బిగ్ బాస్ 2: గీతా మాధురి, శ్యామల సేఫ్... ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరో తెలుసా?

By Bojja Kumar

నాని హోస్ట్‌గా సాగుతున్న బిగ్ బాస్ తెలుగు 2 విజయవంతంగా 63 రోజులు పూర్తి చేసుకుంది. వీకెండ్ రావడంతో ఈ వారం ఇంటి నుండి ఎవరు బయటకు వెళతారు? అనే విషయంలో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆ సస్పెన్స్‌ను మెయింటేన్ చేస్తూ.... నాని తనదైన శైలిలో శనివారం షోను మరింత ఆసక్తిగా నడిపించారు. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్లో తనీష్, బాబు గోగినేని, గణేష్, గీతా మాధురి, శ్యామల, దీప్తి నల్లమోతు ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లాల్సి వస్తుంది.

గీతా మాధురి, శ్యామల సేఫ్

గీతా మాధురి, శ్యామల సేఫ్

శనివారం జరిగిన ఎపిసోడ్లో గీతా మాధురి, శ్యామల ఈ వారం ఎలిమినేషన్ నుండి సేఫ్ అయినట్లు నాని ప్రకటించారు. నామినేటైన ఆరుగురిలో అందరికంటే ఎక్కువ ఓట్లు ఈ ఇద్దరికే పడ్డాయని తెలిపారు. అదే సమయంలో వీరిద్దరినీ గేమ్ సీరియస్‌గా ఆడాలని నాని హెచ్చరించారు.

 మిగిలిన నలుగురిలో నామినేట్ అయ్యే దెవరు?

మిగిలిన నలుగురిలో నామినేట్ అయ్యే దెవరు?

ఇద్దరు సేఫ్ అవ్వగా మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్ తనీష్, బాబు గోగినేని, దీప్తి, గణేష్‌ వీరిలో ఎవరు ఇంటి నుండి బయటకు వెళారు అనేది ఆదివారం జరిగే షోలో ప్రకటించనున్నారు. అయితే వీరిలో తనీష్, దీప్తి నల్లమోతుకు ప్రేక్షకుల నుండి ఎక్కువ మద్దతు లభించే అవవకాశం ఉందని తెలుస్తోంది.

 బలమైన కంటెస్టెంట్స్

బలమైన కంటెస్టెంట్స్

ప్రస్తుతం ఎలిమినేషన్ నామినేషన్లలో ఉన్న వారిలో బలమైన కంటెస్టెంట్స్ తనీష్, దీప్తి నల్లమోతు అనే వాదన వినిపిస్తోంది. బిగ్ బాస్ టాస్కుల్లో, ఇంట్లో జరిగే ఇతర వ్యవహారాలతో పాటు... తోటి సభ్యులతో వీరు వ్యవహరించే తీరుపై సర్వత్రా సంతృప్తి వ్యక్తం అవుతోంది.

వీరిలో ఒకరు ఔట్

వీరిలో ఒకరు ఔట్

బాబు గోగినేని వ్యవహరించే తీరు, బిగ్ బాస్ పెట్టే టాస్కుల్లో అతడు పెద్దగా ఆసక్తి చూపక పోవడం, కొన్ని టాస్కులు మొక్కుబడిగా చేస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. గణేష్ కూడా అందరితో సరిగా కలవడం లేదనే విమర్శలున్నాయి. ఈ వారం వీరిద్దరిలో ఒకరు బయటకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X