కౌశల్ కూతురు బర్త్‌డే కేక్ వెనక్కి, రొమాంటిక్ డోస్ పెంచిన బిగ్ బాస్!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 104 Highlights

బిగ్‌బాస్ తెలుగు 2లో శుక్రవారం ప్రసారమైన 104వ ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కౌశల్ కూతురు పుట్టినరోజు సందర్భంగా అతడికి గ్రీటింగ్స్, కేక్ అందింది. అయితే కౌశల్ బిగ్ బాస్ ఇంట్లో తన కూతురు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో బిగ్ బాస్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ బర్త్ డే ఎపిసోడ్ కంటే ముందు, వెనక పలు ఆసక్తికర టాస్కులు, ఫన్నీ ఇన్సిడెంట్స్ ప్రేక్షకులను మరింత ఎంటర్టెన్ చేశాయి. అందుకు సంబంధించిన విశేషాలపై ఓ లుక్కేద్దాం.

 లగ్జరీ బడ్జెట్ టాస్క్-ఒకరి నోటి నుండి ఒకరి నోట్లోకి బాల్స్

లగ్జరీ బడ్జెట్ టాస్క్-ఒకరి నోటి నుండి ఒకరి నోట్లోకి బాల్స్

ఈవారం లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు స్మైలీ బాల్స్ టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం ఒక వైపు ట్రేలో ఉంచిన స్మైలీ బాల్స్‌ను ఇంటి సభ్యులు ఒకరి నోటి నుండి మరొకరి నోటికి పాస్ చేస్తూ మరో వైపు ఉన్న ఖాళీ ట్రేలో వేయాలి. బాల్స్ మీద వివిధ పదార్థాల పేర్లు రాసి ఉన్నాయి. ఎన్ని బాల్స్ వేస్తే అన్ని ఎక్కువ పదార్థాలు ఇంటి సభ్యులకు అందుతాయి. ఈ టాస్క్ ఫన్నీగా, ఆసక్తికరంగా సాగింది. గీతా మాధురి, దీప్తి, సామ్రాట్, తనీష్, రోల్ రైడా, చివరకు కౌశల్ నిల్చుని స్మైలీ బాల్స్ ఒకరి నుండి ఒకరికి పాస్ చేసుకున్నారు.

 కూతురు బర్త్ డే చేసుకోవడానికి నిరాకరించిన కౌశల్

కూతురు బర్త్ డే చేసుకోవడానికి నిరాకరించిన కౌశల్

కౌశల్ కూతురు లల్లి బర్త్ డే సందర్బంగా అతడికి ఒక గ్రీటింగ్ కార్డ్, కేక్ పంపించారు. స్టోర్ రూమ్‌కు వెళ్లి వాటిని కలెక్ట్ చేసుకోవాల్సిందిగా బిగ్ బాస్ సూచించారు. వాటిని చూసి ఎమోషనల్ అయిన కౌశల్... బిగ్ బాస్ ఇంట్లో తన కూతురు బర్త్ డే జరుపుకోవడం ఇష్టం లేదని వాటిని వెనక్కి పంంచారు.

కౌశల్ నిర్ణయానికి కారణం

కౌశల్ నిర్ణయానికి కారణం

తన కూతురు బర్త్ డే జరుపుకోకూడదని కౌశల్ నిర్ణయం తీసుకోవడానికి కారణం... గతంలో ఈ విషయంలో ఇంట్లో కొన్ని గొడవలు జరుగడమే. అందుకే ఈ కేక్, గిఫ్ట్‌ను బయటకు వచ్చిన తర్వాత తాను కలెక్ట్ చేసుకుంటానని చెప్పి కౌశల్ దాన్ని వెనక్కి పంపించారు. గతవారం కౌశల్ తన కూతురును బిగ్ బాస్ ఇంట్లోకి పంపాలని నానిని కోరిన సంగతి తెలిసిందే. అయితే నాని గ్యారంటీ అయితే ఇవ్వలేదు. ఆ తర్వాత ఈ విషయంలో కౌశల్, గీతా మాధురి మధ్య జరిగిన చర్చ.... గొడవకు దారి తీసింది. మీ కూతురు వస్తే మీకు ఓటింగ్ పరంగా ప్లస్సవుతుందనే విధంగా గీతా మాధురి మాట్లాడటమే ఇందుుకు కారణం.

బిగ్ బాస్ సూచనతో సెలబ్రేషన్స్

బిగ్ బాస్ సూచనతో సెలబ్రేషన్స్

చివరకు బిగ్‌బాస్ సూచనతో కౌశల్ తన కూతురు పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ కేక్ మీ ఇంటి సభ్యులు మీకు పంపించారని, దీన్ని తీసుకెళ్లి మీ అమ్మాయి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోండి అని సూచించడంతో కౌశల్ కన్విన్స్ అయ్యారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులు మాట్లాడుతూ.... లల్లి నువ్వు వస్తావని అనుకున్నాం కానీ రాలేదు. నువ్వు ఇలాంటి బర్త్ డేలు ఎన్నో జరుపుకోవాలని, లైఫ్ లో నువ్వు కోరుకున్నది జరుగాలని ఆకాంక్షించారు.

డేట్ విత్ మిస్టర్ హ్యాండ్సమ్ టాస్క్

డేట్ విత్ మిస్టర్ హ్యాండ్సమ్ టాస్క్

ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడానికి బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక రొమాంటిక్ టాస్క్ ఇచ్చారు. ‘డేట్ విత్ మిస్టర్ హ్యాండ్సమ్' పేరుతో సాగే ఈ టాస్కులో భాగంగాదీప్తి, గీతా మాధురి తమకు నచ్చిన వారిని జోడీగా ఎంచుకోవాలి. జంటల బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఆధారంగా లేట్ నైట్ డిన్నర్‌కి వెళ్లే అవకాశం ఇస్తారు.

దీప్తి-కౌశల్.... గీతా-రోల్

దీప్తి-కౌశల్.... గీతా-రోల్

ఈ టాస్కులో దీప్తి నల్లమోతు తనకు జోడీగా కౌశల్‌ను ఎంచుకోగా.... గీతా మాధురి రోల్ రౌడాను సెలక్ట్ చేసుకుంది. వీరిలో కౌశల్- దీప్తిల జంటకు బిగ్ బాస్ ఇంట్లో లేట్ నైట్ డిన్నర్ వెళ్లే అవకాశం దక్కింది. ఈ డిన్నర్‌ డేట్‌లో ఒకరినొకరు మరింత ఇంప్రెస్ చేసుకునే ప్రయత్నాలు..... ప్రేక్షకులను మెప్పించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X