గీతా మాధురి ప్లాన్ బెడిసికొట్టిందా? కౌశల్‌ను వివాదంలోకి లాగి.. తాను తవ్వకొన్న గోతిలోనే!
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో చివరి అంకానికి చేరుకొన్నది. 16 మంది సభ్యులతో ప్రారంభమైన బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఇంట్లో గీతా మాధురి, తనీష్, సామ్రాట్, దీప్తి నల్లమోతు, రోల్ రైడా ఓ జట్టుగా, కౌశల్ ఒక్కడు ఓ జట్టుగా గేమ్ నడుస్తున్నది. బిగ్‌బాస్ అంటే కౌశల్ వర్సెస్ ఐదుగురు సభ్యులుగా మారింది. అంత కలిసికట్టుగా కలిసి కౌశల్‌పై దాడికి ప్రయత్నిస్తుండగా.. కౌశల్ అదే స్థాయిలో ధ్వజమెత్తుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గీతా లేవనెత్తిన ఓ అంశం బిగ్‌బాస్ హౌస్‌ను కుదిపేసింది. అదేమిటంటే..

నానికి కౌశల్ రిక్వెస్ట్
ఆదివారం నాని బిగ్‌బాస్ సభ్యులను కలిసినప్పుడు కౌశల్ ఓ కోరిక కోరాడు. తన కూతురు పుట్టిన రోజు సెప్టెంబర్ 20. వీలైతే రెండు నిమిషాలు ఇంట్లోకి పంపిస్తే.. కేక్ కట్ చేసి తిరిగి పంపిస్తాను అని కోరాడు. అందుకు నాని సానుకూలంగా స్పందించి.. నాకు చేతనైనంత సహాయం నేను చేస్తాను అని చెప్పాడు.
Recommended Video


కౌశల్ కూతురు విషయంపై
కౌశల్ కూతురు ఇంట్లోకి రావడమనే విషయాన్ని గీతా మాధురి లేవనెత్తారు. ఇంట్లోకి కౌశల్ కూతురు వస్తే ఆయనకు పాజిటివ్‌గా మారుతుంది అని కామెంట్ చేశారు. దాంతో ఆ విషయంపై తన గ్రూప్ మధ్య చర్చ జరిగింది. ఆ సమయంలో వారి వద్దకు కౌశల్ వచ్చి ఆ విషయాన్ని గుర్తించారు.

గీతా మాధురిపై కౌశల్ ఫైర్
నేను లేనప్పుడు నా ఫ్యామిలీ గురించి, నా కూతురు గురించి మాట్లాడుకోవద్దు. మీరు ఎలా నాకు ప్లస్ అవుతుంది అని భావిస్తారు. ఎలా మీరు బూస్ట్ అని అంటారు. మీ అందరికీ అలాంటి అవకాశం రాలేదా? అని ప్రశ్నించారు.

మాట మార్చిన గీతా
అయితే నేను బూస్ట్ (సానుకూలం) అనే పదాన్ని ఉపయోగించలేదు అని గీతా మాధురి అన్నారు. మీరు అన్నారని కౌశల్ గట్టిగా వాదించగా.. అయితే నేను అని ఉండోచ్చు అని మాట మార్చింది. కేవలం గీతా కారణంగానే ఇంట్లో భారీగా వాగ్వాదం జరిగిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. బిగ్‌బాస్‌లో ద్వంద ప్రమాణాలకు గీత నిదర్శనం అనే మాట వినిపిస్తున్నది.

కూతురును అడ్డం పెట్టుకొని
కూతురును అడ్డం పెట్టుకొని ప్రచారం చేసుకోవద్దు అని గీతా అనడంపై కౌశల్ మండిపడ్డారు. ఇప్పటి వరకు మీరు రిలేషన్స్‌ను అడ్డం పెట్టుకొని గేమ్ ఆడారు. మీలాగా చేసే అవసరం నాకు లేదు అని కౌశల్ పేర్కొన్నారు. ఇలా ఇంటి సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం రేగుతున్నది.


Click it and Unblock the Notifications











