతు వచ్చే సరికి ఆట చాలా సరదాగా, తమాషాగా మారిపోయింది. దీప్తి పెట్టిన నసతో ఇంటి సభ్యులు ఫిట్స్ వచ్చినట్టు డ్రామా ఆడారు. నేల మీద పడుకొని బొర్లారు. ఇక లాభం లేదనుకొని నాని కూడా నేలపై కూర్చొన్నాడు. వేదిక మీద నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. అయినా నాన్ స్టాప్‌గా మాట్లాడుతూ అందర్నీ విసిగించింది.

దీప్తి, కౌశల్ సేఫ్ జోన్‌లోకి

దీప్తి, కౌశల్ సేఫ్ జోన్‌లోకి

గేమ్ ముగిసిన తర్వాత నాని ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. తొలుత దీప్తిని సేఫ్ జోన్‌లోకి పంపించారు. తనకు ఓట్లు వేసి సేఫ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఆ తర్వాత ఎవరు సేఫ్ అవుతారనే విషయంపై అందరిలో ఉత్కంఠ పెరిగింది. ఆ తర్వాత రెండో వ్యక్తిగా కౌశల్‌ను సేఫ్ జోన్‌లోకి పంపించారు.

గీతా మాధురి సేఫ్

గీతా మాధురి సేఫ్

ఇక మూడో వ్యక్తిగా గీత మాధురిని సేఫ్ జోన్‌లోకి పంపించారు. దాంతో ఆమె సంతోషంగా ఫీలయ్యారు. గతంలో తన పాట బాగుందని, తన గొంతు బాగుంది అని చెప్పేవారు. కానీ బిగ్‌బాస్‌కు వచ్చిన తర్వాత తన వ్యక్తిత్వం చెప్పడం తనకు గర్వంగా ఉంది అని చెప్పారు.

రోల్ రైడా ఇన్.. అమిత్ అవుట్

రోల్ రైడా ఇన్.. అమిత్ అవుట్

ఇక నాలుగో వ్యక్తిగా రోల్ రైడాను సేఫ్ జోన్‌లోకి పంపించడంతో అమిత్‌ ఇంటి నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంట్లోకి వెళ్లి తన బ్యాగును తీసుకొన్నాడు. ఇంటి సభ్యులతో సెల్ఫీ దిగి హౌస్ నుంచి నిష్క్రమించాడు.

ఉద్వేగానికి గురైన అమిత్

ఉద్వేగానికి గురైన అమిత్

హౌస్ నుంచి బయటకు వచ్చిన అమిత్‌ను నాని వేదికపైకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇంట్లో 99 రోజుల అమిత్ జర్నీని చూపించాడు. దాంతో అమిత్ ఉద్వేగానికి గురయ్యాడు. అనంతరం ఇద్దరు ఇంటి సభ్యులు సామ్రాట్, రోల్ రైడాతో మాట్లాడాడు.

రోల్ రైడా, సామ్రాట్ ఫ్రెండ్స్

రోల్ రైడా, సామ్రాట్ ఫ్రెండ్స్

ఇంట్లో తనకు మంచి ఫ్రెండ్ రోల్ రైడా అని, సామ్రాట్ మరో మంచి స్నేహితుడు అని చెప్పాడు. కౌశల్ గురించి నెగిటివ్‌గా మాట్లాడాడు. అందరూ తనకు అనుగుణంగానే ఆట ఆడాలని అనుకొంటాడు. సపోర్ట్ చేసినా తప్పు పడుతాడు అని అమిత్ చెప్పాడు.

దీప్తి నల్లమోతుపై బిగ్‌బాంబ్

దీప్తి నల్లమోతుపై బిగ్‌బాంబ్

ఇక గేమ్‌లో చివరి అంశం బిగ్‌బాంబు వేసే ప్రక్రియ అమిత్‌కు వచ్చింది. బిగ్‌బాంబ్ ప్రకారం ఇంట్లో అందరి జుట్టును ఒకరే దువ్వాలి. అలా వారం రోజులపాటు అతడు లేదా ఆమె ఆ పనిని నిర్వహించాలి. ఒకవేళ విఫలమైతే కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించాడు. ఈ సారి బిగ్‌బాంబును దీప్తి నల్లమోతుపై అమిత్ వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X