twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్2 మొద‌లై ప‌దిరోజులు... వినోదం నిల్, విర‌క్తి ఫుల్!

    By Staff
    |

    బిగ్ బాస్ తెలుగు సీజన్2 ప్రారంభ‌మై సరిగ్గా ప‌దిరోజులు కావ‌స్తోంది. ఈ ప‌ది రోజుల్లో షో ప‌రంగా ప్రేక్ష‌కుల‌కు ఏదైనా వినోదం ల‌భించిందా అంటే స‌మాధానం చెప్ప‌డం చాలా క‌ష్ట‌మ‌నిపిస్తోంది. ఇంటి స‌భ్యులు ఈ ప‌దిరోజులు బిగ్ బాస్ అభిమానుల‌కు వినోదం పంచారా..? విసుగు పుట్టించారా..?? అంటే రెండో దానికే ఎక్కువ ఓట్లు ప‌డ‌తాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా బిగ్ బాస్2 ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది త‌ప్ప బాగుంద‌నే భావ‌న‌ను ఏ ఒక్క ప్రేక్ష‌కుడు కూడా వ్య‌క్తం చేయ‌లేక‌పోతున్నాడు.

    అనేక కారణాలు

    అనేక కారణాలు

    భారతంలో క‌ర్ణుడు చావుకు వెయ్యి కారణాల‌న్న‌ట్టు బిగ్ బాస్2 ప్రేక్ష‌కుల‌కు క‌నెక్టు కాక‌పోవ‌డానికి కూడా అన్నే కార‌ణాల‌ను చెప్పొచ్చు. హోస్టు ద‌గ్గ‌ర నుండి ఇంటి స‌భ్యుల వ‌ర‌కు ఏ ఒక్క‌రు కూడా స‌రైన రీతిలో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోతున్నార‌ని ప్ర‌ధాన విమ‌ర్శ వినిపిస్తోంది.

    Recommended Video

    Madhavi Latha Shocking Comments On Bigg Boss 2
    ఆకట్టుకోని నాని హోస్టింగ్

    ఆకట్టుకోని నాని హోస్టింగ్

    షో కు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాని ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేయ‌డంలో పూర్తిగా విఫ‌లం చెందాడ‌నే విమ‌ర్శ‌లు కూడా వెల్లువెత్తుతున్నాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్ యాంక‌రింగ్ తో పోల్చుకుంటున్న ప్రేక్ష‌కుల‌ నుండి నాని ఏ కోశానా స‌రితూగ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. ఒక ఇంటి స‌భ్యుడు ఎలిమినేట్ అవుతున్న‌డంటే అందుకు దారి తీసిన ప‌రిణామాల‌ను, ఇంటి స‌భ్యుడి మాన‌సిక ప‌రిస్థితిని, మెచ్యూరిటీ లెవ‌ల్స్‌ని, మిగ‌తా కుటుంబ స‌భ్యులు తెలిపిన కార‌ణాల‌ను వేదిక మీద స‌మూలంగా విశ్లేషించ గ‌లిగి హోస్టుగా త‌న అభిప్నాయాన్ని క్రోడీక‌రించాల్సి ఉంటుంది. ఈ ప‌రంప‌ర‌లో షోని న‌డిపిస్తున్న కెప్టెన్ వ్య‌వ‌హ‌రిస్తున్న విధానం ఆక‌ర్శ‌నీయంగా, స్ప‌ష్టంగా, స‌స్పెన్స్‌గా, కాస్త హాస్యంగా ఉంటే షో బాగా ర‌క్తి క‌డుతుంది. అంతే గాని క‌ట్టె కొట్టె తెచ్చె అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తే ఏ షో ఐనా ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌రుస్తుంది.

    సింపుల్‌గా ముగించిన నాని

    సింపుల్‌గా ముగించిన నాని

    వాస్త‌వానికి సంజ‌న ఎలిమినేట్ అవుతున్న సంద‌ర్బంలో యాంక‌ర్‌గా నాని ప్రేక్ష‌కుల‌ను కొంత మేర‌కు విచారానికి గురిచేసి ఉండ‌వ‌చ్చు. ప‌రిస్థితుల‌ను కొంత మేర విషాదంలోకి తీసుకెళ్లవ‌చ్చు. కొండంత ఆశ‌తో హౌస్‌లోకి అడుగుపెట్టి అంత తొంద‌ర‌గా తిరిగి వెళ్లి పోవ‌డం అంటే బాధాక‌ర‌మైన అంశ‌మే.. ఆ దృశ్యాన్ని గెండెలు బ‌రువెక్కేలా మ‌ల‌చ‌డంలో నాని చాలా సాదా సీదాగా వ్య‌వ‌హ‌రించారు. ఒక యాంక‌ర్‌లో ఉన్న విష‌య ప‌రిజ్ఞానాన్ని అలాంటి సంద‌ర్బాలే బ‌హిర్గ‌తం చేస్థాయి. కాని నాని మొద‌టి ఎలిమినేట్ వ్య‌వ‌హారాన్ని చాలా సింపుల్ గా ముగించారు.

