బిగ్‌బాస్ లీక్.. ఇంటి నుంచి రోల్ రైడా అవుట్!.. తాను తవ్వుకొన్న గోతిలో తానే..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 చివరి అంకానికి చేరుకొన్నది. ఇప్పటి వరకు ప్రతీవారం ప్రొటెక్టెడ్ జోన్‌లోకి వెళ్ల సెలబ్రిటీలు ఈసారి విభిన్నంగా ఫైనల్‌కు చేరుకోబోతున్నారు. ఫైనల్‌ రౌండ్‌కు ముందు జరిగే ఎలిమినేషన్‌లో సామ్రాట్ మినహా అందరూ నామినేట్ అయి ఉన్నారు. దాంతో ఈ వారం ఆదివారం మరింత ఆసక్తిగా మారబోతున్నది. ఎందుకంటే వచ్చే వారం బిగ్‌బాస్ టైటిల్ విజేతను తేల్చే వారం కావడం ఇది అత్యంత కీలకంగా మారింది. ఈ వారం ఎవరు అవుటయ్యారనే విషయం మీకోసం..

సామ్రాట్ ఫైనల్‌కు

సామ్రాట్ ఫైనల్‌కు

గత రెండు రోజుల క్రితం రోల్ రైడా, సామ్రాట్ మీ గుడ్డు జాగ్రత్త టాస్క్‌ ఆడారు. ఇంటి సభ్యులందరూ సామ్రాట్‌కు మద్దతు తెలుపగా, రోల్ రైడాకు కౌశల్ సపోర్ట్‌గా నిలిచారు. అయితే కౌశల్ ఇచ్చిన సపోర్ట్‌ను రోల్ రైడా వినియోగించుకోలేక చతికిలపడటంతో సామ్రాట్ ఫైనల్‌కు వెళ్లాడు. దాంతో ఆయన టైటిల్ రేసులో నిలిచిన మొదటి అభ్యర్థిగా ప్రత్యేకతను సాధించాడు.

 కౌశల్‌కు భారీగా ఓట్లు

కౌశల్‌కు భారీగా ఓట్లు

కుక్కల్లా మీద పడుతున్నారు.. అలాగే కూతురు బర్త్ డే విషయంపై గీతా గొడవ పడిన తర్వాత కౌశల్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. దాంతో ఈ వారం ఓటింగ్‌లో కౌశల్ టాప్ స్థానంలో నిలిచాడు. గతవారం కంటే ఈ వారం కౌశల్‌కు ఎక్కువ ఓట్లు వచ్చినట్టు డేటా వెల్లడించింది.

రెండో స్థానంలో గీతా మాధురి

రెండో స్థానంలో గీతా మాధురి

ఇక ఇంటిలో బలమైన సెలబ్రిటీల్లో గీతా ఒకరు. ఫిజికల్ టాస్కుల్లో ఫెయిల్ అయినా సీక్రెట్ టాస్కులతో ఆమె తన ప్రతిభను నిరూపించుకొన్నారు. దాంతో ఆమె రెండో స్థానంలో నిలుస్తున్నారు. ఈ సారి ఓటింగ్‌లో రెండో స్థానంలో నిలిచినట్టు తెలిసింది.

ర్యాంకును మెరుగుపరుచుకొన్న దీప్తి

ర్యాంకును మెరుగుపరుచుకొన్న దీప్తి

ఇక గేమ్ మొదలైనప్పటి నుంచి ప్రతీ వారం తన టాలెంట్‌కు మెరుగులు పెట్టుకొంటూ గణనీయంగా దూసుకొచ్చింది దీప్తి నల్లమోతు. ఫిజికల్ టాస్కుల్లో ఇతర సెలబ్రిటీలకు ధీటుగా ఆడింది. అంతేకాకుండా గొడవల్లో తల దూర్చకుండా సేఫ్ గేమ్ కూడా ప్లే చేసింది. దాంతో ఇంటి నుంచి ఫైనల్‌కు వెళ్లే మూడో అభ్యర్థిగా నిలిచారు.

ముగ్గురికి అతి తక్కువ ఓట్లు

ముగ్గురికి అతి తక్కువ ఓట్లు

గతవారం అతి తక్కువ ఓట్లు పోలైన వారిలో సామ్రాట్, తనీష్, రోల్ రైడా ఉన్నారు. ఇంట్లో బలహీనమైన సెలబ్రిటీ సామ్రాట్ ఇప్పటికే ఫైనల్‌కు వెళ్లడంతో చివరి రెండుస్థానాల్లో తనీష్, రోల్ రైడా నిలిచారు. తనీష్, రోల్ రైడాకు మధ్య ఓట్ల శాతం పెద్దగా లేదనేది తాజా సమాచారం.

తనీష్‌పై కౌశల్ ప్లాన్

తనీష్‌పై కౌశల్ ప్లాన్

ఇంట్లో ఇసుక కాపాడుకో, గుడ్లు జాగ్రత్త టాస్క్‌లో తనీష్‌ను టార్గెట్‌గా చేసుకొని కౌశల్ గేమ్ ఆడారు. ఎలాగైనా తనీష్‌ను ఫైనల్‌కు పంపకూడదు అని నిశ్చయించుకొన్నట్టు కౌశల్ గేమ్ ప్లాన్ స్పష్టమైంది. కుక్కల కామెంట్ తర్వాత తనీష్, రోల్ రైడా చేసిన ఓవర్‌యాక్షన్‌ వారి పీకలమీదకు తెచ్చింది. దాంతో ఎలిమినేషన్ కత్తి వీరిద్దరిపై పడింది.

 కౌశల్ ఆర్తీ ప్లాన్ సక్సెస్..

కౌశల్ ఆర్తీ ప్లాన్ సక్సెస్..

కౌశల్‌ను టార్గెట్ చేసిన తనీష్‌, రోల్ రైడాకు కౌశల్ ఆర్మీ ప్లాన్ ప్రకారం ఓట్లు వేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. దాంతో ఇంట్లో ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయిన రోల్ రైడా ఎలిమినేషన్ అయినట్టు వార్తలు బయటకు వచ్చాయి. తనీష్ తక్కువ ఓట్ల తేడాతో ఎలిమినేషన్ వేటు తప్పించుకొన్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X