కౌశల్, తనీష్ ఫ్యాన్స్ మధ్య ఫైట్... వైరల్ అవుతున్న వీడియో!

By Bojja Kumar

బిగ్‌బాస్ రియాల్టీ షోలో తమ అభిమాన కంటెస్టెంట్లను గెలిపించేందుకు వారి ఫ్యాన్స్ గ్రూపులుగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. కౌశల్ ఆర్మీ పేరుతో ఒక గ్రూఫ్ ఆయనకు మద్దతు తెలుపుతుండగా... తనీష్ అభిమానులు సైతం కౌశల్ ఆర్మీకి ధీటుగా తమ నెట్వర్క్‌ను విస్తరిస్తున్నారు. ఇతర కంటెస్టెంట్లకు అభిమానులు ఉన్నప్పటికీ వీరిద్దరికీ ఉన్నంత భారీగా స్థాయిలో అయితే లేరు. ఈ రెండు గ్రూపుల మధ్య వార్ ఓ రేంజిలో జరుగుతోంది. తాజాగా కౌశల్ అభిమాని, తనీష్ అభిమాని గొడవ పడుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తనీష్ మాత్రమే కరెక్టుగా ఆడుతున్నాడు

తనీష్ మాత్రమే కరెక్టుగా ఆడుతున్నాడు

బిగ్‌బాస్ రియాల్టీ షోలో తనీష్ మాత్రమే కరెక్టుగా ఆడుతున్నాడు. కౌశల్ అందరినీ మానిప్యులేట్ చేసి తను ఒక్కడే నెగ్గేయాలి, మిగిలిన వారంతా వెధవలు అనే రకం.... అని ఓ అభిమాని వ్యాఖ్యానించడంతో పక్కనే ఉన్న కౌశల్ ఫ్యాన్ అతడిపైకి గొడవకు వచ్చాడు.

కౌశల్ గురించి తప్పుగా మాట్లాడొద్దు

కౌశల్ గురించి తప్పుగా మాట్లాడొద్దు

నీకు తనీష్ అంటే ఇష్టముంటే అతడి గురించి గొప్పగా చెప్పుకో. అంతే కానీ కౌశల్ గురించి తప్పుగా మాట్లాడొద్దు. అందరూ కౌశల్ ను బ్లేమ్ చేసి ఒంటరిని చేశారు. అందుకే కౌశల్ కు మద్దతుగా ఓన్ ఫ్యాన్స్ వచ్చారు, కౌశల్ ఆర్మీ ఏర్పాటు చేశారు... అంటూ తనీష్ అభిమానితో కౌశల్ ఫ్యాన్ గొడవకు దిగాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

కౌశల్ అభిమాని, తనీష్ అభిమాని గొడవ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిని ఈ స్థాయిలో అభిమానించే వారు ఉన్నారని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉందంటే... బిగ్ బాస్ ఫైనల్ స్టేజీకి వచ్చేసరికి పరిస్థితి ఇంకెలా ఉంటుందో?

టార్గెట్ కౌశల్

టార్గెట్ కౌశల్

కౌశల్ వ్యతిరేకులు అందరూ కౌశల్‌ను టార్గెట్ చేయడానికే ఈవారం నలుగురిని మాత్రమే నామినేషన్‌లోకి తీసుకొచ్చారనీ మరొక అభిమాని అభిప్రాయ పడ్డారు. బాబు గోగినేని అనుచరులు కౌశల్‌కు తప్ప మిగిలిన ముగ్గురికి ఓట్లు పంచుతున్నారని, గీతా మాధురి సపోర్టర్స్ టీవీ9 దీప్తికి మాత్రమే ఓట్లు వేస్తున్నారని, తేజు బ్యాచ్ మొత్తం తనీష్‌కి కళ్లుమూసుకుని వేస్తున్నారని పేర్కొన్నారు.

వారు కౌశల‌కు ఓట్లు వేయడం లేదు

వారు కౌశల‌కు ఓట్లు వేయడం లేదు

ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఉన్న చిన్న చితకా అభిమానులు కలిగి ఉన్న సభ్యుల ఫాలోవర్స్ కౌశల్‌కు తప్ప మిగిలిన అందరికీ ఓట్లు పంచుతున్నారు. వీళ్లందరి టార్గెట్ ఒక్కటే... కౌశల్‌ను ఎలిమినేట్ చేయడమే. బిగ్ బాస్ టీం నలుగురిని మాత్రమే నామినేషన్ లోకి తీసుకురావడానికి ముఖ్యకారణం కూడా ఇదే. ఇలా ఎందుకు చేశారంటే కౌశల్ కు ఎక్కువశాతం అభిమానులతో పాటు వ్యతిరేకులు కూడా కొంత మంది తయారయ్యారు... అని కౌశల్ ఫ్యాన్ అభిప్రాయ పడ్డారు.

కౌశల్ అన్నను గెలిపిద్దాం

డబుల్ ఎలిమినేషన్ ఇంత వరకు చేయలేదు. చేసే అవకాశం లేకపోలేదు కనుక మీకు కూడా అవకాశం ఇస్తున్నాం... దమ్ముంటే మీకు ఎవరిని కావాలంటే వారిని ఎలిమినేట్ చేసుకోండి అన్నట్లుగా ఉంది. కౌశల్‌కి వ్యతిరేకులు అందరూ కొన్ని వందల వేల జీమెయిల్ అకౌంట్లతో మిస్డ్ కాల్స్ ఇస్తూ విరుచుకుపడుతున్నారు. కౌశల్ అభిమానులు ఇప్పటికైనా మేల్కొని టార్గెట్ లాంటివి ఏమీ పెట్టుకోకుండా మొత్తం ఓట్లన్నీ కౌశల్ కి మాత్రమే వేస్తూ... మిస్డ్ కాల్స్ చేస్తూ కౌశల్‌ని కాపాడుకుందాం. ఎవరికి ఎన్ని వీలైతే అన్ని జీమెయిల్ అకౌంట్లు క్రియేట్ చేసి మన కౌశల్ అన్నకు ఓట్లు వేయండి.. అంటూ తన అభిప్రాయం వెల్లడించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X