Don't Miss!
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎంత క్యూట్‌గా ఉన్నారో? బిగ్ బాస్ 2 సెలబ్రిటీస్ చిన్నతనంలో...
Recommended Video
బిగ్ బాస్ తెలుగు 2లో సోమవారం ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యే ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు... ఇంటి సభ్యులు కూడా ఈ ఎపిసోడ్ తెగ ఎంజాయ్ చేసినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. బిగ్ బాస్ 2లో పాల్గొన్న సెలబ్రిటీలు చిన్ననాటి ఫోటోలను డిస్లే చేయడంతో పాటు వారు అచ్చం అప్పుడు ఎలా ఉన్నారో అలాంటి గెటప్స్‌లోనే సిద్ధమై ప్రేక్షకులకు కనువిందు చేశారు.
అమిత్ సెల్యూట్ చేస్తూ
అమిత్ చిన్నతనంలో సెల్యూట్ చేస్తూ దిగిన ఫోటోను బిగ్ బాస్ ప్రదర్శించగా.... అచ్చం అప్పటిలాగే క్యూట్ లుక్‌తో దర్శనమిచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాడు అమిత్ తివారీ.
కృష్ణుడి గెటప్‌లో తనీష్ ముద్దు ముద్దుగా...
తనీష్ చిన్నతనంలో మాదిరిగా మరోసారి కృష్ణుడి గెటప్‌లో ముద్దొచ్చేలా రెడీ ప్రేక్షకులతో సూపర్ అనిపించుకున్నాడు.
తలక్రిందులుగా పూజా రామచంద్రన్
ఇటీవల కొత్తగా బిగ్ బాస్ 2 ఇంట్లోకి ఎంటరైన హీరోయిన్ పూజా రామచంద్రన్ చిన్నతనంలో మాదిరిగా తలక్రిందులుగా యోగాసనాలు వేసింది.
క్యూట్ బాయ్‌లా బాబు గోగినేని
ఇక బాబు గోగినేని తన చైల్డ్‌హుడ్ గుర్తొచ్చేలా క్యూట్ బాయ్‌లా మారిపోయి మెప్పించాడు. అచ్చం చిన్నతనంలో ఎలా ఉన్నాడో అలా ఆయన్ను మేకోవర్ చేశారు.
ప్రత్యేకమైన డ్రెస్సులో దీప్తి
ఇక దీప్తి నల్లమోతు కోసం ఆమె చిన్నతనంలో ధరించిన ప్రత్యేకమైన డ్రెస్సును డిజైన్ చేసి బిగ్ బాస్ పంపించాడు. అది ధరించిన దీప్తి మళ్లీ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది ఈ టీవీ9 యాంకర్.
జానపద కళాకారుడిగా
గణేష్ చిన్నతనంలో స్కూల్ కల్చరల్ ఈవెంటులో మాదిరిగా జాపద కళాకారుడి వేషంలో మరోసారి బిగ్ బాస్ అభిమానులను మెప్పించాడు.
కౌశల్ మోడలింగ్
కౌశల్‌కు చిన్నతనం నుండి మోడలింగ్ అంటే ఆసక్తి ఉన్నట్లుంది. అదే తరహాలో మరోసారి అలాంటి గెటప్‌లో ప్రేక్షకులకు మెప్పించాడు.
మిగతా ఇంటి సభ్యులు ఇలా...
మొత్తానికి సోమవారం విడుదలైన ప్రోమో ఈ రోజు ప్రసారం అయ్యే ఎపిసోడ్ మీద మరింత ఆసక్తిని రేకెత్తించింది. దీంతో పాటు ఇంట్లోకి బిగ్ బాస్ ఇంట్లోకి శ్యామల, నూతన్ నాయుడు రీ ఎంట్రీ ఇచ్చే సన్నివేశాలు సైతం చూపించనున్నారు.