బిగ్ బాస్ 2: మానిప్యులేట్ చేశారా? ఎలిమినేషన్ తర్వాత ఏడ్చేసిన కిరీటి.... గీతా మాధురిపై బాంబ్!

By Bojja Kumar

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 22 Highlights

బిగ్ బాస్ తెలుగు 2 సీజన్లో మూడో వారం విజయవంతంగా పూర్తయింది. తొలి రెండు వారాల్లో సంజన అన్నె, నూతన్ నాయుడు ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వగా తాజాగా మూడో వారం కిరిటీ దామరాజును ప్రేక్షకులు ఇంటి నుండి బయటకు పంపారు. గత వారం కిరిటీపై గోడ మీది పిల్లిలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి వేషాలు మానాలని హోస్ట్ నాని సైతం వార్నింగ్ ఇచ్చాడు. ఈ పరిణామాలు కిరిటీ ఎలిమినేషన్ మీద బాగా ప్రభావం చూపినట్లు స్పష్టమవుతోంది. ఇంటి నుండి బయటకు వచ్చిన కిరిటీ బిగ్ బాంబును గీతా మాధురి మీద ప్రయోగించాడు.

ఒక ప్లాన్ ప్రకారం కిరిటీ ఎలిమినేషన్ జరిగిందా?

ఒక ప్లాన్ ప్రకారం కిరిటీ ఎలిమినేషన్ జరిగిందా?

మొత్తం 16 మంది సభ్యులతో బిగ్ బాస్ మొదలైంది. ఈ మొత్తంలో సామాన్యులకు మూడు స్థానాలు మాత్రమే దక్కాయి. అయితే తొలి రెండు వారాలు ఇంటి నుండి సామాన్యులే ఎలిమినేట్ కావడంతో వారిని కావాలనే టార్గెట్ చేసి బయటకు పంపుతున్నారనే ఆరోపణలు వినిపించాయి. ఇక ఇంట్లో మిగిలిన ఒకే ఒక్క సామాన్యుడు మూడో వారం ఎలిమినేట్ అయితే ఈ రియాల్టీ షోపై తీవ్ర దుష్ప్రభావం పడి ఉండేది. ఈ విషయాన్ని ముందే గ్రహించిన నిర్వాహకులు.... ఎవరైనా ఒక సెలబ్రిటీని బయటకు పంపాలనే చేసిన ప్రయత్నంలో కిరిటీ బలైనట్లు పలువురు అనుమానిస్తున్నారు.

నాని వ్యాఖ్యలతో అనుమానాలకు మరింత బలం

నాని వ్యాఖ్యలతో అనుమానాలకు మరింత బలం

ఇంట్లో ఎవరు ఎలా ఆడతారు అనేది వారి వారి ప్రవర్తన బట్టి ఉంటుంది. ఎవరు ఇంట్లో ఉంటే బావుంటుంది, ఎవరు ఉండకూడదు అని డిసైడ్ చేసేది ప్రేక్షకుడు. అయితే గత వారం నాని.... కిరిటీని ఉద్దేశించి చేసిన కామెంట్లతో ప్రేక్షకుల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ప్రేక్షకుల్లో కిరిటీ మీద వ్యతిరేకత పెరిగేలా పరిస్థితులు క్రియేట్ చేశారనే వాదనకు నాని వ్యాఖ్యలు మరింత బలాన్ని ఇచ్చాయి.

ప్రేక్షకులను మానిప్యులేట్ చేశారా?

ప్రేక్షకులను మానిప్యులేట్ చేశారా?


ప్రేక్షకుల్లో కిరిటీ మీద వ్యతిరేకత పెరిగేలా పరిస్థితులు క్రియేట్ చేశారా? అంటే అవుననే అనుమానాలు చాలా మంది నుండి వ్యక్తం అవుతున్నాయి. కిరిటీ గోడ మీద పిల్లి వేషాలు వేస్తున్నాడని షో హోస్ట్ చేస్తున్న నాని గత వారం సంచలన వ్యాఖ్యలు చేశారు. నాని వ్యాఖ్యలే ప్రేక్షకుల్లో కిరిటీ మీద వ్యతిరేకత పెంచేలా చేశాయని కొందరి వాదన.

అలా అనాల్సిన అవసరం ఉందా?

అలా అనాల్సిన అవసరం ఉందా?

చేయకూడని పెద్ద తప్పు చేస్తే తప్ప షో హోస్ట్ కల్పించుకుని కంటెస్టెంటును మందలించడం లాంటివి చేయాలి. కానీ కిరిటీ అంత పెద్ద తప్పు ఏమీ చేయలేదని, అతడు గోపి వేషాలు వేసుండొచ్చు... కానీ అది కూడా అతడు ఆడుతున్న గేమ్ ప్లాన్లో భాగమే అయుండొచ్చుకదా?.... బయటి విషయాలేవీ ఇంటి సభ్యులకు తెలియకూడదు. తమ గురించి ప్రేక్షకులు ఎలా ఫీలవుతున్నాడు అనేది కంటెస్టెంట్లకు అస్సలు తెలియకూడదు. ఈ రూల్‌ను అతిక్రమించిన నిర్వాహకులు నాని చేత....‘కిరిటీ గోడ మీద పిల్లి వేషాలు వేస్తున్నాడని ప్రేక్షకులు భావిస్తున్నారు’ అని చెప్పించారు. దీన్ని బట్టి బిగ్ బాస్ 2 రియాల్టీ షో మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏడ్చేసి కిరిటీ

ఏడ్చేసి కిరిటీ

ఇంటి నుండి బయటకు వచ్చిన కిరిటీ కాస్త ఎమోషనల్ అయి ఏడ్చేశారు. టాస్క్‌లో భాగంగానే తాను ఇంట్లో అలా ప్రవర్తించానని, కానీ ప్రేక్షకులు తనను తపపుగా అర్ధం చేసుకున్నారని తెలిపారు. వ్యక్తిగతంగా తాను అలాంటి వ్యక్తిని కాదన్నారు.

 బిగ్ బాంబ్...

బిగ్ బాంబ్...

కిరిటీ తనకు వచ్చిన బిగ్ బాంబు ఛాన్సును గీతా మాధురి మీద ప్రయోగించాడు. దీని ప్రకారం ఆమె ఈ వారం మొత్తం చేతులకు బాక్సింగ్ గ్లౌజులు వేసుకోవాలని ఉండాలి. ఈ బిగ్ బాంబును గీతా సంతోషంగా స్వకరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X