Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అదేమైనా మగతనమా? గోపీ వేషాలు తగ్గించు: బిగ్ బాస్‌షోలో నాని ఫైర్
Recommended Video
ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, ఫ్రెండ్లీ నేచర్‌తో ఉండే నాని.... బిగ్ బాస్ షోలో శనివారం ప్రసారమైన ఎపిసోడ్లో తన ఉగ్రరూపం చూపించాడు. ఈ షోపై, ఇంటి సభ్యులపై ప్రేక్షకుల నుండి వస్తున్న ఫీడ్ బ్యాగ్ ఆధారంగా ఎవరికి పీకాల్సిన క్లాస్ వారికి పీకారు. ఆయా ఇంటి సభ్యుల లోపాలను ఎత్తి చూపారు. అదే సమయంలో మన బిగ్ బాస్ షోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోందని, టీఆర్పీ రేటింగుల్లో స్టార్ మా టాప్ పొజిషన్లో ఉందని, ఇదంతా ఇంటి సభ్యుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వల్లే సాధ్యమైందని నాని పేర్కొన్నారు.
బాబు గోగినేని సేఫ్ జోన్లోకి
ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన ఐదురుగు సభ్యుల్లో బాబు గోగినేని సేఫ్ జోన్లో ఉన్నట్లు ఈ సందర్భంగా నాని పేర్కొన్నారు. అయితే ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లేది ఎవరు అనేది ఆదివారం ప్రసారం అయ్యే షోలో తేలుతుందన్నారు.
ఆ ముగ్గురు గ్రూపు కట్టడంపై
అయితే ఇంట్లో ఒక గ్రూపుగా ఉంటున్న సామ్రాట్, తేజస్వి, తనీష్‌లను నాని మందలించారు. ఇంటి కెప్టెన్‌గా ఉన్న సామ్రాట్ ఒకే గ్రూపుతో ఉండటం సరైన పద్దతి కాదని ఈ సందర్భంగా నాని మందలించారు.
అమిత్ పనులను మెచ్చుకున్న నాని
కొత్త కెప్టెన్‌గా ఎన్నికైన అమిత్.... ఇంట్లో తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలను ఈ సందర్భగా నాని అభినందించారు. కెప్టెన్‌గా నీ బాధ్యత సక్రమంగా నిర్వహించాలని సూచించి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
అంతా కపట నాటకం అంటూ కౌశల్ ఫైర్
తొలి రోజు నుంచి ఓ గ్రూప్‌గా ఏర్పడిన కొందరు తన ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని కౌశల్ ఆరోపించాడు. ఇక్కడ అంతా కపటనాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. హౌస్‌లోని వాళ్లు కనీస మానవతా విలువలను చూపించడం లేదని, నన్ను బ్యాడ్‌గా చిత్రీకరిస్తే తన పిల్లలు, ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా కౌశల్, తనీష్‌ల మధ్య ఉన్న విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
ఇదేమైనా మగతనమా? గోపీ... కిరిటీపై నాని ఫైర్
ఇక ఇంట్లో గోడ మీద పిల్లి వేషాలు వేస్తున్న కిరిటీ మీద నాని ఫైర్ అయ్యారు. నేను అలా చేయడం లేదని కిరిటీ వాదించడంతో.... సాక్ష్యాలతో సహా వీడియో చూపించి అతడిని తీవ్రంగా మందలించాడు. చేతులు కట్టుకుని ఉన్నోడి దగ్గరకెళ్లి వాయిస్ పెంచేసి కళ్లలో నిమ్మకాయ పిండేయడం... ఇది నీ దృష్టిలో మగతనమా? నువ్వు నామినేషన్స్ లో ఉండి ఉంటే నువ్వు చేసిన పనికి ప్రేక్షకులు నిన్ను ఇంటికి పంపేవారు... అంటూ ఫైర్ అయ్యారు.