బిగ్‌బాస్ ఫైనల్‌కు ఓట్ల సునామీ.. రికార్డుస్థాయిలో ఓటింగ్.. విజేత ఎవరో తెలుసా?
Recommended Video

బిగ్‌బాస్ తెలుగు 2 రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొన్నది. ఆదివారం జరిగే ఫైనల్‌లో విజేత ఎవరో తేలనున్నది. అయితే ఆన్‌లైన్ ఓటింగ్, మొబైల్ ఓటింగ్‌కు సంబంధించిన సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కౌశల్ విజేత అనే ధీమా వ్యక్తమవుతున్నది. రెండో స్థానం కోసం భారీగా పోటీ ఉంది. నాలుగు, ఐదు స్థానాల ఎప్పడో ఖారరైనట్టు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే..

కోట్లలో ఓటింగ్
బిగ్‌బాస్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ రికార్డైంది. రికార్డు స్థాయిలో 27 కోట్లకుపైగా ఓట్లు వచ్చినట్టు సమాచారం. ఇతర భాషలను పరిగణనలోకి తీసుకొంటే తెలుగు బిగ్‌బాస్‌కు వచ్చిన ఓట్లు ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు.

కౌశల్‌కు టాప్ ఓటింగ్
బిగ్‌బాస్ ఫినాలే ప్రారంభమైనప్పటి నుంచి కౌశల్ ఓటింగ్‌లో దూసుకుపోయాడనే విషయం సర్వేలు, ఒపీనియన్ పోల్స్‌లో స్పష్టమైంది. తొలి రోజుల్లో పోలైన ఓట్లలో కౌశల్‌కు 50 శాతానికి పైగా ఓట్లు వచ్చినట్టు స్పష్టమైంది. చివర్లో ఆ ఓట్ల శాతం 45 శాతం వద్ద సెటిల్ అయినట్టు సమాచారం. అనధికారికంగా కౌశల్ విజేతగా నిలిచారనే వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.

రెండోస్థానం కోసం
ఇక రెండో స్థానం కోసం దీప్తి, గీతా మాధురి మధ్య పోటీ ఉంది. ఆరంభంలో గీతా మాధురి తనదైన శైలిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పటికీ.. దీప్తి తన టాలెంట్ ప్రదర్శించి గట్టిపోటి ఇచ్చింది. అంతేకాకుండా దీప్తి సోషల్ మీడియాను భారీగానే వినియోగించుకొన్నట్టు వార్తలు వచ్చాయి.

చివరి స్థానాల కోసం తనీష్, సామ్రాట్
ఇప్పటి వరకు నమోదైన ఓటింగ్‌లో సుమారు 5 శాతం ఓట్లు సామ్రాట్‌కు వచ్చినట్టు తెలిసింది. సామ్రాట్ కంటే కొంచెం మెరుగ్గా ఓట్లు వచ్చినట్టు సమాచారం. వీరిద్దరూ టైటిల్ రేసులోనే లేరనే విషయం ముందు నుంచి సర్వేలు చెబుతున్నాయి.
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

తెలుగు వన్ ఇండియా ఒపీనియన్ పోల్స్
బిగ్‌బాస్ తెలుగు 2 ఫినాలే కోసం వన్ ఇండియా తెలుగు, ఫిల్మీబీట్ తెలుగు ఆన్‌లైన్ ఒపీనియన్ పోల్స్‌ను చేపట్టింది. వన్ ఇండియా తెలుగు న్యూస్ వెబ్‌సైట్‌లో కౌశల్‌కు అత్యధికంగా ఓట్లు సంపాదించుకొన్నాడు. రెండో స్థానంలో గీతా, మూడో స్థానంలో దీప్తి, నాలుగు, ఐదు స్థానాల్లో సామ్రాట్, తనీష్ నిలిచారు.

తెలుగు ఫిల్మీ బీట్ ఒపీనియన్ పోల్స్
ఇక తెలుగు ఫిల్మీబీట్ నిర్వహించిన ఆన్‌లైన్ ఒపీనియన్ పోల్స్‌లో కూడా కౌశల్ మండా అధిపత్యంతో దూసుకెళ్లాడు. గీత మాధురి, దీప్తి, తనీష్, సమ్రాట్‌లు వరుసగా తమ స్థానాలను దక్కించుకొన్నారు.


Click it and Unblock the Notifications











