బిగ్‌బాస్ 63వ ఎపిసోడ్ హైలెట్స్: దీప్తికి షాకిచ్చిన నూతన్... రఫ్పాడించిన నాని!

By Bojja Kumar

నాని హోస్ట్‌గా రన్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు 2 ఆసక్తికర మలుపులు, ఊహించని పరిణామాలతో సాగుతోంది. శనివారం(63వ రోజు) జరిగిన షోలో నాని తనదైన శైలిలో కంటెస్టెంట్లను రఫ్పాడించారు. ఇంట్లో వారు చేస్తున్న తప్పులను, గేమ్ ఆడటంలో వారి లోపాలను ఎత్తి చూపుతూ తన స్టైల్‌లో వారికి క్లాస్ పీకాడు. ఈ సందర్భంగా నానీ టీవీ అంతకు ఎపిసోడ్లోని కొన్ని హైలెట్స్ ప్రదర్శించారు. ఇందులో తనతో మాట్లాడటానికి వచ్చిన దీప్తితో నూతన్ నాయుడు ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకు సంబంధించిన విశేషాలపై ఓ లుక్కేద్దాం.

 నా దగ్గర నటించకు: దీప్తికి షాకిచ్చిన నూతన్

నా దగ్గర నటించకు: దీప్తికి షాకిచ్చిన నూతన్

ఈ వారం నామినేషన్ లిస్టులో ఉన్న దీప్తి.... వచ్చేవారం ఉంటానో లేదో అనే ఒక ఆలోచనలో పడిపోయింది. అందుకే ఇంటి సభ్యులందరినీ ఒకచోట కూర్చోబెట్టి మాట్లాడాలని ఆశపడింది. లాన్‌లో కూర్చుని ఉన్న నూతన్ నాయుడిని కూడా రావాలని అడగటంతో ఏం మాట్లాడాలో ఇక్కడే చెప్పు అంటూ దీప్తిని అడగటంతో.... తన మనసులోని మాటను చెప్పింది. నువ్వు ఎలాగూ బయటకు వెళ్లవు, నువ్వే ఎలిమినేట్ అయినట్లు ఎందుకు నటిస్తున్నావ్. ఎవరిముందైనా నటించు.. నా ముందు నీ యాక్టింగులు చెల్లవ్ అంటూ షాకిచ్చాడు నూత్. మీకు కూడా గేమ్ గెలవడానికే వచ్చారు కదా.... అని దీప్తి అనడంతో నేను నీకు ఆ విషయం చెప్పానా? అంటూ కౌంటర్ ఇచ్చాడు. అతడి మాటలతో హర్ట్ అయిన దీప్తి నీతో మాట్లాడటం దండగ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది.

ఈ బ్యాచ్ అంతా సరదాగా, ఆ ఇద్దరూ విడిగా...

ఈ బ్యాచ్ అంతా సరదాగా, ఆ ఇద్దరూ విడిగా...

ఇంటి సభ్యులంతా ఒక చోట కూర్చుని సరదగా మాట్లాడుకకున్నారు. అయితే కౌశల్, నూతన్ నాయుడు మాత్రం వీరితో కలవకుండా బెడ్రూంలో ఉండి ఇతర సభ్యుల గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఇంటి సభ్యులను ఇమిటేట్ చేశాడు కౌశల్.

తనీష్ మీద నాని పంచులు

తనీష్ మీద నాని పంచులు

‘రంగు రబ్బా.. రబ్బా'.. టాస్క్‌లో గెలిచి రెండోసారి కెప్టెన్ అయిన తనీష్ మీద నాని పంచులు వేస్తూ నవ్వులు పూయించాడు. అంతిమ యుద్ధం టాస్క్‌లో అసలు నువ్వు పెద్దగా ఆడింది లేదు. అలాంటి నువ్వ రెండో సారి ఎలా కెప్టెన్ అయ్యావంటూ ఆటపట్టించే ప్రయత్నం చేశాడు.

 కౌశల్‌ను దొంగ అని ఎలా అంటావ్?

కౌశల్‌ను దొంగ అని ఎలా అంటావ్?

ఇంతకు ముందు జరిగిన ఓ టాస్కులో కౌశల్ కాయిన్స్ దొంగిలించాడనే నిందలు పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పూజా విసిరిన కాయిన్స్ తనీష్ తీసుకోవడాన్ని నాని తప్పుబట్టాడు. ఆ టాస్క్ ఎవరూ సరిగా ఆడలేదని నాని ఫైర్ అయ్యాడు.

 నూనత్ నాయుడు... ఏమిటి నీ వ్యవహారం?

నూనత్ నాయుడు... ఏమిటి నీ వ్యవహారం?

ఇంటి సభ్యులను నూతన నాయుడు... ఓరేయ్ అని పిలవడాన్ని నాని ప్రశ్నించారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి వచ్చిన తర్వాత మీలో చాలా మార్పు వచ్చిందని, మీ వ్యవహారంలో చాలా తేడీ కనిపిస్తోందని నాని అడగటంతో.... నూతన్ ఎవరికీ అర్థం కాకుండా తనదైన ఫిలాసఫీ చెప్పారు. టైటిల్ గెలిచినా గెలవకపోయినా ఇంటి సభ్యుల మనసు గెలుస్తానన్నారు. దీనిపై నాని రియాక్ట్ అవుతూ నువ్వు గెలవాల్సింది ప్రేక్షకుల మనసులను అని సూచించాడు.

సునైనా మీద నాని ఫైర్

సునైనా మీద నాని ఫైర్

దీప్తి, తనీష్ పోటీ పడ్డ రంగు రబ్బా రబ్బా.. టాస్కులో సునైనా సంచాలకురాలుగా ఉండటాన్ని నాని తప్పుబట్టారు. తనీష్, నువ్వు ఎంత క్లోజ్‌గా ఉంటారో అందరికీ తెలుసు, నువ్వు తనీష్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటావని ఎవరూ నమ్మరు... అలాంటపుడు ఏ అర్హతతో సంచాలకురాలుగా ఉండటానికి ముందుకొచ్చావు అంటూ నాని ఆమెకు క్లాస్ పీకాడు.

 బాబు మీద నాని

బాబు మీద నాని

మిగతా వారితో పోలిస్తే బాబు గోగినేని యాక్టివ్‌గా ఉండటం లేదని, అయితే ఈ విషయంలో మీ వయసును కూడా పరిగణలోకి తీసుకుంటున్నామని నాని అన్నారు. అయితే బాబు నానికి తనదైన ఫిలాసఫీ చెప్పినా నాని మాత్రం ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించలేదు.

 పూజా కెప్టెన్సీపై కౌశల్ అసంతృప్తి

పూజా కెప్టెన్సీపై కౌశల్ అసంతృప్తి

పూజా కెప్టెన్సీ గురించి నాని అడగ్గా... కౌశల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె సరిగా కెప్టెన్సీ చేయలేదని, ఏ విషయాన్ని సరిగా పట్టించుకునేది కాదని తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా చెప్పారు.

 ఎలిమినేషన్ తేలేది నేడే

ఎలిమినేషన్ తేలేది నేడే

ఈ వారం ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆదివారం ప్రసారం అయ్యే షోలో తేలనుంది. శ్యామల, గీతా మాధురి సేఫ్ అయినట్లు నాని నిన్న ప్రకటించారు. దీంతో దీప్తి, గణేష్, బాబు గోగినేని, తనీష్ ఈ నలుగురిలో ఒకరు బయటకు వెళ్లడం ఖాయం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X