బిగ్‌బాస్ తెలుగు 2 గ్రాండ్ ఫినాలె లైవ్: బిగ్‌బాస్ నుంచి సామ్రాట్, దీప్తి, తనీష్ అవుట్
Recommended Video

తెలుగు బుల్లితెర ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 2 గ్రాండ్ పినాలె అట్టహాసంగా మొదలైంది. తెలుగు సినిమా సూపర్ హిట్ సాంగులకు డాన్స్ చేస్తూ నాని ఎంట్రీ అదరగొట్టాడు. ముఖ్యంగా నాని తన మాస్ సినిమాలోని పాటలకు చేసిన డాన్స్ అదిరిపోయింది. గ్రాండ్ ఫినాలెకు బిగ్ బాస్ వేదికను సిద్ధం చేసిన తీరు కూడా అద్భుతంగా ఉంది. 113 రోజులు... ఆఖరి ఆదివారం... కంటిన్యూస్‌గా షోను ఫాలో అవుతూ ఇంత సపోర్ట్ చూపించి బిగ్ బాస్ సీజన్ 2న బ్లాక్ బస్టర్ చేశారు అంటూ.... గ్రాండ్ ఫినాలె ఈవెంటులో నాని ఎంట్రీ ఇచ్చాడు. ఐదుగురిలో మొదట సామ్రాట్ ఔట్ అయ్యాడు.

బిగ్‌బాస్ తనీష్ అవుట్
బిగ్‌బాస్ షో నుంచి టాప్ ఐదుగురు కంటెస్టెంట్‌లో మూడో సెలబ్రిటీగా తనీష్ అల్లాడి ఎలిమినేట్ అయ్యాడు. 113 రోజుల జర్నీలో ఎన్నో అనుభవాలను, అనుభూతులను మదిలో నింపుకొని బయటకు వచ్చాడు. ఇంట్లో సెల్ఫీ దిగిన తర్వాత తనీష్‌ను నాని వేదికపైకి ఆహ్వానించాడు.
ఇంట్లో గత మూడు నెలలుగా జరిగిన తన లైఫ్ జర్నీని చూసి తనీష్ ఉద్వేగానికి గురయ్యాడు.

దీప్తి బిగ్‌బాస్ ఇంటిని వదిలి
ఐదుగురు ఫైనలిస్టుల నుండి మొదట సామ్రాట్ నిష్క్రమించాడు. సామ్రాట్ నిష్క్రమించిన తర్వాత బయటకు వచ్చేది ఎవరో చెప్పే క్రమంలో అందరినీ కొంతసేపు టెన్షన్ పెట్టిన నాని..... విజయవాడ ప్రేక్షకులు మీకు వెల్‌కం చేయడానికి రెడీగా ఉన్నారంటూ దీప్తి పేరు వెల్లడించారు.
దీప్తి బిగ్‌బాస్ ఇంటిని వదిలి.... నాని ఉన్న స్టేజీ మీదకు రాగానే ఆమె గురించి ప్రోమో ప్రదర్శించారు. బిగ్ బాస్ షోకు సంబంధించిన ప్రతి టాస్కులోనూ పట్టువదలకుండా దీప్తి నల్లమోతు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా ఫోకస్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకున్నాయి.

బిగ్‌బాస్ నుంచి సామ్రాట్ అవుట్
బిగ్‌బాస్ తెలుగు 2 షోలోకి వెళ్లిన సామ్రాట్ రెడ్డి టాప్ ఐదుగురిలో ఒకరిగా నిలిచారు. బిగ్‌బాస్ ఫైనల్ షో సందర్బంగా జరిగిన ఎలిమినేషన్‌లో సామ్రాట్ మొదటి వ్యక్తిగా ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇంట్లో మిగితా నలుగురు సభ్యులతో సెల్పీ దిగిన తర్వాత సామ్రాట్‌ను నాని వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం 113 రోజుల లైఫ్ జర్నీని చూపించారు. ఈ సందర్బంగా సామ్రాట్ ఉద్వేగానికి గురయ్యాడు.

