బిగ్ బాస్ తెలుగు 2 మూడో వారం ఎలిమినేషన్: ఈ ఐదుగురిలో మీ ఓటు ఎవరికి?

By Bojja Kumar

బిగ్ బాస్ తెలుగు 2 విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి ప్రవేశించింది. తొలివారం సంజన అన్నె, రెండో వారం నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసింతే. తాజాగా మూడోవారం ఎలిమినేషన్‌కు నామినేషన్లు పూర్తయ్యాయి. ఈ వారం గీతా మాధురి, గణేష్, తేజస్వి మదివాడ, భానుశ్రీ , కిరిటీ నామినేట్ అయ్యారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఈ ఐదుగురిలో ఎవరో ఒకరు వచ్చే ఆదివారం ఇంటి నుండి బయటకు వెళ్లనున్నారు.

ఓపెన్‌గా నామినేషన్స్ నిర్వహించిన బిగ్ బాస్

ఓపెన్‌గా నామినేషన్స్ నిర్వహించిన బిగ్ బాస్

వాస్తవంగా నామినేషన్లు అనేవి సీక్రెట్‌గా జరగాలి. అయితే అవి పూర్తయిన తర్వాత ఇంటి సభ్యులు అందుకు సంబంధించిన వివరాలు ఒకరితో ఒకరు చెప్పుకుంటుండటంతో బిగ్ బాస్ రూటు మార్చాడు. ఈ వారం అందరినీ లివింగ్ రూమ్‌లోనే కూర్చోబెట్టి ఓపెన్‌గా నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు.

ఆ ఇద్దరికీ మినహాయింపు

ఆ ఇద్దరికీ మినహాయింపు

ముందుగా ఇంటి కెప్టెన్ అమిత్‌ను స్టోర్ రూమ్‌కు పంపి అక్కడ ఉన్న ట్యాగ్స్ తెప్పించారు. ప్రతి ఒక్కరికి రెండు ట్యాగ్స్ చొప్పున ఇచ్చారు. ఎవరినైతే ఇంటి నుండి బయటకు పంపాలనుకుంటారో వారి మెడలో ఆ ట్యాగ్ వేయాలని కోరారు. అమిత్ కెప్టెన్ అయినందున నామినేషన్ ప్రక్రియ నుండి అతడికి మినహాయింపు ఇచ్చారు. అదే విధంగా నందిని వచ్చి కేవలం వారం రోజులు మాత్రమే అయినందున ఆమెకు కూడా ఈవారం నామినేషన్ల నుండి తప్పించారు.

గణేష్, కిరిటీకి అత్యధిక ట్యాగ్స్

గణేష్, కిరిటీకి అత్యధిక ట్యాగ్స్

గణేష్, కిరిటీ మెడలో అత్యధికంగా 7 ట్యాగ్స్ పడగా, గీతా మాధురి, భానుశ్రీ మెడలో మూడు ట్యాగ్స్ చొప్పున పడ్డాయి. ఇక తేజస్వి మదివాడకు రెండు ట్యాగ్స్ వచ్చాయి. దీంతో ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయినట్లు ప్రకటించారు. టీవీ 9 యాంకర్ దీప్తి, తనీష్‌కు కేవలం ఒక్కో ట్యాగ్ మాత్రమే పడటంతో వారు ఈ సారి ఎలిమినేషన్ నుండి రక్షింపబడ్డారు.

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Nutan Naidu Talks About Bigg Boss 2
ఈ సారి బలయ్యేది కూడా సామాన్యుడేనా?

ఈ సారి బలయ్యేది కూడా సామాన్యుడేనా?

మొదటి రెండు వారాలు సామాన్యులుగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఇద్దరూ ఎలిమినేట్ కావడంతో.... ఈ సారి ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. మరి ప్రేక్షకులు ఈవారం కూడా సామాన్యుడినే ఇంటి నుండి బయటకు పంపుతారా? లేక సెలబ్రిటీలను పంపుతారా? అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X