తేజస్వి, బాబు గోగినేని బుద్ది మారలేదు.. కౌశల్‌పై ఎటాక్.. ఇంట్లో మళ్లీ గ్రూప్ పాలిటిక్స్!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : 111 Day Highlights

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 ముగింపుకు రెండు రోజులు ఉండగా.. 111వ రోజు ఎలిమినేట్ అయిన సభ్యులందర్నీ ఇంట్లోకి రప్పించారు. ఇంట్లోకి రాగానే అందరూ కుశల ప్రశ్నలతోపాటు అప్యాయంగా పలకరించారు. కానీ కౌశల్‌పై మాటల ఎటాక్‌ను మానలేదు. ఇంటిలో మళ్లీ గ్రూప్ రాజకీయాలు, ఒకరి వద్ద ఒక మాట.. మరోకరి వద్ద మరోమాట చెప్పుకోవడం స్పష్టంగా కనిపించింది. వివరాల్లోకి వెళితే..

 కౌశల్‌ టార్గెట్‌గా తనీష్, కిరీటి

కౌశల్‌ టార్గెట్‌గా తనీష్, కిరీటి

ఇంట్లోకి వచ్చిన కాసేపటికి తనీష్, కీరిటీ దామరాజు మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. నీలో మెచ్యురిటికి ఫిదా అయ్యాను. గుడ్డు కొట్టిన తర్వాత వచ్చి ఆయ సభ్యులకు నచ్చ చెప్పిన తీరు నాతోపాటు అందరికీ నచ్చింది. ఆ ప్రవర్తన, మెచ్యురిటీ కౌశల్‌కు వచ్చి ఉంటే బాగుండేది అని కిరీటీ అన్నాడు. ఆ తర్వాత కౌశల్ వద్దకు వెళ్లి నీ గేమ్ బాగుంది అంటూ ఏదేదో చెప్పడం కనిపించింది.

కౌశల్ గురించి తేజస్వి మదివాడ

కౌశల్ గురించి తేజస్వి మదివాడ

ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత కౌశల్‌తో కలువడానికి తేజస్వి మదివాడ పెద్దగా ఆసక్తి చూపలేకపోయింది. అంతేకాకుండా కౌశల్‌ను ఉద్దేశించి తనీష్‌తో పరోక్షంగా మాటలు విసిరింది. కౌశల్‌కు బయట ఉన్న క్రేజ్‌ను చెడు విధంగా చూపించే ప్రయత్నం చేసింది.

వారంత తొక్కేస్తున్నారని

వారంత తొక్కేస్తున్నారని

అతడి (కౌశల్)కి భారీగా ఫాలోయింగ్ ఉంది. కానీ అతడి పాలోవర్స్ కేవలం నెగిటివ్ అప్రోచ్ మాత్రమే ఉంది. వారంతా తమ ఫేవరేట్ కంటెస్టెంట్‌కు హెల్ప్ చేయకుండా మిగితా వారందరినీ తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు అని తనీష్‌తో తేజస్వి తన అక్కసును వెళ్లబోసుకున్నది.

 కౌశల్ విసుగుపుట్టించే వ్యక్తి అని బాబు

కౌశల్ విసుగుపుట్టించే వ్యక్తి అని బాబు

కౌశల్‌పై బాబు గోగినేని కూడా నోరు పారేసుకొన్నాడు. ఇంటిలో కౌశల్ అత్యంత విసుగుపుట్టించే వ్యక్తుల్లో ఒకరు అని గోగినేని అన్నాడు. కౌశల్‌పై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ ఆయనో ఫ్లిప్ స్టార్ అంటూ బాబు గోగినేని నోటి దూల తీర్చుకొన్నాడు. బాబు గోగినేనిని కౌశల్ పలకరించగా.. ఏమిటీ సన్న బడ్డావు అని బాబు అనగా.. మీరు లేరు కదా.. అందుకే సన్నగా అయ్యాను అంటూ కౌశల్ సమాధానమిచ్చారు.

 కౌశల్‌తో ఫ్రెండ్లీగా

కౌశల్‌తో ఫ్రెండ్లీగా

ఇంట్లోకి వచ్చిన సభ్యుల్లో శ్యామల, రోల్ రైడా, అమిత్ తివారీ, గణేష్ సానుకూలంగా స్పందించారు. కౌశల్‌ను అప్యాయంగా పలకరించారు. మిగితా వారందరూ కౌశల్‌ను, బిగ్‌బాస్ గేమ్‌ను పర్సనల్‌గా తీసుకొన్నట్టు కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X