రోల్‌ను ఆడపిల్లగా మార్చిన కౌశల్, దీప్తి జోకర్ వేషాలు, గీతా మాధురి తీరుతో నాని షాక్!
Recommended Video

వారమంతా ఎలాగూ కొట్టుకుచస్తున్నారు... కనీసం ఆదివారం అయినా మిమ్మల్ని నవ్వించకపోతే, మీతో ఏదో ఒక ఆటలాడించకపోతే ఏం బావుంటుంది? అంటూ ఆదివారం బిగ్ బాస్ షో నాని మరింత రసవత్తరంగా మార్చినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే ఈ రోజు రాత్రి ప్రసారం అయ్యే షో ప్రేక్షకులకు మంచి వినోదం పంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంటి సభ్యుల కళ్లకు గంతలు కట్టి వారితో ఫన్నీ థింగ్స్ చేయించాడు నాని.

రోల్ రైడాను ఆడపిల్లలా తయారు చేసిన కౌశల్
కౌశల్ వద్దకు ఓ బాక్సు పంపిన నాని.... అందులో ఉన్న వస్తువులతో రోల్ రైడాను రెడీ చేయాలని సూచించాడు. అందులో ఆడ పిల్లలకు సంబంధించి విగ్గు, లిప్‌స్టిక్, మేకప్ సామాగ్రి ఉన్నాయి. కౌశల్ కళ్లకు గంతలు కట్టి ఈ పని చేయమనడంతో రోల్ అవతారం ఫన్నీగా తయారైంది.

శ్యామల, అమిత్
శ్యామల, అమిత్ ఇద్దరి కళ్లకు గంతలు కట్టించి.... ఒకరికొకరు స్వీట్, ఐస్ క్రీమ్ తినిపించుకోవాలని సూచించాడు. అయితే కళ్లకు గంతలు కట్టి ఉండటంతో నోట్లో కాకుండా ఇంకెక్కడెక్కడో పెట్టేసుకోవడంతో ఫుల్ కామెడీ పండినట్లు తెలుస్తోంది.

దీప్తి జోకర్ వేషాలు
దీప్తి నల్లమోతుతో జోకర్ వేషాలు వేయించాడు నాని. ఆమెను ఫన్నీగా తయారు చేయించి సర్కర్ జోకర్ మాదిరిగా చేయమనడంతో ఆమె మరింత ఉత్సాహంగా తన టాస్క్ ఫినిష్ చేసి అందరినీ నవ్వించింది.
నువ్వేమైనా రేసుగుర్రంలో శృతిహాసనా?
ఇక సామ్రాట్... గీతా మాధురిలకు వింత పదార్థాలు తిపించారు. సామ్రాట్ అవి తింటుంటే ఆ రుచి భరించలేక అల్లాడిపోయాడు. అయితే గీతా మాధురి మాత్రం తన ఫేస్‌లో ఎలాంటి ఫీలింగ్ చూపించలేదు. దీంతో నువ్వు రేసు గుర్రంలో శృతి హాసనా? అంటూ షాకైన నాని తనదైన శైలిలో పంచ్ వేశారు. దీనికి గీత రియాక్ట్ అవుతూ.. ఆ పదార్థాలన్నీ తనకు ఎంతో నచ్చాయని చెప్పింది.


Click it and Unblock the Notifications











