తనీష్, కౌశల్ ఫైట్.. హౌస్ అల్లకల్లోలం.. బిగ్‌బాస్‌కు చుక్కలు.. ఇంటి నుంచి పంపిస్తానని హెచ్చరిక

Recommended Video

Bigg Boss Season 2 Telugu: 101 Day Highlights

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటిలో ఇంటి సభ్యుల ఆగడాలు మితిమించి పోతున్నాయి. అసంతృప్తి, అసహనం పెరిగిపోవడంతో ఒకరిపై మరొకరు శారీరక దాడులకు దిగడానికి సిద్ధమవుతున్నారు. కెప్టెన్సీ టాస్క్‌ను రద్దు చేసి అందర్ని ఈ వారం నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటి సభ్యుల మధ్య ముఖ్యంగా కౌశల్ వర్సెస్ ఇతర సభ్యులతో భారీగా వాగ్వాదం జరిగింది. ఇలాంటి ఉద్విగ్న పరిస్థితుల్లో బిగ్‌బాస్ నిర్వహించిన రేస్ టు ఫైనల్ టాస్క్ మరింత విద్వేషాలను రెచ్చగొట్టింది. ఇంకా ఏమి జరిగిందంటే..

సామ్రాట్, కౌశల్ మధ్య

సామ్రాట్, కౌశల్ మధ్య

100 రోజు ప్రారంభం కాగానే గతవారానికి సంబంధించిన గొడవలపై చర్చ జరిగింది. పిరమిడ్ టాస్క్‌లో నాపై రబ్బరు బంతితో మీరు దాడి చేయడం నాకు నచ్చలేదు. ఒక్కసారి అంటే ఒకే.. కానీ పదిసార్లు కావాల్సుకొని కొట్టారు. అందుకే నేను అలా అన్నాను అని సామ్రాట్‌తో కౌశల్ అన్నాడు. దాంతో వారి మధ్య చర్చ మరోసారి తీవ్రస్థాయిలో జరిగింది.

మీరు బిగ్‌బాస్ మాదిరిగా

మీరు బిగ్‌బాస్ మాదిరిగా

కౌశల్ ఎవరూ నిన్ను దూరం పెట్టలేదు. మీరు చేసే కామెంట్ల కారణంగానే దూరం పెరిగింది. ఇంట్లో మీరు చేసే కామెంట్లు బిగ్‌బాస్ కంటే ఎక్కువగా ఉంటున్నాయి. మీరే బిగ్‌బాస్ మాదిరిగా వ్యవహరిస్తున్నారు. అలా చేయకుండా ఉంటే మన మధ్య దూరం పెరిగేది కాదు అని సామ్రాట్ పేర్కొన్నారు.

రేస్ టు ఫినాలే టాస్క్‌లో

రేస్ టు ఫినాలే టాస్క్‌లో

ఇక ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ రేస్ టు ఫినాలే టాస్క్‌ను ఇచ్చాడు. దాని ప్రకారం ఓ కంటైనర్‌లో ఉన్న ఇసుకను కాపాడుకోవాలి. మరో గ్రూప్ ఏ వ్యక్తికి సంబంధించిన కంటైనర్‌లో ఇసుక లేకుండా చేసుకోవచ్చు. చివరకు ఎవరి కంటైనర్‌లో ఎక్కువ ఇసుక ఉంటుందో అతడిని లెవల్‌2కు ఎంపికైనట్టు భావిస్తారు అని బిగ్‌బాస్ రూల్స్ చెప్పారు.

ఒకరిపై మరొకరు దాడులు

ఒకరిపై మరొకరు దాడులు

రేస్ టు ఫినాలే టాస్క్ కోసం రెండు జట్లుగా విభజించారు. మొదటి దఫా కౌశల్, రోల్ రైడా, గీతా మాధురి ఒక జట్టుగా, రెండో జట్టుగా సామ్రాట్, తనీష్, దీప్తి ఏర్పడ్డారు. కౌశల్‌ తొట్టిలో ఉన్న ఇసుకను సామ్రాట్, తనీష్ కింద పడేశారు. తొట్టిని పూర్తిగా వారిద్దరూ ధ్వంసం చేశారు. గీతా ఇసుక తొట్టిని కౌశల్, దీప్తి పడేశారు. అలాగే రోల్ రైడా ఇసుక తొట్టిని కౌశల్ పడేసి ఇసుక లేకుండా చేయాలని ప్రయత్నించారు.

శారీరక దాడులు

శారీరక దాడులు

రేస్ టూ ఫినాలే టాస్క్‌లో ఇసుక లేకుండా చేయడమనే విషయం శారీరక దాడులకు దారి తీసింది. కౌశల్, తనీష్‌ మధ్య భారీగా గొడవ జరిగింది. దాంతో బిగ్‌బాస్ హౌస్ ఉద్రిక్తంగా మారింది. ఆ క్రమంలో బిగ్‌బాస్ జోక్యం చేసుకొని తనీష్, కౌశల్‌ను ఇంటి నుంచి బయటకు పంపిస్తాను అని హెచ్చరించాడు. ఆ తర్వాత కూడా టాస్క్ అదే విధంగా కొనసాగడంతో టాస్క్‌ను నిలిపివేశారు.

రోల్ రైడా మరో లెవెల్‌కు

రోల్ రైడా మరో లెవెల్‌కు

చివరకు ఎవరి తొట్టిలో ఎక్కువ ఇసుకు ఉందో చెప్పాలని సామ్రాట్‌ను ఆదేశించగా.. అన్ని కంటైనర్లను పరిశీలించిన తర్వాత రోల్ రైడా తొట్టిలో ఎక్కువ ఇసుక ఉంది అని చెప్పారు. దాంతో రేస్ టూ ఫినాలే టాస్క్ రెండో లెవెల్‌కు రైడాను పంపించాడు.

గీతా మాధురి అసహనం

గీతా మాధురి అసహనం

ఇక రెండో రోజు రేస్ టు ఫినాలే కోసం తనీష్, సామ్రాట్, రోల్ రైడా వ్యూహాలు పన్నారు. మా ఇద్దరిని సేఫ్‌గా ఉండేలా చూసుకోమని రైడాకు తనీష్ సూచించాడు. దీప్తిని గీతామాధురి చూసుకొంటుందని చెప్పాడు. ఇలా రెండో రోజు టాస్క్ కోసం ఇలా ప్లాన్ చేశారు. రోల్ రైడాకు సామ్రాట్, తనీష్ మద్దతు తెలపడంపై గీతా అసహనం వ్యక్తం చేసింది. వారి మధ్య డీల్ కుదిరిందని దీప్తితో గీతా వాపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X