బిగ్‌బాస్ 2: కౌశల్‌‌పై దొంగతనం నిందలు, బ్యాడ్ బాయ్‌గా చిత్రీకరించే ప్రయత్నం!

By Bojja Kumar

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 61 Highlights

తెలుగు బిగ్ బాస్ 2 విజయవంతంగా 61 రోజులు పూర్తి చేసుకుంది. రోజులు గడిచే కొద్దీ ఇంటి సభ్యుల హధ్య పోటీ వాతావరణం మరింత పెంచుతోంది. మరో వైపు బిగ్ బాస్ నిర్వహించే టాస్క్‌లు ఇంటి సభ్యుల మధ్య విబేధాలకు కారణం అవుతున్నాయి. తాజాగా బిగ్‌బాస్ ఇచ్చిన బిజినెస్ టాస్క్ ఇంట్లో కౌశల్ టార్గెట్ అయ్యేలా చేశాయి. చివరకు ఆయన మీద దొంగ అనే ముద్ర పడే వరకు వెళ్లింది. మహిళలకు చెందిన కాయిన్స్ కౌశల్ తీయడాన్ని పురుషుల టీమ్ సభ్యులు దొంగతనంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే మహిళలకు లెస్సన్ నేర్పడానికే తాను కాయిన్స్ తీశానని కౌశల్ చెప్పడంతో తనీష్, కౌశల్ మధ్య వాగ్వుద్ధం జరిగింది.

కాయిన్స్ తీసిన విషయం మాకెందుకు చెప్పలేదు?

కాయిన్స్ తీసిన విషయం మాకెందుకు చెప్పలేదు?

మహిళల టీంకు చెందిన కాయిన్స్ కౌశల్ ఎవరికీ తెలియకుండా తీశారు. దీంతో ఆయన కాయిన్స్ దొంగతనం చేశారనే నింద పడింది. కాయిన్స్ తీసిన విషయం మాకు చెప్పలేదు. ఆయన ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడంటూ తనీష్ ఆరోపణలు చేశారు.

హీరో ప్రభాస్‌, ఎన్టీఆర్‌, దిల్ రాజుకు ఛాలెంజ్!

మహిళలకు లెస్సన్ చెప్పడానికే, నేను దొంగను కాదు

మహిళలకు లెస్సన్ చెప్పడానికే, నేను దొంగను కాదు

మహిళలకు తమ ఆస్తిని కాపాడుకోవడం కూడా తెలియాలి. ఈ విషయంలో వారికి ఒక లెస్సన్ చెప్పడానికే నేను కాయిన్స్ తీశాను అని కౌశల్ వాదించాడు. నేను దొంగను కాదు, నాకు అలాంటి ఉద్దేశ్యంలేదన్నాడు. కౌశల్ వాదనకు దీప్తి నల్లమోతు కూడా మద్దతు పలికింది. తాము ఆయన్ను దొంగగా భావించడం లేదని తెలిపింది.

కౌశల్, తనీష్ మధ్య పోటా పోటీ వాదనలు

కౌశల్, తనీష్ మధ్య పోటా పోటీ వాదనలు

కాయిన్స్ దొంగతనం విషయంలో కౌశల్, తనీష్ మధ్య పోటా పోటీ వాదనలు జరిగాయి. తాను ఏ విషయం అయినా టీం సభ్యులతో మాట్లాడి చేశాను. కౌశల్ అలా చేయకుండా మాకు తెలియకుండా కాయిన్స్ దాచాడు. ఆయన వ్యక్తిగత గేమ్ ఆడుతున్నాని వాదించాడు. తనీష్ వాదనకు బాబు గోగినేని, గణేష్, అమిత్, సామ్రాట్ కూడా మద్దతు తెలపడం గమనార్హం.

టీమ్‌లో లేనని చెప్పడానికి మీరెవరు? బాబుపై కౌశల్

టీమ్‌లో లేనని చెప్పడానికి మీరెవరు? బాబుపై కౌశల్

మీరు కాయిన్స్ దొంగతనం చేశారు, ఇది దారుణం అని బాబు గోగినేని కౌశల్ మీద ఫైర్ అయ్యారు. మాకు చెప్పకుండా మీరు కాయిన్స్ దాచారు కాబట్టి మీరు టీమ్‌లో లేరని అర్థం అంటూ మండి పడ్డారు. దీనికి కౌశల్ రియాక్ట్ అవుతూ నేను టీమ్‌లో లేనని చెప్పడానికి మీరెవరు? అంటూ కౌంటర్ ఇచ్చాడు.

సమంతకు తెగనచ్చేసింది... చైతూకు సపోర్టు చేస్తూ ట్వీట్!

బాత్రూం విషయంలో కూడా కౌశల్‌పై నింద

బాత్రూం విషయంలో కూడా కౌశల్‌పై నింద

కౌశల్ లేడీస్ బాత్రూం వాడుతున్నాడనే ఆరోపణలు సైతం వినిపించాయి. జంట్స్ బాత్రూం బాగోలేనపుడు....అర్జంట్ అయితేనే తప్ప లేడీస్ బాత్రూం వాడతానే తప్ప తనకు మరో ఉద్దేశ్యం లేదని కౌశల్ తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

 బిజినెస్ టాస్క్ విన్నర్ జంట్స్ టీమ్

బిజినెస్ టాస్క్ విన్నర్ జంట్స్ టీమ్

ఇలా పోటా పోటీగా సాగిన బిజినెస్ టాస్క్‌లో జంట్స్ టీమ్ 330 కాయిన్స్‌తో విజేతగా నిలిచింది. తాను తీసిన కాయిన్స్ కౌశల్ లేడీస్‌కు తిరిగి ఇచ్చినప్పటికీ.... వారు చారిటీ కోసం 10 కాయిన్స్ కేటాయించడంతో 325 కౌంట్ మాత్రమే వచ్చింది. దీంతో లేడీస్ టీమ్ ఓడిపోక తప్పలేదు.

ఆడవాళ్లకు సమాన హక్కులు ఉండాలన్న కౌశల్

ఆడవాళ్లకు సమాన హక్కులు ఉండాలన్న కౌశల్


మగవాళ్లు వంట చేయలేరు, ఆడవాళ్లు వ్యాపారం చేయలేరు... అనే పాయింటు మీద బిగ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చారు. తాము వంట చేయగలమని మగాళ్లు, తాము బిజినెస్ చేయగలం అని ఆడవాళ్లు నిరూపించుకోవడమే ఈ టాస్క్ ప్రధాన ఉద్దేశ్యం. టాస్క్ ముగిసిన తర్వాత కౌశల్ మాట్లాడుతూ ఆడవాళ్లయినా, మగవాళ్లయినా సమానమే అని, నేనెప్పుడూ అలాగే చూస్తానని, అదే తన ఉద్దేశ్యమని తెలిపారు.

కెప్టెన్సీ కోసం తనీష్, దీప్తి పోటీ

కెప్టెన్సీ కోసం తనీష్, దీప్తి పోటీ

వచ్చేవారం కెప్టెన్సీ కోసం దీప్తి నల్లమోతు, తనీష్ పోటీ పడ్డారు. గోడకు రంగులు వేసే కార్యక్రమంలో తీవ్రంగా తలపడ్డారు. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారు? అనేది ఈ రోజు ప్రసారం అయ్యే షోలో తేలనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X