కొత్త సామ్రాట్‌గా రావాలి
ఐదుగురు ఫైనల్ కంటెస్టెంట్లలో మొదట సామ్రాట్‌కు నాని నుండి పిలుపు వచ్చింది. దీంతో అతడు విన్నర్ కాదని తేలిపోయింది.
ఇంట్లో ఉన్నపుడు సామ్రాట్ ఏదో పొగొట్టుకున్నట్లు ఉండేవాడు. ఈ షోకు వచ్చిన తర్వాత అంతా మరిచిపోయి చాలా సంతోషంగా కనిపించాడు అని సామ్రాట్ తండ్రి వెల్లడించారు. బిగ్ బాస్ లోకి సామ్రాట్ రావడం చాలా సంతోషంగా ఉంది. గతం మరిచిపోయిన ఒక కొత్త సామ్రాట్‍ను చూస్తామనే నమ్మకం ఉందని ఆయన తల్లి తెలిపారు.

తనీష్ తల్లి భావోద్వేగం
తనీష్ వాళ్ల డాడీ సంవత్సరీకం రోజున బిగ్ బాస్ షోకు సంబంధించి ఫోన్ వచ్చింది. వెళ్లనా అమ్మ అంటే ఆలోచించుకుని నిర్ణయం తీసుకో అన్నాను.... అని తనీష్ తల్లి భావోద్వేగానికి గురయ్యారు.

దీప్తి నల్లమోతు గ్రేట్ అచీవ్మెంట్
ఇక్కడిదాకా రావడమే గ్రేట్ అచీవ్మెంట్ అని దీప్తి నల్లమోతు భర్త అన్నారు.

కౌశల్ భార్య ఏమన్నారంటే
చాలా సార్లు కౌశల్ ఏంటి అని అందరికీ తెలియాలనుకున్నాను. అలాంటి సమయంలో బిగ్ బాస్ లాంటి అద్భుతమైన ఫ్లాట్ ఫాం దొరికిందని కౌశల్ భార్య వ్యాఖ్యానించారు.

గణేష్ మీద నాని పంచ్‌లు
గణేష్‌ను పలకరించిన నాని..... నీ బొర్ర ఏమైంది కనిపించడం లేదు, అమ్మేశావా? అంటూ పంచ్ వేశాడు. నీ వెంట్రుకలు అలా నలబడి ఉన్నాయేంటి? విగ్గు పెట్టావా? అంటూ ఆటపట్టించే ప్రయత్నం చేశారు.

తనీష్ ఉండడు... నువ్వొక్కదానివే వెళ్లాలి సునైనా
బిగ్ బాస్ షోలో బావుందా? బయట బావుందా? అంటూ నాని.... దీప్తి సునైనాను ప్రశ్నించగా బిగ్ బాస్ షోలోనే బావుందని సమాధానం ఇచ్చింది. మళ్లీ పంపిస్తే వెళ్లడానికి రెడీ అని సునైనా వ్యాఖ్యానించగా...... అక్కడ తనీష్ ఉండడు, నువ్వొక్కదానివే ఉండాలి అంటూ నాని పంచ్ వేశారు.

కంటతడి పెట్టిన తనీష్ తల్లి
తనీష్ నాన్నగారి సంవత్సరీకం రోజున బిగ్‌బాస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. బిగ్‌బాస్ తెలుగు 2 రియాలిటీ షోలో పాల్గొనాలంటూ ఆఫర్ చేశారు అని తనీష్ చెప్పాడు. అయితే నేను ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నాను. తాను ఆలోచించి బిగ్‌బాస్‌లో పాల్గొంటానని చెబితే సరే అన్నాను. తనీష్ ఫైనల్ చేరుకోవడం హ్యాపీగా ఉంది. అందుకే ఫైనల్ చూడటానికి వచ్చాను అని చెప్పారు. గతంలో తాను ఫైనల్‌కు వస్తే అమ్మ బిగ్‌బాస్ రావాలి అని తనీష్ కోరుకొన్న సంగతి తెలిసిందే. తనీష్ కోరిక ప్రకారమే ఆయన తల్లి బిగ్‌బాస్ ఫైనల్ విజేతను నిర్ణయించే వేడుకు హాజరయ్యారు. తనీష్ తల్లితో నాని మాట్లాడుతుండగా ఆమె ఎమోషనల్‌గా మారారు. ఆమె నోటి నుంచి మాటలు పెగల్లేదు. ఉద్వేగానికి గురయ్యారు.

