250 కోట్లతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నా... బిగ్ బాస్ తెలుగు విన్నర్ సంచలన కామెంట్స్
బిగ్ బాస్ అనేది ఎంతో మందికి పాపులారిటీ సాధించిపెట్టింది. బుల్లితెరపై వంద రోజులకు పైగా సాగే ఈ రియాలిటీ షోలో చివరకు విజేత ఒక్కరే నిలుస్తారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 2 విజేత కౌశల్ మంద గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సీజన్ విన్నర్ గా నిలవడం.. అప్పట్లో ఓ సెన్సేషన్. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ తర్వాత కనుమరుగై పోయిన కౌశల్ మంద ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారట. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్లు 7 పూర్తి చేసుకున్నాయి. ఇక మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్టుగా చేయగా.. హీరో శివబాలజీ విన్నర్ గా నిలిచాడు. ఇక ఆ తర్వాత వచ్చిన సీజన్ 2ను నాని హోస్టుగా చేయగా.. కౌశల్ మంద విజేతగా నిలిచాడు. అయితే కౌశల్ మందపై ఇంటి సభ్యులు అప్పట్లో అటాక్ చేయగా.. ఒక్కసారిగా ఆయనకు ఆర్మి కూడా పుట్టుకువచ్చింది. ఇక అప్పట్లో ఓ సెన్సేషన్ గా నిలిచాడు కౌశల్. మొత్తానికి విన్నర్ అయిపోయాడు.

ఇక బిగ్ బాస్ షో అనేది చాలా మందికి పాపులారిటీ తెచ్చిపెట్టేది. మరి కౌశల్ మంద.. షో తర్వాత ఆయన ఎలాంటి సినిమాల్లో కనిపించలేదు. అంతే కాదు కనుమరుగై పోయాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ.. పలు విషయాలపై స్పందిస్తూ ఉన్నాడు కౌశల్ మంద. ఇటీవల బిగ్ బాస్ తెలుగు 7 గురించిన వీడియోలు, కామెంట్స్ చేస్తూ.. మరోసారి వార్తల్లో నిలిచాడు.
ఇక బిగ్ బాస్ తెలుగు 7లో ప్రశాంత్ కు మొదటి నుంచి సపోర్ట్ ఇస్తూ.. తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు కౌశల్ మంద. నిజంగా చెప్పుకోవాలంటే.. కౌశల్ బిగ్ బాస్ హౌస్ కు పోకముందు అయినా సినిమాల్లో కనిపించాడు.. విన్నర్ అయ్యాక ఏ సినిమాలో నటించలేదు. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు కౌశల్ మంద ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కౌశల్ మాట్లాడుతూ... తన కొత్త సినిమా గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. తాను ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. అది కూడా రూ. 250 కోట్లు బడ్జెట్ సినిమా అని చెప్పి షాక్ ఇచ్చాడు. అంతే కాదు... త్వరలో అన్ని డీటెయిల్స్ చెప్తాను.. మీ హీరోలందరూ గెస్ట్ లుగా చేస్తున్నారని చెప్పుకువచ్చాడు. ఇక ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
నువ్వు పాన్ ఇండియా సినిమా చేయడం ఏంటి.. అందులో మా హీరోలు గెస్టులుగా చేయడం ఏంటి అంటూ నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక నిన్ను నమ్మ రూ.250 కోట్లు పెట్టే నిర్మాత ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ సినిమా ఏంటి.. నిజంగానే 250 కోట్లు పెడుతున్నారా అనేది తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











