బిగ్‌బాస్ 2: అప్పుడు కళ్లలో కారం కొట్టారు .... రివేంజ్ తీర్చుకున్న కౌశల్!
బిగ్‌బాస్ తెలుగు 2లో కొత్త టాస్కులు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నెక్ట్స్ వీక్ కెప్టెన్ కోసం తాజాగా బిగ్‌బాస్ ఒక వెరైటీ పరీక్ష పెట్టారు. ఇందులో భాగంగా కెప్టెన్సీ కోసం పోటీపడే సభ్యులు పెయింట్ వేసుకుని విగ్రహంలా నిలబడాలి. ఈ సారి కెప్టెన్సీ కోసం గీతా మాధురి, అమిత్, దీప్తి నల్లమోతు, సామ్రాట్ పోటీ పడ్డారు. ఈ టాస్కులో ఉన్న ట్విస్ట్ ఏమిటంటే.... కేవలం విగ్రహంలా నిలబడటం మాత్రమే కాదు.... ఇంటి సభ్యులు ఎన్ని హింసలు పెట్టినా భరించాలి. అవి భరించలేక దిగిపోతే కెప్టెన్సీ టాస్క్‌లో వారు ఓడిపోయినట్లే. గురువారం ప్రసారం అయ్యే షోలో ఇది ప్రసారం కానుంది.

రివేంజ్ తీర్చుకున్న కౌశల్
తాజాగా విడుదలైన ప్రోమోలో కౌశల్ ప్రవర్తన అందరినీ ఆశ్చర్య పరిచింది. కెప్టెన్నీ కోసం పోటీ పడుతున్న వారిపై అతడు రివేంజ్ తీర్చుకున్నట్లు తెలుస్తోంది. వారి మొహం మీద నీళ్లు కొట్టడం, వారు ఇబ్బందికి గురయ్యేలా ప్రవర్తించడం లాంటివి చేసినట్లు తెలుస్తోంది.

కళ్లలో కారాలు కొట్టినా భరించాను
కొందరు ఇంటి సభ్యులు కౌశల్ అలా చేయడాన్ని తప్పుబట్టగా.... గతంలో ఓ టాస్కులో మొహం మీద, కళ్లలో కారం కొట్టినా భరించాను. నేను చేసేది అంతకంటే పెద్దదేం కాదు అంటూ సమాధానం ఇచ్చాడు.

తర్వాత కెప్టెన్ ఎవరు?
బిగ్‌బాస్ ఇంట్లో తర్వాతి కెప్టెన్ ఎవరు? అనేది ఈ రోజు రాత్రి ప్రసారం అయ్యే షోలో ద్వారా తెలియనుంది.
లేటెస్ట్ ప్రోమో ఇదే...
బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్‌కు సంబంధించి విడుదల చేసేని లేటెస్ట్ ప్రమో ఇదే. ఈ రోజు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











