బిగ్‌బాస్ తెలుగు 2: ఈ వీడియో చూస్తే షాకవ్వడం ఖాయం!
Recommended Video

బిగ్‌బాస్ తెలుగు 2 రోజులు గడుస్తున్న కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటి వరకు ఈ రియల్టీ షో 75 రోజులు పూర్తింది. మరో 30 రోజుల పాటు ఎవరు ఇంట్లో ఉంటారో వారు ఫైనల్ పోరుకు చేరుకుంటారు. వీరిలో విజేత ఎవరు అనేది ప్రేక్షకుల ఓట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో చివరి వరకు ఇంట్లో ఉండటానికి పోటీ దారులు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. హౌస్ కెప్టెన్ అయితే ఒక వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకోవచ్చు కాబట్టి.... ఇలాంటి టాస్కుల్లో గెలవడానికి తమ శక్తిమేర ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు బిగ్ బాస్ సరికొత్త టాస్క్ నిర్వహించాడు.

ఇద్దరికి పోటీ పడే అవకాశం
కన్‌ఫెషన్ రూముకు వెళ్లి సోఫాలో కూర్చునే మొదటి ఇద్దరు సభ్యులు కెప్టెన్ పోటీ దారులుగా ఎంపికవుతారు అని బిగ్ బాస్ సూచించడంతో ఆ అవకాశాన్ని దక్కించుకునేందుకు ఇంటి సభ్యులు ప్రయత్నించారు.
షాకింగ్ వీడియో
ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలైంది. కెప్టెన్ పోటీ దారులుగా అవకాశం దక్కించుకునేందుకు సభ్యులు పోటీ పడ్డ తీరు అందరూ షాకయ్యేలా చేసింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

కౌశల్, దీప్తి మధ్య వాగ్వివాదం
సోఫాలో నేను ఫస్ట్ కూర్చున్నానంటే... నేను ఫస్ట్ కూర్చున్నాను అంటూ దీప్తి నల్లమోతు, కౌశల్ వాదనకు దిగినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. మరి కెప్టెన్ టాస్కులో పోటీ పడే అవకాశం ఎవరికి దక్కిందో తెలియాలంటే శుక్రవారం రోజు రాత్రి ప్రసారం అయ్యే షో చూడాల్సిందే.

గాయాలయ్యే స్థాయిలో...
బిగ్‌బాస్ టాస్కులు కొన్ని దారుణంగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇలానే పలు టాస్క్‌లు నిర్వహించగా తొక్కిసలాట జరిగి పలువురు సభ్యులు గాయపడ్డారు. ఇపుడు కెప్టెన్ టాస్క్ కూడా అదే స్థాయిలో ఉండటం వీక్షకులు షాకయ్యేలా చేసింది.


Click it and Unblock the Notifications











