twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ 2: శ్యామల రీఎంట్రీతో అంతా ఎలా ప్రవర్తించారో చూశారా... (వీడియో)

    By Bojja Kumar
    |

    Recommended Video

    బిగ్ బాస్ 2: శ్యామల రీఎంట్రీతో అంతా ఎలా ప్రవర్తించారో చూశారా..!

    బిగ్ బాస్ తెలుగు 2లోకి నూతన్ నాయుడు, శ్యామల రీ ఎంట్రీ ఇస్తున్నట్లు గతవారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. నాని ఈ విషయం ప్రకటించి మూడు రోజులైనా ఈ ఇద్దరూ ఇంట్లోకి ప్రవేశించక పోవడంపై ప్రేక్షకుల్లో అయోమయం నెలకొంది. గతవారం వీరు బిగ్‌బాస్ సెటప్‌లోకి వెళ్లిన తర్వాత మళ్లీ వెనక్కి రాలేదు. అటు ఇంట్లోకి వెళ్ల, ఇటు వెనక్కిరాక వీరు ఏమైపోయినట్లు? ఎక్కడ ఉన్నట్లు? అనే సందేహాలు చాలా మందిలో నెలకొన్నాయి. అయితే ప్రేక్షకుల్లో ఈ రకమైన క్యూరియాసిటీ పెంచడానికే వారి రీ ఎంట్రీని కాస్త ఆలస్యం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఇద్దరూ ఇంట్లోకి ఎంటరయ్యారు.

    ఈ రోజు ప్రసారం అయ్యే ఎపిసోడ్లో ఇద్దరూ...

    ఈ రోజు ప్రసారం అయ్యే ఎపిసోడ్లో ఇద్దరూ...

    గురువారం రాత్రి ప్రసారమయ్యే బిగ్ బాస్ షోలో నూతన్ నాయుడు, శ్యామల రీ ఎంట్రీ చూపించబోతున్నారు. ఇద్దరినీ వేర్వేరుగా, వెరైటీ పద్దతిలో ఇంట్లోకి పంపించారు. ఇందుకు సంబంధించిన ప్రమోలోలు విడుదల చేశారు.

    శ్యామల ఇంట్లోకి రాగానే అంతా...

    శ్యామల ఇంట్లోకి రాగానే కొందరు ఇంటి సభ్యులు ఆనందంతో గంతులేశారు. ముఖ్యంగా గణేష్, దీప్తి నల్లమోతు, గీతా మాధురి, నందిని ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టమే. శ్యామల రాగానే వీరంతా ఎలా ప్రవర్తించారో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.

    గిఫ్ట్ ప్యాక్‌లో నూతన్ నాయుడు

    బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కొన్ని గిఫ్టులు పంపారు. నూతన్ నాయుడిని కూడా ఆ గిప్టులతో కలిపి ఒక పెద్ద పెట్టెలో ప్యాక్ చేసి పంపడం విశేషం. ఇలా నూతన్ ఎంట్రీ ఆసక్తికరంగా సాగింది.

    ఇక మరింత రసవత్తరంగా

    ఇక మరింత రసవత్తరంగా

    ఎలిమినేట్ అయిన ఇద్దరు కంటెస్టెంట్స్ నూతన్ నాయుడు, శ్యామల రాకతో బిగ్ బాస్ షో మరింత ఆసక్తికరంగా సాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

    English summary
    Syamala re-entry to house Bigg Boss Telugu 2. The new promos of Bigg Boss Telugu 2 show that ex-contestants Nuthan Naidu and Shyamala, who recently made wildcard entry, has been sent into the house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X