నాని చెల్లెలుగా అంటూ శ్యామల
బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెళ్లిన తర్వాత పిన్నిగారుగా కంటిన్యూ అవుతున్నారా? పిన్నిగారి కూతురుగా కంటిన్యూ అవుతున్నారా? అని నాని అడగ్గా.... నానిగారి చెల్లెలుగా అని సమాధానం ఇచ్చి శ్యామల అదరగొట్టారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఇపుడు 16 ఫ్యామిలీలు మాకు కనెక్ట్ అయ్యాయి అన్నారు.

నందినీ రాయ్, పూజా
బిగ్ బాస్ షోకు వచ్చిన తర్వాత నాలో పూర్తిగా మార్పు వచ్చింది. తెలుగు బాగా నేర్చుకున్నాను. ఎన్నో విషయాలు ఈ షో ద్వారా నేర్చుకున్నాను అని నందినీ రాయ్ తెలిపారు. పూజా రామచంద్రన్ మాట్లాడుతూ... తాను కూడా బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన తర్వాత తెలుగు ఎక్కువ నేర్చుకున్నాను అని తెలిపారు.

మరోసారి బిగ్ బాస్ ఆడాలని ఉందన్న గీతా మాధురి
బిగ్ బాస్ ఇంట్లో స్క్రీన్ ద్వారా తమ తన భర్త నందు, తల్లిదండ్రులను చూసిన గీతా మాధురి ఎమోషనల్ అయ్యారు. అదే సమయంలో ఇంట్లో నుండి బయటకు రావాలని లేదన్నారు. మరో ఆరు నెలలు ఆగి మళ్లీ ఈ గేమ్ షో ఆడాలని ఉందన్నారు. ఇదీ నీకు సమ్మతమేనా? అంటూ నాని... వెంటనే గీత భర్త నందును అడగ్గా.... నన్ను కూడా బిగ్ బాస్ ఇంట్లోకి పంపిస్తే ఓకే అంటూ సమాధానం ఇచ్చారు.

మళ్లీ ఇంట్లోకి వెళ్తా.. సునైన.. తనీష్ ఉండడుగా.. నాని!
బిగ్‌బాస్ తెలుగు 2 గ్రాండ్ ఫినాలే జోరుగా మొదలైంది. నాని హోస్ట్‌గా డిఫరెంట్ మార్కులో స్టేజి పైకి వచ్చారు. వేదికపై పాటలకు డ్యాన్సులు చేస్తూ నాని ఆకట్టుకొన్నాడు. ఆ తర్వాత ఫైనల్‌కు చేరిన ఐదుగురు హౌస్‌మేట్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ఎలిమినేట్ అయిన హౌస్‌మేట్స్‌తో నాని మాట్లాడారు. దీప్తి సునైనాతో మాట్లాడుతూ నాని చురకలు అంటించారు. బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత లైఫ్ ఎలా ఉంది అని నాని అడుగగా.. దీప్తి సునైనా జవాబిస్తూ.. చాలా బావుంది. మళ్లీ ఇంట్లోకి వెళ్లాలని ఉంది అని దీప్తి అన్నారు. అయితే నిన్ను లోనికి పంపిస్తాను. కానీ తనీష్ ఉండడు. ఎలా ఇంట్లో ఉంటావు అని దీప్తి సునైనాకు నాని షాక్ ఇచ్చారు.

నేను విలన్‌ను కాదు.. అమిత్ భయ్యాను
బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఒక విషయంపై నాకు నేను నిర్ణయం తీసుకొన్నాను. బయటకు వెళ్లిన తర్వాత ఫోన్‌కు దూరంగా ఉండాలని అనుకొన్నాను. అలా అనుకొన్నట్టే ఫోన్‌ను పక్కన పెట్టి ఫ్యామిలీతోనే గడిపాను. చాలా హ్యాపీగా లైఫ్ ఉంది అని అమిత్ అన్నాడు. బిగ్‌బాస్ తర్వాత నా ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. బిగ్‌బాస్‌కు ముందు నాతో మాట్లాడటానికి మహిళలు, చిన్నపిల్లలు భయపడ్డేవారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మహిళలు, పిల్లలందరూ నాతో బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేనంటే వారి దృష్టిలో విలన్ కాదు. అమిత్ భయ్యగా మారిపోయాను అని అమిత్ తెలిపారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత నాతో వేల మంది సెల్పీలు తీసుకొంటున్నాను. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. దాంతో నేను బిగ్‌బాస్‌కు వచ్చిన పర్పస్ వర్కవుట్ అయిపొయిందని అనిపిస్తుంది అని అమిత్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











