బిగ్‌బాస్ కౌశల్ భార్యకు ఏమైంది.. ఏం సాధించడానికి వెళ్ళింది.. దానికి అర్దమేంటి?
తెలుగులో బిగ్‌బాస్ షో ద్వారా పాపులర్ అయిన నటుడు కౌశల్ అందరికీ సుపరిచితమే. బిగ్‌బాస్ రెండో సీజన్ విజేతగా నిలిచిన కౌశల్ కు ఎంతమేర ఫాలోయింగ్ ఏర్పడిందో ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. ఏకంగా ఆయన కోసం కౌశల్ ఆర్మీ అంటూ కొంతమంది ఫ్యాన్స్ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు అంటే ఎంత క్రేజ్ ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా కౌశల్ తన భార్యకు సంబంధించి పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

మోడల్ గా ఎంట్రీ
మోడలింగ్ ద్వారా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అడపాదడపా సినిమాలు చేసిన కౌశల్ సీరియల్స్ లో మాత్రం మంచి అవకాశాలు దక్కించుకున్నాడు. కానీ సీరియల్స్ చేసినా రాని క్రేజ్ బిగ్‌బాస్ 2 సీజన్ లోకి ఎంటర్ కాగానే ఆయనకు వచ్చింది. లోపలికి ఎంటరైనప్పటి నుంచి అందరితో కలవకుండా తాను మాత్రమే స్పెషల్ అన్నట్లుగా ఆయన నడుచుకున్న తీరు చాలా మందికి నచ్చింది. అందుకే చాలామంది ఆయనకు అభిమానులుగా మారారు.

అవకాశాల్లేవు
అయితే బిగ్‌బాస్ హౌస్ లో ఉన్న సమయంలోనే తన భార్యకి క్యాన్సర్ ఉందని వెల్లడించిన కౌశల్ తన కోసం ఏమైనా చేస్తాను అని అప్పట్లో వెల్లడించారు.. అయితే ఆ తర్వాత ఆయన హౌస్ బయటకు వచ్చాక పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కలేదు. అడపాదడపా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ తన అభిమానులకు టచ్ లో ఉంటున్నాడు.

వీడియో షేర్ చేసి
ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు తాజాగా తన భార్య కు సంబంధించిన ఒక వీడియో షేర్ చేసిన కౌశల్ అందులో కాస్త ఎమోషనల్ గా కామెంట్స్ రాసుకొచ్చాడు. నువ్వు ఏదో సాధించడానికి వెళ్లావు, నువ్వు ఏదో చేయడానికి నీ జీవితంలో పోరాడుతున్నావు, నీ ధైర్యంతో నువ్వు ఏదైనా చేయగలవని నేను నమ్ముతున్నాను, త్వరగా కోలుకో మళ్లీ నీ కలల కోసం పోరాడు, లవ్ యు, మిస్ యు అంటూ ఆయన కామెంట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Recommended Video
ఆమెకు ఏమైంది ?
దీంతో అసలు ఆమెకు ఏమైంది ? ఎక్కడికి వెళ్ళింది ? అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే గతంలో కొన్ని వివాదాలు జరిగిన సమయంలో తన భార్య నీలిమ ఆరోగ్యం గురించి చెబుతూ ఆయన కొన్ని విషయాలు వెల్లడించడంతో ఇప్పుడు కూడా అనారోగ్య కారణాలతో ఏదైనా చికిత్స తీసుకోవడానికి వెళ్ళింది ఏమో అని ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు ఏమైంది అనే అంశం మీద కౌశల్ క్లారిటీ ఇస్తే కానీ చెప్పలేం.


Click it and Unblock the Notifications











