బిగ్‌బాస్ ఫైనల్ అప్‌డేట్: కంటి తడి పెట్టిన తనీష్ తల్లి!
బిగ్‌బాస్ తెలుగు 2 గ్రాండ్ ఫినాలే జోరుగా మొదలైంది. నాని హోస్ట్‌గా డిఫరెంట్ మార్కులో స్టేజి పైకి వచ్చారు. వేదికపై పాటలకు డ్యాన్సులు చేస్తూ నాని ఆకట్టుకొన్నాడు. ఆ తర్వాత ఫైనల్‌కు చేరిన ఐదుగురు హౌస్‌మేట్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తనీష్ తల్లితో నాని మాట్లాడుతుండగా ఆమె ఎమోషనల్‌గా మారారు. ఆమె నోటి నుంచి మాటలు పెగల్లేదు. ఉద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్బంగా తనీష్ తల్లి మాట్లాడుతూ.. వాళ్ల నాన్నగారి సంవత్సరీకం రోజున బిగ్‌బాస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. బిగ్‌బాస్ తెలుగు 2 రియాలిటీ షోలో పాల్గొనాలంటూ ఆఫర్ చేశారు అని తనీష్ చెప్పాడు. అయితే నేను ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నాను. తాను ఆలోచించి బిగ్‌బాస్‌లో పాల్గొంటానని చెబితే సరే అన్నాను.

తనీష్ ఫైనల్ చేరుకోవడం హ్యాపీగా ఉంది. అందుకే ఫైనల్ చూడటానికి వచ్చాను అని చెప్పారు. గతంలో తాను ఫైనల్‌కు వస్తే అమ్మ బిగ్‌బాస్ రావాలి అని తనీష్ కోరుకొన్న సంగతి తెలిసిందే. తనీష్ కోరిక ప్రకారమే ఆయన తల్లి బిగ్‌బాస్ ఫైనల్ విజేతను నిర్ణయించే వేడుకు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











