లీక్: ఈ వారం బిగ్‌బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...

By Bojja Kumar

బిగ్‌బాస్ షోలో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే అంశంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతవారం ఎవరూ ఎలిమినేట్ కాకపోవడం, శ్యామల, నూతన్ నాయుడు ఇంట్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆదివారం రాత్రి ప్రసారం అయ్యే షోలో డబల్ ఎలిమినేషన్ ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో ఈ వారం ఒకరు మాత్రమే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.

 ఎలిమినేషన్ లిస్టులో ఎవరు?

ఎలిమినేషన్ లిస్టులో ఎవరు?

ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో కౌశల్, దీప్తి నల్లమోతు, బాబు గోగినేని, గణేశ్, నందిని ఉండగా....కౌశల్, బాబు సేఫ్ అయినట్లు నాని శనివారం ప్రకటించారు. మిగిలినవారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆదివారం రాత్రి ప్రసారం అయ్యే షోలో తేలనుంది.

 ఈసారి కూడా లీకులు నిజమవుతాయా?

ఈసారి కూడా లీకులు నిజమవుతాయా?

గత రెండు వారాలుగా బిగ్‌బాస్ షోను లీక్స్ వెంటాడుతున్నాయి. గతంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఇష్యూలో శ్యామల, తేజస్వి విషయంలో లీక్స్ నిజం అయ్యాయి. ఈ సారి నందినీ రాయ్ పేరు బయటకు లీక్ అయింది.

ఓట్లు ఎవరి ఎక్కువ పడ్డాయి?

ఓట్లు ఎవరి ఎక్కువ పడ్డాయి?

ఈ సారి దాదాపు 12 కోట్ల వరకు ఓట్లు వచ్చాయని, అందులో అత్యధికంగా కౌశల్‌కు పడ్డాయని తెలుస్తోంది. అతి తక్కువ ఓట్లు నందినీ రాయ్‌కు పడ్డాయని విషయం లీక్ అయ్యాయి.

ఇద్దరి ఎలిమినేషన్ ఉంటే... గణేష్ ఔట్?

ఇద్దరి ఎలిమినేషన్ ఉంటే... గణేష్ ఔట్?

ఈ సారి ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి వస్తే.... నందిని తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి గణేష్ అనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే గణేష్ ఔట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X