బిగ్ బాస్ 2 ఎలిమినేషన్ టాస్క్‌లో అపశృతి, గాయాలు.... హీరోయిన్‌గా బయటకు వెళతానన్న దీప్తి!
Recommended Video

బిగ్ బాస్ 2... 58వ రోజులోకి ఎంటరైంది. గతవారం నందినీ రాయ్ ఇంటి నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. సోమవారం మళ్లీ ఫ్రెష్‌గా వచ్చే వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ మొదలయ్యాయి. అయితే ఈ సారి నామినేషన్స్ కాస్త డిఫరెంటుగా నిర్వహించారు. గార్డెన్ ఏరియాలో ఒక టెంట్ ఏర్పాటు చేసిన బిగ్ బాస్... మ్యూజిక్ ప్లే చేసినపుడు అందులోకి చివరగా ఎవరు వెళితే వారు నామినేట్ అవుతారు అని సూచించారు. అందరికంటే ముందు టెంట్‌లోకి వెళ్లాలనే ఆతృతతో ఇంటి సభ్యులు పరుగులు తీయడంతో.... అపశృతి చోటు చేసుకుంది. ఈ క్రమంలో తనీష్, శ్యామల, దీప్తి నల్లమోతు గాయపడ్డారు.

దీప్తి మీద పడ్డ రోల్.... తీవ్రగాయాలు, వైద్యం
అందరి కంటే ఎక్కువగా దీప్తి నల్లమోతుకు గాయాలయ్యాయి. టెంట్‌లోకి ప్రేవేశించే క్రమంలో క్రింద పడిపోయారు. దీప్తి మీద రోల్ రైడా పడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వైద్యుడు వచ్చి ఆమెకు ట్రీట్మెంట్ చేశారు.

రోల్ రైడా సేఫ్ అయ్యాడు
దీప్తి నల్లమోతు, రోల్ రైడాలో ఎవరిని నామినేట్ చేయాలనే విషయంలో సందిగ్ధం ఏర్పడింది. అయితే సంచాలకురాలుగా వ్యవహరిచిన పూజ.... రోల్ రైడానే ముందు టెంట్‌లోకి ప్రవేశించారని తేల్చడంతో దీప్తి నల్లమోతు నామినేట్ కాక తప్పలేదు.

అన్యాయం జరిగిందని భావించిన దీప్తి, హీరోయిన్‌గా వెళతానంటూ..
నాపై రోల్ పడ్డాడు... నేనే ముందు టెంట్‌లోకి వెళ్లినట్లు కదా అని దీప్తి వాదించింది. అయితే పూజా రోల్ వైపే మొగ్గుచూపడాన్ని తనకు అన్యాయం జరిగినట్లు దీప్తి భావించింది. ఈ బాధను దిగమింగుకున్న దీప్తి.... నేను ఎలిమినేట్ అయినా బాధ లేదు, వెళ్లే ముందు ఒక సూపర్ టాస్క్ కంప్లీట్ చేసి హీరోయిన్‌గా బయటకు వెళతాను అని వ్యాఖ్యానించడం ప్రేక్షకులను మనసును టచ్ చేసింది.

ఈ వారం నామినేట్ అయింది వీరే...
బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్‌లో ఓడిపోయిన బాబు గోగినేని, గణేష్, శ్యామల, తనీష్, గీతా మాధురి, దీప్తి నల్లమోతు ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. ప్రేక్షకుల నుండి వచ్చే ఓట్లను బట్టి వీరిలో ఒకరు ఇంటి నుండి బయటకు వెళ్లనున్నారు.


Click it and Unblock the Notifications











