twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ 2: నూతన్ ఎలిమినేషన్ మీద భగ్గుమన్న కౌశల్ ఆర్మీ!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu : Kaushal Army Tweets To Bigg Boss

    బిగ్‌బాస్ తెలుగు 2లో గతవారం గణేష్‌తో పాటు నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే నూతన్ నాయుడు ఎలిమినేట్ కావడంపై కౌశల్ ఆర్మీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు వారు 'బిగ్ బాస్ షో' హోస్ట్ నాని, స్టార్ మా యాజమాన్యం, బిగ్ బాస్ ప్రొడక్షన్ కంపెనీ ఎండమోల్ షైన్ ఇండియాపై విమర్శలు చేస్తూ ట్వీట్స్ చేశారు. అత్యధిక ఓట్లు నూతన్ సాధించారని, ఆయన్ను ఎలా ఎలిమినేట్ చేస్తారు? అంటూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

    తక్కువ ఓట్లు అంటూ అబద్దం చెప్పారు

    కౌశల్ తర్వాత నూతన్ నాయుడుకే ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఓటింగ్ పరంగా ఆయన రెండో స్థానంలో ఉన్నారు.... అలాంటి వ్యక్తిని కావాలని బయటకు పంపారని, తక్కువ ఓట్లు అంటూ తప్పుడు లెక్కలు చెప్పి అన్యాయంగా బయటకు పంపారని కౌశల్ ఆర్మీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

    అమిత్ కంటే నూతన్‌కు ఎక్కువ ఓట్లు

    పబ్లిక్ పోలింగులో అమిత్ కంటే నూతన్ నాయుడుకి పది రెట్లు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఎలా ఎలిమినేట్ అయ్యాడో అర్థం కావడం లేదు. బిగ్ బాస్ ఓటింగ్ మీద మాకు అనుమానాలు ఉన్నాయి అని కౌశల్ ఆర్మీ ఆరోపిస్తోంది.

    ప్రజలను ఫూల్స్ చేశారు

    బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి ప్రజలను ఫూల్స్ చేశారు. నూతన్ నాయుడుకి ఎక్కువ ఓట్లు వచ్చినా కావాలని బయటకు పంపారు. కౌశల్ విషయంలో ఏదైనా తేడా జరిగితే సహించబోము అని స్పష్టం చేశారు.

    నూతన్ నాయుడు గ్రేట్ మ్యాన్

    నూతన్ నాయుడు గ్రేట్ మ్యాన్. బిగ్ బాస్ నిర్వాహకులు ఓటింగ్ రిజల్ట్ ప్రజలకు చూపించడం లేదు. అతడి ఎలిమినేషన్ అనేది చెత్త డెసిషన్.

    ఇది రియాల్టీషో కాదు

    ఇది రియాల్టీ షో కాదు. ఇది పూర్తిగా స్క్రిప్టుతో ఒక ప్లాన్ ప్రకారం సాగుతున్న గేమ్ షో. నూతన్ ఎలిమినేషన్ అనేది అన్ ఫెయిర్.... అంటూ కౌశల్ ఆర్మీ విరుచుకుపడ్డారు.

    English summary
    Kaushal Army is very disappointed with the elimination of Nuthan Naidu from Bigg Boss Telugu 2. "This is not Reality Show... Its totally scripted and Planned Game and #Nuthannaidu's elimination is pakka planned and unfair." Koushal Army tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X