బిగ్‌బాస్ తెలుగు 2 విజేత కౌశల్.. ఫైనల్‌‌లో ఉత్కంఠ.. రన్నరప్‌గా గీతా మాధురి

Recommended Video

Bigg Boss Season 2 Telugu : 113 Day Telugu Highlights : Kaushal | Geetha Madhuri | Nani

బిగ్‌బాస్ తెలుగు 2 రియాలిటీ షో ఘనంగా ముగిసింది. ఎన్నో ఆహ్లాదకరమైన సంఘటనలు, ఇంటి సభ్యుల మధ్య భావోద్వేగాలు షోను ఆసక్తికరంగా మార్చాయి. కౌశల్, గీతా మాధురి, సామ్రాట్, తనీష్, రోల్ రైడా, అమిత్ తివారీ, దీప్తి నల్లమోతు తనదైన గేమ్ షోతో ఆకట్టుకొన్నారు. చివరకు టాప్ ఐదుగురిలో కౌశల్, గీతా మాధురి, తనీష్, దీప్తి నల్లమోతు, సామ్రాట్ మిగిలారు. చివరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో కౌశల్ మండా విజేతగా నిలిచారు. గీతా మాధురి రన్నరప్‌గా నిలిచారు. ఆదివారం సాయంత్రం ప్రసారమైన ఫైనల్ లైవ్‌లో టాప్ ఐదుగురిలో తొలుత సామ్రాట్ ఇంటి నుంచి నిష్రమించగా.. ఆ తర్వాత దీప్తి నల్లమోతు, తనీష్ ఇంటి నుంచి బయటకు వచ్చారు.

 టైటిల్ రేసులో కౌశల్, గీతా మాధురి

టైటిల్ రేసులో కౌశల్, గీతా మాధురి

సామ్రాట్, దీప్తి, తనీష్ అవుట్ అయిన తర్వాత ఇంట్లో కౌశల్, గీతా మాధురి టైటిల్‌ పోరులో మిగిలారు. ఇంటిలో మిగిలి ఉన్న తనీష్, గీతా మాధురి వద్దకు వేదిక వద్ద నుంచి నాని ఇంటిలోనికి వెళ్లారు. ఆ తర్వాత వారితో ఇళ్లంతా కలియదిరిగి చూశారు. ఇంటిలోని బెడ్ రూమ్ ఇతర ప్రాంతాలను చూశారు. ఆ తర్వాత వారిని తీసుకొని ప్రధాన ద్వారం నుంచి వేదికపైకి వచ్చారు.

 ముఖ్య అతిథిగా వెంకటేష్

ముఖ్య అతిథిగా వెంకటేష్

వేదికపైన నిలిచిన ఆ ఇద్దరిలో ఎవరు విజేతగా నిలుస్తారనే అంశం ఉత్కంఠగా మారింది. 113 రోజులు సాగిన రియాలిటీ షో విజేతను ప్రకటించడానికి విక్టరీ వెంకటేష్ బిగ్‌బాస్ వేదికపైకి వచ్చారు. వెంకటేష్‌ను సాదరంగా నాని ఆహ్వనించారు. అనంతరం కౌశల్, గీతా మాధురికి అభినందనలు తెలిపారు.

 ఇంట్రస్టింగ్‌గా వెంకటేష్ ఎంట్రీ

ఇంట్రస్టింగ్‌గా వెంకటేష్ ఎంట్రీ

బిగ్‌బాస్ తెలుగు 2 ఫైనల్‌కు ముఖ్య అతిథిగా వెంకటేష్ రాక చాలా ఇంట్రస్టింగ్ ఉంది. విజేతను ప్రకటించడానికి నాని ప్రయత్నిస్తుండగా.. మొదట వెంకటేష్ గొంతు వినిపించింది. ఎవరు అని నాని ప్రశ్నించగా.. ఐదో తరగతిలో నీ ఫేవరేట్ సినిమా ఏంటి? అనగానే బొబ్బిలిరాజా.. ఆరో తరగతిలో ఫేవరేట్ ఏంటి అంటే కూలీ నంబర్ 1, ఏడో తరగతిలో క్షణక్షణం అని చెప్పిన నాని.. గ్రాండ్ వెల్‌కమ్ అంటూ వెంకటేష్‌కు నాని స్వాగతం పలికారు.

విజేతగా కౌశల్‌ను ప్రకటించిన వెంకటేష్

విజేతగా కౌశల్‌ను ప్రకటించిన వెంకటేష్

విజేతను ప్రకటించమని అడుగగా.. వెంకటేష్ బిగ్‌బాస్‌లో నాని జర్నీని చూపించమని అడిగాడు. దాంతో బిగ్‌బాస్ తెలుగు 2లో నాని లైఫ్ జర్నీ చూపించారు. చాలా ఉద్వేగభరితంగా వీడియో సాగింది. అనంతరం నాని విజేతన ప్రకటించడానికి ట్రై చేసి నాతో కాదు అని వెళ్లిపోగా.. వెంకటేష్ వచ్చి విజేతను ప్రకటించారు. కౌశల్ చేయిని పైకి ఎత్తి విజేత అని ప్రకటించడానికి ప్రయత్ని కదరదు అని అన్నారు. నాని టీవీలో విజేతను ప్రకటించడంతో కౌశల్ ఉద్వేగాని గురయ్యాడు. అనంతరం ఆడియెన్స్‌లోకి వెళ్లి తండ్రిని కౌగిలించుకొని ఆనందంలో మునిగిపోయాడు.

రన్నరప్‌గా గీతా మాధురి

రన్నరప్‌గా గీతా మాధురి

కౌశల్‌ను విజేతగా ప్రకటించడంతో గీతా మాధురి బిగ్ బాస్ సీజన్ 2 రన్నరప్‌గా నిలిచింది. రన్నరప్‌గా నిలిచిన తర్వాత గీతా మాధురి లైఫ్ జర్నీని చూపించారు. అప్పుడు ఆమె ఎమోషనల్‌గా మారింది.

 క్యాన్సర్‌ రోగులకు 50 లక్షల విరాళం

క్యాన్సర్‌ రోగులకు 50 లక్షల విరాళం

హైదరాబాద్‌లో జీరోతో అడుగుపెట్టాను. అంచెలంచెలుగా ఎదుగుతూ బిగ్‌బాస్ విజేతగా నిలిచాను. ప్రేక్షకులకు ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకొంటాను. నాకు లభించిన 50 లక్షల పారితోషికాన్ని మా అమ్మ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తాను. మా అమ్మ క్యాన్సర్‌తో మరణించారు. క్యాన్సర్ వ్యాధితో ఏ తల్లి బాధకుండా ఈ డబ్బును ఉపయోగిస్తాను అని కౌశల్ తెలిపారు.

హౌస్‌మేట్స్ కసిని పెంచారు.

హౌస్‌మేట్స్ కసిని పెంచారు.

నాను విజేతగా నిలువడానికి ప్రధాన కారణం నా తోటి సెలబ్రిటీలు. వాళ్లు నాకు గట్టిపోటి ఇవ్వకపోతే నాకు నాలో ఇంత కసి పెరిగేది కాదు. వాళ్లందరూ నాలో కసిని పెంచడంతోనే విజేతగా నిలువాలని మరింత ప్రయత్నించాను.

కౌశల్‌కు ఘన స్వాగతం

విజేతగా మారిన తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన కౌశల్‌కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. (వీడియో)

కౌశల్‌కు గ్రాండ్ వెల్‌కమ్

కౌశల్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన ఫ్యాన్స్, కౌశల్ ఆర్మీ (వీడియో)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X