ఒరేయ్ బిగ్ బాస్ రారా! .... బాబు గోగినేని వింత ప్రవర్తన!

By Bojja Kumar

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Babu Gogineni Misbehaves With Bigg Boss

బిగ్ బాస్ మొదటి సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్ కాస్త భిన్నంగానే సాగుతోంది. గత సీజన్లో అందరూ సినీ సెలబ్రిటీలే పాల్గొనగా ఈ సారి సామాన్యులకు కూడా చోటు కల్పించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఎంటర్టెన్మెంట్ రంగంతో సంబంధం లేని హ్యూమన్ యాక్టివిస్ట్ బాబు గోగినేని ఈ రియాల్టీ షోలో భాగం కావడం కూడా పలువురిని ఆశ్చర్య పరిచింది. అదే సమయంలో ఇతగాడి రియల్ నేచర్ ఏమిటి? అని తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో నెలకొంది.

 బిగ్ బాస్ ఇంట్లో బాబు గోగినేని వింత ప్రవర్తన

బిగ్ బాస్ ఇంట్లో బాబు గోగినేని వింత ప్రవర్తన

బిగ్ బాస్ ఇంట్లో బాబు గోగినేని ప్రవర్తన కాస్త వింతగా ఉందని చెప్పక తప్పదు. సినిమా సెలబ్రిటీలతో ఆయన పూర్తిగా కలిసిపోవడం లేదు. అదే సమయంలో బిగ్ బాస్ చెప్పిన కొన్ని పనులు, టాస్క్‌లో భాగంగా చేయాల్సిన పనులు చేయడానికి ఇష్టపడటం లేదు.

 మేధావితనం ప్రదర్శిస్తున్న గోగినేని

మేధావితనం ప్రదర్శిస్తున్న గోగినేని

బాబు గోగినేని హ్యూమన్ యాక్టివిస్టుగా, రేషనలిస్టుగా పేరుపొందారు. సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. టీవీ డిబేట్లలో తనదైన వాదనలు వినిపిస్తూ సెలబ్రిటీగా చలామణి అవుతున్నారు. కొందరు ఆయన్ను మేధావి అంటుంటారు, మరికొందరు ఆయన తీరును విమర్శిస్తూ ఉంటారు. అయితే బిగ్ బాస్ ఇంట్లో గేమ్ ఆడటానికి వచ్చిన బాబు గోగినేని మేధావితనం ప్రదర్శిస్తూ కొన్ని టాస్క్‌ల నుండి తప్పించుకునే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మధ్య హౌస్‌లో ఫన్ కోసం జరిగిన ఫ్యాషన్ షోలో బాబు పాల్గొనకుండా ఇంట్లోనే ఉండిపోయిన సంగతి తెలిసిందే.

ఒరేయ్ బిగ్ బాస్ రారా...

ఒరేయ్ బిగ్ బాస్ రారా...

తాజాగా విడుదలైన ప్రోమోలో బాబు గోగినేని బిగ్ బాస్ మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉంది. బిగ్ బాస్ బాబుకు రుచించని పనులు చెప్పాడో? లేక ఏదైనా కష్టమైన టాస్క్‌లో ఇరికించాడో తెలియదు కానీ.... సహనం కోల్పోయి ఒరేయ్ బిగ్ బాస్ రారా! అంటూ గట్టిగా అరిచారు. బుధవారం ప్రసారం అయ్యే ఎపిసోడ్లో ఆయన ఎందుకు అరిచారు అనే విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గత సీజన్లో బిగ్ బాస్ తీరు నచ్చక శివ బాలాజీ కూడా ఇలాగే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

బాబు గోగినేని బయటకు కనిపించేంత మంచోడు కాదా?

బాబు గోగినేని బయటకు కనిపించేంత మంచోడు కాదా?

బాబు గోగినేని బయటకు కనిపించేంత మంచోడు కాదని, అతడి నిజస్వరూపం ఇది కాదని ..... బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అయిన సంజన వెల్లడించడం గమనార్హం. అతడిని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడే మనస్తత్వం ఉన్న వ్యక్తిగా సంజన విమర్శించారు. తన విషయంలో బాబు గోగినేని చేసిన కుట్రలను ఆమె స్వయంగా మీడియా ముందు వెల్లడించారు.

ఆడవాళ్లంటే జాలి లేని వ్యక్తా?

ఆడవాళ్లంటే జాలి లేని వ్యక్తా?

బాబు గోగినేనికి ఆడవాళ్లంటే జాలి, దయ లాంటివి ఉండవా? అంటే అవుననే అంటున్నారు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ సంజన. అంతే కాదు చాలా విషయాల్లో ఓవరాక్షన్ చేస్తున్నాడని, ఇంట్లో అందరికన్నా తానే గొప్పోడిలా ఫీలవుతున్నాడని, సమానత్వం పాటించడం లేదని, కొన్ని విషయాల్లో ఆయన ప్రవర్తన బిగ్ బాస్ గేమ్ స్పిరిట్‌ను దెబ్బతీస్తుందని సంజన వాపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X