    అంకిత భావం క‌నిపంచ‌డం లేదు

    అంకిత భావం క‌నిపంచ‌డం లేదు

    ఇక ఈ ప‌ది రోజులుగా ఇంటి స‌భ్యుల వ్య‌వ‌హారం, ఆడుతున్న గేమ్స్, ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేయ‌డంలో చూపిస్తున్న శ్ర‌ద్ద‌, మాట‌ల తీరు, బాడీ లాంగ్వేజ్ అన్నీ అసంబద్దంగా అనిపిస్తున్నాయి. ఏదో సెలెక్టు అయ్యాం..వ‌చ్చాం.. పింపిస్తే వెళ్లిపోతాం..ఏంట‌ట? అన్నట్టుగానే ఉంది త‌ప్ప ఏ ఒక్క‌రిలో కూడా అంకిత భావం క‌నిపంచ‌డం లేదు. ఒక స‌న్నివేశాన్ని ర‌క్తి క‌ట్టించేందుకు ఎలా ముందుకు వెళ్లాలి, ఎలా వ్య‌వ‌హ‌రించాలి అనే క‌నీస జ్ఞానం లేకుండా ఇంటి స‌భ్యులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

    బిగ్ బాస్ హౌస్ లో ఒక‌రి అభిప్రాయాలు ఒక‌రికి తెలియాల‌ని, స్ప‌ష్టంగా వినిపించాల‌ని, రికార్డు అవ్వాల‌నే క‌దా మెడ‌లో మైక్‌లు త‌గిలించింది. మ‌రి ఆ విష‌యాన్ని మ‌ర్చిపోయి గుస‌గుస‌లు మాట్లాడుకోవ‌డం చిరాకు తెప్పిస్తోంది. ఈ విషయంలో యాంక‌ర్ శ్యామ‌ల‌కు బిగ్ బాస్ గ‌ట్టి వార్నింగ్ ఇవ్వాల‌నే డిమాండ్ కూడా వినిపిస్తోంది.

    ఇలాగే కొనసాగితే ప్లాపవ్వడం ఖాయం

    ఇలాగే కొనసాగితే ప్లాపవ్వడం ఖాయం

    గీతా మాధురి అమాయ‌క‌పు మాట‌లు ఎప్పుడో ఒక సారి బాగ‌నిపిస్తాయి త‌ప్పితే ఎప్పూడూ అదే స్లాంగ్ వాడితే విన‌డానికి బోర్ కొడుతోంది. కెప్టెన్ గా సామ్రాట్ అస్స‌లు సూట్ కాలేద‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇంగ్లీష్ భాష‌ని వాడొద్ద‌ని కన్ఫెక్ష‌న్ రూంలో చెప్పించుకుని, రూం బ‌య‌ట‌కు రాగానే ఆ విష‌యాన్ని మ‌ర్చిపోవ‌డం, వ‌చ్చీరాని ఇంగ్లీష్ ని ప‌దే ప‌దే మాట్ల‌డటం విసుగుతెప్పిస్తున్నాయి త‌ప్ప వినోదాన్ని మాత్రం పంచ‌డం లేదు. బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులు కూడా ఈ సారి అంత‌గా క‌నెక్టు అవ్వ‌డం లేదు.

    ఏదేమైనా వంద రోజుల బిగ్ బాస్2 సీస‌న్ ను ప్రేక్ష‌కులు 10రోజులు భారంగా నెట్టుకొచ్చార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రికొన్ని రోజులు ఇలాగే కొన‌సాగితే ఫ్లాపైన టీవీ సీరియ‌ల్ జాబితాలో బిగ్ బాస్2 సీస‌న్‌ను తోసెయ్య‌డం ఖాయంలా క‌నిపిస్తోంది.

    English summary
    Bigg Boss Telugu 2 first 10 day review. Nani hosting for Bigg Boss 2 not as impressing as the season 1 host Jr NTR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X