రెచ్చిపోతున్న బిగ్‌బాస్ సెలబ్రిటీలు! కుటుంబానికి, ప్రేక్షకులకు నరకం.. నాని కామెంట్‌కు బలం!

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో గొడవలు శృతిమించి పోతున్నాయి. టాస్క్ ఆడుతున్నామనే విషయం మరిచి ఇంటి సభ్యులు శారీరకంగా, మాటల దాడులకు దిగడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఫిజికల్ టాస్క్ కారణంగా సెలబ్రిటీల మధ్య ఘర్షణలు చోటుచేసుకొంటున్నాయి. బిగ్‌బాస్ షో ముగింపుకు వచ్చే సరికి ఇది చాలా విచ్చలవిడిగా మారింది. వివరాల్లోకి వెళితే..

చేజారుతున్న పరిస్థితులు

చేజారుతున్న పరిస్థితులు

ఇంట్లో సెలబ్రిటీల మధ్య గ్రూప్ రాజకీయాలు మొదటి నుంచే ఉంటున్నాయి. వారి ప్రవర్తన వల్ల ఇంట్లో పరిస్థితులు చేజారుతున్నాయి. ఆ కారణంగానే గేమ్‌ను గేమ్‌గా ఆడకుండా గ్రూప్ పాలిటిక్స్‌గా ప్లే చేస్తున్నారు అనే విమర్శలు ఈ మధ్యకాలంలో జోరందుకొన్నాయి.

బిగ్‌బాస్ ఆటతీరుపై విమర్శలు

బిగ్‌బాస్ ఆటతీరుపై విమర్శలు

బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన బాబు గోగినేని, సంజన లాంటి ఆటగాళ్లు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. హౌస్‌లో జరిగిది ఒకటి.. బయటకు చూపించేది మరొకటి. గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయంపై బయటి వారికి క్లారిటీ లేదు అని అన్నారు.

Recommended Video

Bigg Boss Season 2 Telugu: 101 Day Highlights
మీ ఫ్యామిలీ సభ్యులు

మీ ఫ్యామిలీ సభ్యులు

ఇంటి సభ్యులతో తాజాగా నాని మాట్లాడుతూ.. హౌస్‌లో మీరు బాగానే ఉంటున్నారు. మీరు ఆడే తీరు వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ బయట బిగ్‌బాస్ కంటే పెద్ద గేమ్ ఆడుతున్నారు. మీ కోసం బయట వాళ్లు ఎంత నరకం అనుభవిస్తున్నారో తెలుసా అని నాని పేర్కొనడం గమనార్హం.

ఇంటి సభ్యుల తీరు

ఇంటి సభ్యుల తీరు

ఇక ఇంట్లో ఇటీవల జరిగిన పరిణామాలు పరాకాష్టకు చేరుకొన్నాయి. ఇంట్లో ఆరుగురు సభ్యులు ఉండగా.. ఐదుగురు ఓ జట్టుగా.. కౌశల్ ఒక్కడిగా మిగిలాడు. దాంతో ఐదుగురు ఏక కాలంలో దాడులకు దిగడం చర్చనీయాంశమైంది. గేమ్‌లో భాగంగా అనుకొనే పరిస్థితి కనిపించడం లేదు.

బిగ్‌బాస్ శారీరక దాడులు

బిగ్‌బాస్ శారీరక దాడులు

మంగళవారం ప్రసారమైన షోలో ఇంటి సభ్యులు శారీరకపరమైన దాడులు చేసుకోవడంతో టాస్క్‌ను బిగ్‌బాస్ అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. సినిమాను మించిన ఫైట్స్‌ బుల్లితెర మీద కనిపించాయి. ఇవి ఇక్కడితో ఆడితే బాగుంటుందనే మాట వినిపిస్తున్నది.

టెలివిజన్ రేటింగ్స్ కోసమేనా?

టెలివిజన్ రేటింగ్స్ కోసమేనా?

టెలివిజన్ రేటింగ్స్ కోసమే షో నిర్వాహకులు ఇలాంటి గేమ్స్ ప్లాన్ చేస్తున్నారనే విమర్శ కూడా వినిపిస్తున్నది. శారీరకంగా ఆడే టాస్క్‌ల విషయంలో సరైన రూల్స్ లేకపోవడం వల్ల ఇంటి సభ్యులే నిబంధనల్ని రూపొందించుకొంటున్నారు. అందుకే ఇంటిలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X