బిగ్ బాస్ డే 8: కెప్టెన్ పవర్‌కు సునైన బలి... ఈ వారం ఎలిమినేట్ అయ్యేది వీరే!
Recommended Video

బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ రోజులు గడిచే కొద్దీ రసవత్తరంగా సాగుతోంది. తొలి వారం ఇంటి నుండి మిస్ హైదరాబాద్ సంజన ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మళ్లీ సోమవారం... ఈ వీక్ ఎలిమినేషన్‌కు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. సామ్రాట్ కెప్టెన్ కావడంతో అతడు నామినేషన్ నుండి సేఫ్ అయ్యాడు. ఈ సందర్భంగా సామ్రాట్‌కు ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎవరో ఒకరిని నేరుగా నామినేషన్ చేయవచ్చని తెలిపారు.

కెప్టెన్ స్పెషల్ పవర్‌కు బలైన దీప్తి సునైన
అందరి ముందే ఒకరి పేరును నేరుగా నామినేట్ చేయాలని కెప్టెన్ సామ్రాట్‌కు సూచించడంతో..... ఎవరి పేరు చెప్పాలో అర్థంకాక ఇబ్బంది పడ్డాడు. ఎవరి పేరు చెబితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో? అని భావించి చివరకు అమాయకురాలైన, అందరికంటే చిన్న పిల్ల అయిన దీప్తి సునైనను నామినేట్ చేశాడు.

ఈ వారం నామినేట్ అయింది వీరే
ఈసారి నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా జరిగింది. ఎవరెవరికైతే పడదో వారిని ఇద్దరి చొప్పున కన్‌ఫెషన్ రూముకు పిలిచి నామినేషన్లు స్వీకరించారు బిగ్ బాస్. ఆల్రెడీ దీప్తి సునైనను కెప్టెన్ నేరుగా నామినేట్ చేయగా..... ఇంటి సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం..... ఎక్కువ ఓట్లు పడ్డ గణేష్, నూతన్ నాయుడు, కౌశల్, బాబు గోగినేని ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే ఆదివారం ఇంటి నుండి బయటకు వెళ్లనున్నారు.

దూల తరుస్తారన్న తేజస్వి
బిగ్ బాస్ ఇంట్లో చలాకీగా తిరుగుతూ సందడి చేస్తున్న తేజస్వి మదివాడ.... ఇంట్లో తనతో చాలా క్లోజ్‌గా ఉండే భానుశ్రీ, సామ్రాట్‌లతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. నిన్ను(భానుశ్రీ), సామ్రాట్ ను ఫస్ట్ తీసేయాలి. మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, మీరు లాస్ట్ వరకు వస్తే ప్రేక్షకులు నా దూల తీరుస్తారు అంటూ వ్యాఖ్యానించింది.

కొత్తగా ఇంట్లోకి ఎంటరైన నందినీ రాయ్
సోమవారం ఉదయం బిగ్ బాస్ ఇంట్లోకి కొత్త కంటెస్టెంట్ నందినీ రాయ్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటరయ్యారు. ఆమె వచ్చే ముందు బిగ్ బాస్ ఓ లెటర్ పంపి హింట్ ఇచ్చారు. అయితే అంతా తమన్నా వస్తుందని భావించారు. నందినీ రాయ్ రాకతో బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

ఒక్కొక్కడికి మూడు చెరువుల నీళ్లు తాగించా... ఇదో లెక్కా? : బిగ్‌బాస్‌తో బాబు గోగినేని
ఒక్కొక్కడికి మూడు చెరువుల నీళ్లు తాగించా... ఇదో లెక్కా? అంటూ సంజన తనపై ప్రయోగించిన బిగ్ బాంగ్ గురించి బాబు గోగినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


Click it and Unblock the Notifications











