twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ లాస్య అందుకే అవుట్.. ఆ రెండు విషయాల్లో తప్పుగా.. కౌశల్ మండా కామెంట్స్

    |

    బిగ్‌బాస్ తెలుగు షోలో యాంకర్ లాస్య ప్రయాణం ముగిసింది. 11వ వారంలో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చారు. గతవారం నామినేట్ అయిన ఇంటి సభ్యుల్లో అతి తక్కువగా ఓటింగ్‌ను సొంతం చేసుకోవడంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలో ఆమె ఎలిమినేషన్‌ సమయంలో కౌశల్ మండా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ..

    చిన్నబాబును వదిలి రావడం

    చిన్నబాబును వదిలి రావడం

    యాంకర్ లాస్య పాపులర్ యాంకర్‌గా బిగ్‌బాస్‌లో చాలా డీసెంట్‌గా ఆడారు. ఒక చిన్నపాపను ఇంట్లో వదిలి బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌కు రావడం గొప్ప విషయం. పిల్లల్ని వదిలి రావడమనే బాధను నేను కూడా అనుభవించాను. ఇలాంటి బయటి ఒత్తిడిని పక్కన పెట్టి లోపల ఉండే ప్రెజర్‌ను తట్టుకొని ఆడారు అని బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 విజేత కౌశల్ మండా తన యూట్యూబ్ ఛానెల్‌లో లుక్స్ టీవీలో పేర్కొన్నారు.

    ఫ్యామిలి ఆడియెన్స్ సపోర్టుతో

    ఫ్యామిలి ఆడియెన్స్ సపోర్టుతో

    యాంకర్ లాస్యకు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి చాలా సపోర్ట్ లభించింది. ఆమె డ్రస్సింగ్, లుక్స్ చాలా హోమ్లీగా ఉండటంతో ఎక్కువ మందికి కనెక్ట్ అయ్యారు. ఆమె తన గేమ్‌ను అగ్రెసివ్‌గా ఆడకపోవడం కొంత మైనస్‌గా మారింది. నోయల్‌తో జరిగిన గొడవలో ఆమె కొంచెం అగ్రెసవివ్‌గా కనిపించింది అని కౌశల్ మండా అభిప్రాయపడ్డారు.

    కూల్‌గా, సాఫ్ట్‌గా ఆడితే కుదరదు

    కూల్‌గా, సాఫ్ట్‌గా ఆడితే కుదరదు

    బిగ్‌బాస్ తెలుగు షోలో నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లాలంటే కూల్‌గా, సాఫ్ట్‌గా ఆడటం కుదరదు. ఎక్కువగా అగ్రెసివ్‌గా, మసాలాలను తన గేమ్‌కు యాడ్ చేసి ఆడాలి. ఆ విషయంలో తను ఫెయిల్ అయ్యారు. సేఫ్ గేమ్ ఆడుతూ కనిపించారు అని కౌశల్ మండా తెలిపారు.

    అగ్రెసివ్‌గా ఆడితే నెక్ట్స్ లెవెల్‌కు

    అగ్రెసివ్‌గా ఆడితే నెక్ట్స్ లెవెల్‌కు

    బిగ్‌బాస్‌లో మన నేచురల్ గేమ్‌తోపాటు కొంత అగ్రెసివ్ క్యారెక్టర్‌తో ఆడితే జనం కనెక్ట్ అవుతారు. లాస్య విషయానికి వస్తే బయట కూడా చాలా సాఫ్ట్ అనుకొంటాను. ఇంట్లోనే కూడా అలానే ఉన్నారు. సింపుల‌‌్‌గా, న్యూట్రల్‌గా ఉండటం వలన ఆమె ఎక్కువగా కాంట్రవర్సీలోకి దూరలేదు. అందుకే ఆమె మరో లెవెల్‌కు వెళ్లలేకపోయింది అని కౌశల్ మండా అన్నారు.

    మాస్ ఎలిమింట్స్ లేకుండా

    మాస్ ఎలిమింట్స్ లేకుండా

    తన బిగ్‌బాస్ ప్రయాణంలో ఇంటిలో అందరికీ వంట చేస్తూ బాగా చూసుకొన్నారు. అభిజిత్, హారిక లాంటి క్లాస్ బ్యాచ్‌తో ఎక్కువగా కనిపించారు. బిగ్‌బాస్ షోలో టాప్ 5లో ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని మాస్ ఎలిమింట్స్ ఉండాలి. అలాంటి అంశాలకు దూరంగా ఉండటం కారణంగానే ఆమె మరింత ప్రేక్షకుల ఆదరణ కూడగట్టుకోలేకపోయారు అని కౌశల్ తెలిపారు.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Jordar Sujatha Is Out From Bigg Boss House || Oneindia Telugu
    టాప్ 5 జాబితాలో వీరే..

    టాప్ 5 జాబితాలో వీరే..

    11 వారాల బిగ్‌బాస్ తర్వాత టాప్ 5లో ఎవరు ఉంటారనే విషయంపై స్పందిస్తూ.. సోహెల్, అరియానా, హారిక, అఖిల్, అభిజిత్ టాప్ 5‌లో ఉంటారు. అవినాష్, మోనాల్‌కు ఛాన్స్ ఉంది. అయితే ఇక నాలుగు వారాల గేమ్‌ చాలా టఫ్‌గా మారే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    English summary
    Former Bigg Boss winner Kaushal manda expressed his views on Bigg Boss Telugu 4. He reveals expected top 2 contestant of Bigg Boss Telugu 4. Abijeet, Akhil, Harika, Ariana and Sohel will be in top 5.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X